search
×

Stock Market Today: జూన్‌ నెల పీఎంఐ డేటా ఎఫెక్ట్‌! ఫ్లాట్‌గా ట్రేడవుతున్న నిఫ్టీ, సెన్సెక్స్‌

Stock Market Opening 5 July 2023: స్టాక్‌ మార్కెట్లు బుధవారం ఫ్లాట్‌గా మొదలయ్యాయి. జూన్‌ నెల పీఎంఐ డేటా రావడం, కంపెనీల ఫలితాలు విడుదల అవుతుండటంతో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు.

FOLLOW US: 
Share:

Stock Market Opening 5 July 2023:

స్టాక్‌ మార్కెట్లు బుధవారం ఫ్లాట్‌గా మొదలయ్యాయి. జూన్‌ నెల పీఎంఐ డేటా రావడం, కంపెనీల ఫలితాలు విడుదల అవుతుండటంతో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు.  ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 2 పాయింట్లు తగ్గి 19,387 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 39 పాయింట్లు తగ్గి 65,439 వద్ద కొనసాగుతున్నాయి. 

BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)

క్రితం సెషన్లో 65,479 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 65,493 వద్ద మొదలైంది. 65,317 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 65,584 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 10:30 గంటలకు 39 పాయింట్ల నష్టంతో 65,439 వద్ద కొనసాగుతోంది.

NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)

మంగళవారం 19,389 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ బుధవారం 19,405 వద్ద ఓపెనైంది. 19,344 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 19,421 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 2 పాయింట్ల నష్టంతో 19,387 వద్ద ట్రేడవుతోంది.

Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)

నిఫ్టీ బ్యాంక్‌ నష్టపోయింది. ఉదయం 45,169 వద్ద మొదలైంది. 45,091 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 45,418 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 103 పాయింట్లు తగ్గి 45,198 వద్ద చలిస్తోంది.

Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)

నిఫ్టీ 50లో 32 కంపెనీలు లాభాల్లో 18 నష్టాల్లో ఉన్నాయి. దివిస్‌ ల్యాబ్‌, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, హీరోమోటో, ఓఎన్జీసీ షేర్లు లాభపడ్డాయి. హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, టాటా కన్జూమర్‌, హిందాల్కో, విప్రో షేర్లు నష్టపోయాయి. రియాల్టీ సూచీ తగ్గింది. ఆటో, క్యాపిటల్‌ గూడ్స్‌, ఎఫ్‌ఎంసీజీ, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌, పవర్‌ సూచీలు ఎగిశాయి. 

బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)

నేడు విలువైన లోహాల ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.100 పెరిగి రూ.59,060గా ఉంది. కిలో వెండి రూ.200 తగ్గి రూ.71,700 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.210 పెరిగి రూ.24,020 వద్ద ఉంది. 

Also Read:  అద్దెకు ఉంటున్నారా! టెనెంట్‌గా ఈ హక్కులు మీకున్నాయని తెలుసా!

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

Join Us on Telegram: https://t.me/abpdesamofficial 

Published at : 05 Jul 2023 11:07 AM (IST) Tags: Nifty Bank Nifty Stock Market Telugu Stock Market Sensex

ఇవి కూడా చూడండి

Trisha: త్రిష ఇంట విషాదం... క్రిస్మస్ రోజు కుమారుడిని కోల్పోయానంటూ హీరోయిన్ ఎమోషనల్

Trisha: త్రిష ఇంట విషాదం... క్రిస్మస్ రోజు కుమారుడిని కోల్పోయానంటూ హీరోయిన్ ఎమోషనల్

Year Ender 2024: 2024లో పెట్టుబడిదార్లను ధనవంతులుగా మార్చిన టాప్‌-10 మ్యూచువల్ ఫండ్స్‌

Year Ender 2024: 2024లో పెట్టుబడిదార్లను ధనవంతులుగా మార్చిన టాప్‌-10 మ్యూచువల్ ఫండ్స్‌

New Mutual Fund: 'స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్‌' - అధిక లాభాలు కోరుకునే హైరిస్క్‌ ఇన్వెస్టర్లకు బెస్ట్‌ ఆప్షన్‌!

New Mutual Fund: 'స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్‌' - అధిక లాభాలు కోరుకునే హైరిస్క్‌ ఇన్వెస్టర్లకు బెస్ట్‌ ఆప్షన్‌!

SIP Strategies: మ్యూచువల్‌ ఫండ్స్‌ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు

SIP Strategies: మ్యూచువల్‌ ఫండ్స్‌ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు

Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే"కింగ్‌" ఎంట్రీ - జియోకి గ్రీన్‌ సిగ్నల్‌

Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే

టాప్ స్టోరీస్

KTR: మళ్లీ ఈడీ నోటీసులు - సత్యం కోసం పోరాటం కొనసాగుతుందన్న కేటీఆర్

KTR: మళ్లీ ఈడీ నోటీసులు - సత్యం కోసం పోరాటం కొనసాగుతుందన్న కేటీఆర్

Green Talent: గ్రీన్ టాలెంట్‌పై ఏపీ ప్రభుత్వం దృష్టి - సుజ్లాన్‌తో ప్రత్యేక ఒప్పందం - ఏడున్నర లక్షల ఉద్యోగాలు..

Green Talent: గ్రీన్ టాలెంట్‌పై ఏపీ ప్రభుత్వం దృష్టి - సుజ్లాన్‌తో ప్రత్యేక ఒప్పందం - ఏడున్నర లక్షల ఉద్యోగాలు..

Thief Kisses Woman: ఏమీ దొరకలేదని ఇంటావిడకు ముద్దు పెట్టి వెల్లిన దొంగోడు - ఆమె కోవై సరళ అవతారమే ఎత్తిందంతే !

Thief Kisses Woman: ఏమీ దొరకలేదని ఇంటావిడకు ముద్దు పెట్టి వెల్లిన దొంగోడు - ఆమె కోవై సరళ అవతారమే ఎత్తిందంతే !

Clash at BJP office Nampally: బీజేపీ ఆఫీసు వద్ద ఉద్రిక్తత- కర్రలతో కొట్టుకున్న బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు - కారణం ఏంటంటే

Clash at BJP office Nampally: బీజేపీ ఆఫీసు వద్ద ఉద్రిక్తత- కర్రలతో కొట్టుకున్న బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు - కారణం ఏంటంటే