By: Rama Krishna Paladi | Updated at : 26 Jun 2023 10:47 AM (IST)
స్టాక్ మార్కెట్ అప్డేట్ ( Image Source : Getty )
Stock Market Opening 26 June 2023:
స్టాక్ మార్కెట్లు సోమవారం ఫ్లాట్ నోట్‌లో మొదలయ్యాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి మిక్స్‌డ్ సిగ్నల్స్ అందాయి. ఇన్వెస్టర్లు ఆచితూచి కొనుగోళ్లు చేస్తున్నారు. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 2 పాయింట్లు పెరిగి 18,673 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 20 పాయింట్లు తగ్గి 62,958 వద్ద కొనసాగుతున్నాయి. ఎఫ్‌ఎంసీజీ, ఆటో ఇండస్ట్రీ షేర్లకు గిరాకీ పెరిగింది.
BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)
క్రితం సెషన్లో 62,979 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 62,946 వద్ద మొదలైంది. 62,915 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 63,136 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 10:30 గంటలకు 20 పాయింట్ల నష్టంతో 62,958 వద్ద కొనసాగుతోంది.
NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)
శుక్రవారం 18,665 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ సోమవారం 18,682 వద్ద ఓపెనైంది. 18,656 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 18,722 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 8 పాయింట్ల లాభంతో 18,673 వద్ద ట్రేడ్ అవుతోంది.
Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)
నిఫ్టీ బ్యాంక్ ఫ్లాట్‌గా చలిస్తోంది. ఉదయం 43,714 వద్ద మొదలైంది. 43,592 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 43,773 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 2 పాయింట్లు పెరిగి 43,624 వద్ద కంటిన్యూ అవుతోంది.
Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)
నిఫ్టీ 50లో 30 కంపెనీలు లాభాల్లో 20 నష్టాల్లో ఉన్నాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్, టాటా కన్జూమర్, సిప్లా, హీరో మోటో, యూపీఎల్ షేర్లు లాభపడ్డాయి. టీసీఎస్, టాటా స్టీల్, ఎన్టీపీసీ, కోల్ ఇండియా, గ్రాసిమ్ షేర్లు నష్టపోయాయి. ఫైనాన్స్, ఐటీ, పీఎస్‌యూ బ్యాంక్, రియాల్టీ సూచీలు ఎరుపెక్కాయి. ఆటో, ఎఫ్‌ఎంసీజీ, ఫార్మా సూచీలు ఎగిశాయి.
బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)
నేడు విలువైన లోహాల ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.100 పెరిగి రూ.59,280గా ఉంది. కిలో వెండి రూ.500 తగ్గి రూ.70,900 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.290 తగ్గి రూ.24,170 వద్ద ఉంది.
Also Read: పీపీఎఫ్ అకౌంట్ క్లోజ్ చేయాలా?, ప్రాసెస్ చాలా సింపుల్
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
A New Milestone #Sensex #OptionsTrading #futurestrading #BSE #BSEIndia #BSX #FridayExpiry pic.twitter.com/L9X3khFLxM
— BSE India (@BSEIndia) June 23, 2023
In this segment of #LetsTalkFinance, let's understand what Closing Price is!#InvestorAwareness #StockMarket #InvestorEducation #ShareMarket #StockMarketIndia #StockMarket #Investor #Investment #ClosingPrice pic.twitter.com/2Sg8ykdI7c
— NSE India (@NSEIndia) June 26, 2023
SIP Strategies: మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు
Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే"కింగ్" ఎంట్రీ - జియోకి గ్రీన్ సిగ్నల్
Mutual Funds: మీ డబ్బును వేగంగా రెట్టింపు చేసే 5 ఫండ్స్, 15-20 ఏళ్లు ఎదురు చూడాల్సిన అవసరం లేదు
Investment Tips: నెలకు రూ.20 వేలతో మూడేళ్లలో రూ.12 లక్షలు - అద్భుతం చేసిన ELSS ఫండ్స్
Investment For Children: ట్రెండ్ మారింది, చిల్డ్రన్ మ్యూచువల్ ఫండ్స్‌లోకి పెట్టుబడుల వరద
Revanth Reddy on Allu Arjun: పుష్ప 2 హీరో అల్లు అర్జున్ను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి, ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ హ్యాపీ
Royal Enfield Retro Bike: రెట్రో థీమ్‌తో రాయల్ ఎన్ఫీల్డ్ కొత్త బైక్ - ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
Team India: పాకిస్తాన్‌కు బిగ్ షాక్ - భారత జట్టు అక్కడికి వెళ్లేది లేదని విదేశాంగ శాఖ క్లారిటీ
Samantha Father Death: సమంత ఇంట్లో విషాదం... తండ్రిని కోల్పోయిన స్టార్ హీరోయిన్