By: ABP Desam | Updated at : 30 Nov 2022 11:28 AM (IST)
Edited By: Ramakrishna Paladi
స్టాక్ మార్కెట్ అప్డేట్
Stock Market Opening 30 November 2022:
భారత స్టాక్ మార్కెట్లు బుధవారం ఫ్లాట్‌గా ట్రేడవుతున్నాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు వచ్చాయి. జీడీపీ డేటా విడుదలకు ముందు మదుపర్లు అప్రమత్తంగా ఉన్నారు. ఎక్కువ కొనుగోళ్లు చేపట్టడం లేదు. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 16 పాయింట్ల లాభంతో 18,634 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 40 పాయింట్ల లాభంతో 62,717 వద్ద కొనసాగుతున్నాయి.
BSE Sensex
క్రితం సెషన్లో 62,681 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 62,743 వద్ద మొదలైంది. 62,648 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 62,865 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 11 గంటలకు 40 పాయింట్ల లాభంతో 62,717 వద్ద కొనసాగుతోంది.
NSE Nifty
మంగళవారం 18,618 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ బుధవారం 18,625 వద్ద ఓపెనైంది. 18,616 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 18,679 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 16 పాయింట్ల లాభంతో 18,634 వద్ద చలిస్తోంది.
Nifty Bank
నిఫ్టీ బ్యాంక్ నష్టాల్లో ఉంది. ఉదయం 43,122 వద్ద మొదలైంది. 42,923 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 43,252 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 104 పాయింట్ల లాభంతో 42,948 వద్ద ట్రేడవుతోంది.
Gainers and Lossers
నిఫ్టీ 50లో 30 కంపెనీలు లాభాల్లో 19 నష్టాల్లో ఉన్నాయి. హిందాల్కో, ఎం అండ్ ఎం, బజాజ్ ఆటో, డాక్టర్ రెడ్డీస్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ లాభపడ్డాయి. అపోలో హాస్పిటల్స్, ఎస్‌బీఐ, హెచ్‌సీఎల్ టెక్, ఇండస్ ఇండ్ బ్యాంక్, టెక్ మహీంద్రా నష్టాల్లో ఉన్నాయి. ఆటో, మెటల్, రియాల్లీ రంగాల షేర్లకు డిమాండ్ పెరిగింది. బ్యాంకు, ఐటీ, కన్జూమర్ డ్యురబుల్స్ సెల్లింగ్ ప్రెజర్ ఎదుర్కొంటున్నాయి.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Mutual Funds: మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్టర్లకు భారీ ఊరట, ఇకపై ఒకరోజు ముందే ఖాతాలోకి డబ్బు
Stock Market Crash: రక్తమోడుతున్న స్టాక్ మార్కెట్లు - లక్షల కోట్ల నష్టంతో ఇన్వెస్టర్ల కన్నీరు!
Stock Market News: చల్లారని అదానీ హిండెన్ బర్గ్ కుంపటి - పతనం దిశగా స్టాక్ మార్కెట్లు!
Stock Market News: తల్లడిల్లిన ఇన్వెస్టర్లు - ఉద్యోగ కోతలతో మాంద్యం భయాలు, పతనమైన సూచీలు!
Stock Market News: స్టాక్ మార్కెట్లో కల్లోలం - గంటలో రూ.2.5 లక్షల కోట్లు లాస్!
BRS Parliamentary Party Meeting: బీఆర్ఎస్ ఎంపీలతో సీఎం కేసీఆర్ భేటీ - ముఖ్యంగా ఆ విషయాలపైనే ఫోకస్ !
Ramana Dikshitulu : ఏపీలో ఆలయాల పరిస్థితి దయనీయం, రమణ దీక్షితులు సంచలన వ్యాఖ్యలు
Australian Open 2023: 2023ను రికార్డుతో మొదలెట్టిన ‘జోకర్’ - తొమ్మిదో ఆస్ట్రేలియన్ ఓపెన్ సొంతం!
మొన్న బాలకృష్ణ, నేడు చిరంజీవి - వివాదాలకు కేరాఫ్ గా సక్సెస్ మీట్లు? ఇంతకీ ఏమైంది?