search
×

Sensex Today: ఊపు తెచ్చిన గిఫ్ట్‌ నిఫ్టీ! 19,500 దిగువన్న ట్రేడవుతున్న నిఫ్టీ

Stock Market Opening 24 August 2023: స్టాక్‌ మార్కెట్లు గురువారం స్వల్ప లాభాల్లో మొదలయ్యాయి. ఆసియా మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు వచ్చాయి.

FOLLOW US: 
Share:

Stock Market Opening 24 August 2023:

స్టాక్‌ మార్కెట్లు గురువారం స్వల్ప లాభాల్లో మొదలయ్యాయి. ఆసియా మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు వచ్చాయి. గిఫ్ట్‌ నిఫ్టీ గ్రీన్‌లో ట్రేడవ్వడంతో ఇన్వెస్టర్లలో పాజిటివ్‌ సెంటిమెంటుకు దారితీసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 37 పాయింట్లు పెరిగి 19,481 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 142 పాయింట్లు పెరిగి 65,576 వద్ద కొనసాగుతున్నాయి. రియల్‌ ఎస్టేట్‌ రంగం కళకళలాడుతోంది. కోఫోర్జ్‌, మణప్పురం, హెచ్‌డీఎఫ్సీ బ్యాంకు, జియో ఫైనాన్స్‌ షేర్లు యాక్టివ్‌గా ట్రేడవుతున్నాయి.

BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)

క్రితం సెషన్లో 65,433 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 65,722 వద్ద మొదలైంది. 65,561 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 65,913 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 11 గంటలకు 142 పాయింట్ల లాభంతో 65,576 వద్ద కొనసాగుతోంది.

NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)

బుధవారం 19,444 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ గురువారం 19,535 వద్ద ఓపెనైంది. 19,479 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 19,584 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 37 పాయింట్లు పెరిగి 19,481 వద్ద ట్రేడవుతోంది.

Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)

నిఫ్టీ బ్యాంక్‌ ఎగిసింది. ఉదయం 44,704 వద్ద మొదలైంది. 44,613 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 44,949 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 179 పాయింట్లు పెరిగి 44,658 వద్ద కొనసాగుతోంది.

Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)

నిఫ్టీ 50లో 34 కంపెనీలు లాభాల్లో 17 నష్టాల్లో ఉన్నాయి. బీపీసీఎల్‌, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఏసియన్‌ పెయింట్స్‌, అల్ట్రాటెక్‌ సెమ్‌ షేర్లు లాభపడ్డాయి. జియో ఫైనాన్స్‌, హిందాల్కో, ఎన్టీపీసీ, టీసీఎస్‌, ఎం అండ్‌ ఎం షేర్లు నష్టపోయాయి. ఆటో మినహా అన్ని రంగాల సూచీలు ఎగిశాయి. బ్యాంకు, ఫైనాన్స్‌, ఐటీ, మీడియా, మెటల్‌, రియాల్టీ రంగాలు కళకళలాడుతున్నాయి.

బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)

నేడు విలువైన లోహాల ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.220 పెరిగి రూ.59,450 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి రూ.1600 పెరిగి రూ.76,900 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.80 పెరిగి రూ.24,720 వద్ద ఉంది.

Also Read: పోస్టాఫీస్‌ సేవింగ్స్‌ అకౌంట్‌ రూల్స్‌ మారాయి, మీరు కచ్చితంగా తెలుసుకోవాలి

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

Published at : 24 Aug 2023 11:30 AM (IST) Tags: Nse Nifty Share Market Nifty Bank BSE Sensex Stock Market update

ఇవి కూడా చూడండి

SIP Strategies: మ్యూచువల్‌ ఫండ్స్‌ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు

SIP Strategies: మ్యూచువల్‌ ఫండ్స్‌ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు

Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే"కింగ్‌" ఎంట్రీ - జియోకి గ్రీన్‌ సిగ్నల్‌

Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే

Mutual Funds: మీ డబ్బును వేగంగా రెట్టింపు చేసే 5 ఫండ్స్, 15-20 ఏళ్లు ఎదురు చూడాల్సిన అవసరం లేదు

Mutual Funds: మీ డబ్బును వేగంగా రెట్టింపు చేసే 5 ఫండ్స్, 15-20 ఏళ్లు ఎదురు చూడాల్సిన అవసరం లేదు

Investment Tips: నెలకు రూ.20 వేలతో మూడేళ్లలో రూ.12 లక్షలు - అద్భుతం చేసిన ELSS ఫండ్స్‌

Investment Tips: నెలకు రూ.20 వేలతో మూడేళ్లలో రూ.12 లక్షలు - అద్భుతం చేసిన ELSS ఫండ్స్‌

Investment For Children: ట్రెండ్‌ మారింది, చిల్డ్రన్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి పెట్టుబడుల వరద

Investment For Children: ట్రెండ్‌ మారింది, చిల్డ్రన్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి పెట్టుబడుల వరద

టాప్ స్టోరీస్

Vizag Crime News: వీడియోలతో బెదిరించి లా స్టూడెంట్ పై సామూహిక అత్యాచారం, హోం మంత్రి అనిత సీరియస్

Vizag Crime News: వీడియోలతో బెదిరించి లా స్టూడెంట్ పై సామూహిక అత్యాచారం, హోం మంత్రి అనిత సీరియస్

RAPO 22: మహేష్ దర్శకత్వంలో రామ్ పోతినేని... ఓపెనింగ్‌కు ముహూర్తం ఖరారు

RAPO 22: మహేష్ దర్శకత్వంలో రామ్ పోతినేని... ఓపెనింగ్‌కు ముహూర్తం ఖరారు

YS Viveka Case: బెయిల్ రద్దు ఎందుకు చేయకూడదు ?- అవినాష్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు

YS Viveka Case: బెయిల్ రద్దు ఎందుకు చేయకూడదు ?-  అవినాష్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు

Pushpa 2 Chennai Event Date: ఏయ్ బిడ్డా... ఆ రెండు రోజులు చెన్నై, కొచ్చి నగరాలు పుష్పరాజ్ అడ్డా - అక్కడ ఈవెంట్స్ చేసేది ఎప్పుడంటే?

Pushpa 2 Chennai Event Date: ఏయ్ బిడ్డా... ఆ రెండు రోజులు చెన్నై, కొచ్చి నగరాలు పుష్పరాజ్ అడ్డా - అక్కడ ఈవెంట్స్ చేసేది ఎప్పుడంటే?