search
×

Stock Market News: ఎర్రబారిన సూచీలు - పతనమైన సెన్సెక్స్‌, నిఫ్టీ! కోఫోర్జ్‌, అదానీ షేర్లు యాక్టివ్‌!

Stock Market Opening 13 February 2023: స్టాక్‌ మార్కెట్లు సోమవారం ఎర్రబారాయి! ఆసియా మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందాయి. మార్కెట్‌ అస్థిరంగా కనిపిస్తోంది.

FOLLOW US: 
Share:

Stock Market Opening 13 February 2023: 

స్టాక్‌ మార్కెట్లు సోమవారం ఎర్రబారాయి! ఆసియా మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందాయి. మార్కెట్‌ అస్థిరంగా కనిపిస్తోంది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 76 పాయింట్ల నష్టంతో 17,779 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 251 పాయింట్ల నష్టంతో 60,431 వద్ద కొనసాగుతున్నాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, కోఫోర్జ్‌ షేర్లు యాక్టివ్‌గా ట్రేడవుతున్నాయి. ఐటీ సూచీ ఎక్కువగా నష్టపోయింది.

BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)

క్రితం సెషన్లో 60,682 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 60,652 వద్ద మొదలైంది. 60,283 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 60,740 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 11 గంటలకు 251 పాయింట్ల నష్టంతో 60,431 వద్ద కొనసాగుతోంది.

NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)

శుక్రవారం 17,856 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ సోమవారం 17,859 వద్ద ఓపెనైంది. 17,735 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 17,880 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 76 పాయింట్ల నష్టంతో 17,779 వద్ద చలిస్తోంది.

Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)

నిఫ్టీ బ్యాంక్‌ నష్టాల్లో మొదలైంది. ఉదయం 41,563 వద్ద మొదలైంది. 41,231 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 41,662 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 241 పాయింట్లు తగ్గి 41,317 వద్ద ట్రేడవుతోంది.

Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)

నిఫ్టీ 50లో 17 కంపెనీలు లాభాల్లో 33 నష్టపోయాయి. టైటాన్‌, ఎల్‌టీ, బజాజ్‌ ఆటో, ఐచర్‌ మోటార్స్‌, ఎన్‌టీపీసీ షేర్లు లాభపడ్డాయి. ఎస్‌బీఐ, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, ఇన్ఫీ, అదానీ పోర్ట్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ నష్టపోయాయి. అన్ని రంగాల సూచీలు ఎరుపెక్కాయి. ఆటో, బ్యాంకు, ఫైనాన్స్‌, ఐటీ, మీడియా, పీఎస్‌యూ బ్యాంక్‌, రియాల్టీ సూచీలు ఎక్కువ పతనమయ్యాయి. 

బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)

నేడు విలువైన లోహాల ధరలు స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాములు రూ.100 తగ్గి రూ.57,000గా ఉంది. కిలో వెండి రూ.100 తగ్గి రూ.72,600 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.700 తగ్గి రూ.25,180 వద్ద ఉంది.

ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి:

డెలివెరీ: 2022 డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికంలో, లాజిస్టిక్స్ కంపెనీ డెలివేరీ నికర నష్టం రూ.196 కోట్లకు పెరిగింది, గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ. 126 కోట్లుగా ఉంది. సమీక్ష కాల త్రైమాసికంలో కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం 9% తగ్గి రూ. 1,823 కోట్లకు చేరుకుంది.

PB ఫిన్‌టెక్: 2022 అక్టోబర్- డిసెంబర్ కాలంలో నష్టాలు గణనీయంగా తగ్గింది, రూ. 87 కోట్లకు చేరింది. నాలుగో త్రైమాసికం (జనవరి- మార్చి) నాటికి EBITDA సానుకూలంగా మారుతుందని భావిస్తున్నట్లు PB ఫిన్‌టెక్ గైడెన్స్‌ ఇచ్చింది.

ఇన్ఫో ఎడ్జ్‌: డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికంలో ఇన్ఫో ఎడ్జ్ రూ. 116 కోట్ల నికర నష్టాన్ని చవి చూసింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ రూ. 4,601 కోట్ల లాభాన్ని ప్రకటించింది.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

Published at : 13 Feb 2023 11:25 AM (IST) Tags: Stock Market Update stock market today Share Market Stock Market news

ఇవి కూడా చూడండి

New Mutual Fund: 'స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్‌' - అధిక లాభాలు కోరుకునే హైరిస్క్‌ ఇన్వెస్టర్లకు బెస్ట్‌ ఆప్షన్‌!

New Mutual Fund: 'స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్‌' - అధిక లాభాలు కోరుకునే హైరిస్క్‌ ఇన్వెస్టర్లకు బెస్ట్‌ ఆప్షన్‌!

SIP Strategies: మ్యూచువల్‌ ఫండ్స్‌ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు

SIP Strategies: మ్యూచువల్‌ ఫండ్స్‌ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు

Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే"కింగ్‌" ఎంట్రీ - జియోకి గ్రీన్‌ సిగ్నల్‌

Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే

Mutual Funds: మీ డబ్బును వేగంగా రెట్టింపు చేసే 5 ఫండ్స్, 15-20 ఏళ్లు ఎదురు చూడాల్సిన అవసరం లేదు

Mutual Funds: మీ డబ్బును వేగంగా రెట్టింపు చేసే 5 ఫండ్స్, 15-20 ఏళ్లు ఎదురు చూడాల్సిన అవసరం లేదు

Investment Tips: నెలకు రూ.20 వేలతో మూడేళ్లలో రూ.12 లక్షలు - అద్భుతం చేసిన ELSS ఫండ్స్‌

Investment Tips: నెలకు రూ.20 వేలతో మూడేళ్లలో రూ.12 లక్షలు - అద్భుతం చేసిన ELSS ఫండ్స్‌

టాప్ స్టోరీస్

Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !

Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !

Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్

Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్

Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన

Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన

Tirumala News: శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!

Tirumala News: శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!