By: Rama Krishna Paladi | Updated at : 27 Jun 2023 11:04 AM (IST)
స్టాక్ మార్కెట్ అప్డేట్
Stock Market Opening 27 June 2023:
స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాల్లో మొదలయ్యాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందాయి. ఫియర్ ఇండెక్స్ విక్స్ కాస్త తగ్గింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 29 పాయింట్లు పెరిగి 18,721 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 109 పాయింట్లు పెరిగి 63,721 వద్ద కొనసాగుతున్నాయి. రియాల్టీ, మెటల్ సూచీలు పెరిగాయి.
BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)
క్రితం సెషన్లో 62,970 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 63,151 వద్ద మొదలైంది. 63,065 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 63,205 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 10:30 గంటలకు 109 పాయింట్ల లాభంతో 63,079 వద్ద కొనసాగుతోంది.
NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)
సోమవారం 18,691 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ మంగళవారం 18,748 వద్ద ఓపెనైంది. 18,716 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 18,763 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 29 పాయింట్ల లాభంతో 18,721 వద్ద ట్రేడ్ అవుతోంది.
Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)
నిఫ్టీ బ్యాంక్ లాభపడింది. ఉదయం 43,804 వద్ద మొదలైంది. 43,693 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 43,805 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 73 పాయింట్లు పెరిగి 43,714 వద్ద చలిస్తోంది.
Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)
నిఫ్టీ 50లో 31 కంపెనీలు లాభాల్లో 19 నష్టాల్లో ఉన్నాయి. అపోలో హాస్పిటల్స్, భారతీ ఎయిర్టెల్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, టాటా మోటార్స్, టాటా స్టీల్ షేర్లు లాభపడ్డాయి. సిప్లా, ఇండస్‌ఇండ్ బ్యాంక్, టైటాన్, యూపీఎల్, సన్‌ఫార్మా షేర్లు నష్టపోయాయి. ఎఫ్‌ఎంసీజీ, ఫార్మా సూచీలు స్వల్పంగా ఎరుపెక్కాయి. ఆటో, ఐటీ, మీడియా, మెటల్, పీఎస్‌యూ బ్యాంక్, ప్రైవేటు బ్యాంకు, రియాల్టీ, హెల్త్‌కేర్ సూచీలు ఎగిశాయి.
బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)
నేడు విలువైన లోహాల ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.100 పెరిగి రూ.59,280గా ఉంది. కిలో వెండి రూ.500 తగ్గి రూ.70,900 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.290 తగ్గి రూ.24,170 వద్ద ఉంది.
Also Read: చదువు, జాబ్ కోసం ఫారిన్ వెళ్తున్నారా?, ఈ 5 పనులు పూర్తి చేశాకే ఫ్లైట్ ఎక్కండి
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
Investors must link their Permanent Account Number (PAN) with Aadhaar Card by June 30, 2023. If not done, investors will not be able to trade in securities market.
— NSE India (@NSEIndia) June 27, 2023
For more info, visit https://t.co/soUrDl1QQ5#NSE #NSEIndia #InvestorAwareness #StockMarket @ashishchauhan pic.twitter.com/U3ajxmD9nw
Press Release: Asset under Management (AUM) of Passive Funds (ETF and Index Funds) tracking Nifty Indices crosses Rs. 5 Trillion https://t.co/yH7n0yuBUT#NSEIndices #NSE #NSEIndia #PassiveInvestment #Index #ETF #PassiveFunds #Nifty #Nifty50 @ashishchauhan @Agarwal_Mukesh_ pic.twitter.com/dRdGeqiWcw
— NSE India (@NSEIndia) June 26, 2023
SIP Strategies: మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు
Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే"కింగ్" ఎంట్రీ - జియోకి గ్రీన్ సిగ్నల్
Mutual Funds: మీ డబ్బును వేగంగా రెట్టింపు చేసే 5 ఫండ్స్, 15-20 ఏళ్లు ఎదురు చూడాల్సిన అవసరం లేదు
Investment Tips: నెలకు రూ.20 వేలతో మూడేళ్లలో రూ.12 లక్షలు - అద్భుతం చేసిన ELSS ఫండ్స్
Investment For Children: ట్రెండ్ మారింది, చిల్డ్రన్ మ్యూచువల్ ఫండ్స్‌లోకి పెట్టుబడుల వరద
Andhra News: ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్ఫోన్లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
Devi Sri Prasad: ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
Group 3 Exams: భార్యకు పరీక్ష, భర్తకు బాధ్యత - గ్రూప్ 3 పరీక్షా కేంద్రాల వద్ద వైరల్ 'సిత్రాలు'
Pushpa 2 Trailer: మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!