search
×

Stock Market News: ఆల్‌టైమ్‌ హై వైపు పరుగులు - ఇంట్రాడేలో 63,026 టచ్‌ చేసిన సెన్సెక్స్‌!

Stock Market Opening 29 May 2023: స్టాక్‌ మార్కెట్లు సోమవారం పరుగులు పెడుతున్నాయి. అమెరికా డెట్‌ సీలింగ్‌ అంశం సద్దుమణగడం ఇన్వెస్టర్లలో పాజిటివ్‌ సెంటిమెంటుకు దారితీసింది.

FOLLOW US: 
Share:

Stock Market Opening 29 May 2023: 

స్టాక్‌ మార్కెట్లు సోమవారం పరుగులు పెడుతున్నాయి. గ్లోబల్‌ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందాయి. అమెరికా డెట్‌ సీలింగ్‌ అంశం సద్దుమణగడం ఇన్వెస్టర్లలో పాజిటివ్‌ సెంటిమెంటుకు దారితీసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 131 పాయింట్లు పెరిగి 18,630 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 487 పాయింట్లు ఎగిసి 62,989 వద్ద కొనసాగుతున్నాయి. 

BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)

క్రితం సెషన్లో 62,501 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 62,801 వద్ద మొదలైంది. 62,801 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 63,026 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 11 గంటలకు 487 పాయింట్ల లాభంతో 62,989 వద్ద కొనసాగుతోంది.

NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)

శుక్రవారం 18,499 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ సోమవారం 18,619 వద్ద ఓపెనైంది. 18,584 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 18,641 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 131 పాయింట్లు పెరిగి 18,630 వద్ద ట్రేడవుతోంది.

Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)

నిఫ్టీ బ్యాంక్‌ లాభాల్లో కొనసాగుతోంది. ఉదయం 44,276 వద్ద మొదలైంది. 44,193 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 44,458 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 420 పాయింట్లు పెరిగి 44,438 వద్ద కొనసాగుతోంది.

Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)

నిఫ్టీ 50లో 38 కంపెనీలు లాభాల్లో 12 నష్టాల్లో ఉన్నాయి. ఎంఅండ్‌ఎం, హిందాల్కో, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఐటీసీ లాభపడ్డాయి. ఓఎన్‌జీసీ, సన్‌ఫార్మా, దివిస్‌ ల్యాబ్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, మారుతీ షేర్లు నష్టపోయాయి. ఐటీ, మీడియా, ఫార్మా, హెల్త్‌కేర్‌, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ సూచీలు ఎరుపెక్కాయి. బ్యాంకు, ఆటో, ఫైనాన్స్‌, ఎఫ్‌ఎంసీజీ, మెటల్‌, పీఎస్‌యూ బ్యాంక్‌, ప్రైవేట్‌ బ్యాంక్‌ సూచీలు ఎగిశాయి.

బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)

నేడు విలువైన లోహాల ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర  రూ.60,600గా ఉంది. కిలో వెండి  రూ.73,000 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.90 పెరిగి రూ.27,240 వద్ద ఉంది.

Also Read: మార్కెట్‌ నుంచి డబ్బులు సంపాదించే మార్గం!, ఇలాంటి 'వాల్యూ బయ్స్‌' మీ దగ్గర ఉన్నాయా?

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

Published at : 29 May 2023 11:21 AM (IST) Tags: Stock Market Update stock market today Stock Market Telugu Share Market Stock Market news

ఇవి కూడా చూడండి

SIP Strategies: మ్యూచువల్‌ ఫండ్స్‌ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు

SIP Strategies: మ్యూచువల్‌ ఫండ్స్‌ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు

Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే"కింగ్‌" ఎంట్రీ - జియోకి గ్రీన్‌ సిగ్నల్‌

Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే

Mutual Funds: మీ డబ్బును వేగంగా రెట్టింపు చేసే 5 ఫండ్స్, 15-20 ఏళ్లు ఎదురు చూడాల్సిన అవసరం లేదు

Mutual Funds: మీ డబ్బును వేగంగా రెట్టింపు చేసే 5 ఫండ్స్, 15-20 ఏళ్లు ఎదురు చూడాల్సిన అవసరం లేదు

Investment Tips: నెలకు రూ.20 వేలతో మూడేళ్లలో రూ.12 లక్షలు - అద్భుతం చేసిన ELSS ఫండ్స్‌

Investment Tips: నెలకు రూ.20 వేలతో మూడేళ్లలో రూ.12 లక్షలు - అద్భుతం చేసిన ELSS ఫండ్స్‌

Investment For Children: ట్రెండ్‌ మారింది, చిల్డ్రన్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి పెట్టుబడుల వరద

Investment For Children: ట్రెండ్‌ మారింది, చిల్డ్రన్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి పెట్టుబడుల వరద

టాప్ స్టోరీస్

Telangana News: ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త, వారికి సైతం సమానంగా చెల్లింపు

Telangana News: ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త, వారికి సైతం సమానంగా చెల్లింపు

Pawan Kalyan: తూర్పు తీరంలో దేశ భద్రతకు ముప్పు, ఉగ్రవాది కసబ్ ఎలా వచ్చాడు- పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు

Pawan Kalyan: తూర్పు తీరంలో దేశ భద్రతకు ముప్పు, ఉగ్రవాది కసబ్ ఎలా వచ్చాడు- పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు

Audi Q7 Facelift: ఆడీ క్యూ7 ఫేస్‌లిఫ్ట్ వచ్చేసింది - ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయి?

Audi Q7 Facelift: ఆడీ క్యూ7 ఫేస్‌లిఫ్ట్ వచ్చేసింది - ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయి?

Kakinada Pawan Kalyan: కాంప్రమైజ్ అయిపోయారా - రైస్ స్మగ్లింగ్‌లో టీడీపీ ఎమ్మెల్యేపై పవన్ ఆగ్రహం - కాకినాడ పోర్టులో తనిఖీలు

Kakinada Pawan Kalyan: కాంప్రమైజ్ అయిపోయారా - రైస్ స్మగ్లింగ్‌లో టీడీపీ ఎమ్మెల్యేపై పవన్ ఆగ్రహం - కాకినాడ పోర్టులో తనిఖీలు