By: ABP Desam | Updated at : 12 Jan 2023 11:22 AM (IST)
Edited By: Ramakrishna Paladi
స్టాక్ మార్కెట్ అప్డేట్
Stock Market Opening 12 January 2023:
భారత స్టాక్ మార్కెట్లు గురువారం నష్టాల్లో మొదలయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందలేదు. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 64 పాయింట్ల నష్టంతో 17,830 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 242 పాయింట్ల నష్టంతో 59,863 వద్ద కొనసాగుతున్నాయి.
BSE Sensex
క్రితం సెషన్లో 60,105 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 60,083 వద్ద మొదలైంది. 59,799 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 60,290 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 11 గంటలకు 242 పాయింట్ల నష్టంతో 59,863 వద్ద కొనసాగుతోంది.
NSE Nifty
బుధవారం 17,895 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ గురువారం 17,920 వద్ద ఓపెనైంది. 17,811 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 17,945 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 64 పాయింట్ల నష్టంతో 17,830 వద్ద చలిస్తోంది.
Nifty Bank
నిఫ్టీ బ్యాంక్ నష్టపోయింది. ఉదయం 42,238 వద్ద మొదలైంది. 41,880 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 42,343 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 255 పాయింట్లు తగ్గి 41,977 వద్ద చలిస్తోంది.
Gainers and Lossers
నిఫ్టీ 50లో 16 కంపెనీలు లాభాల్లో 34 నష్టాల్లో ఉన్నాయి. హెచ్‌సీఎల్ టెక్, ఎల్‌టీ, గ్రాసిమ్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, అల్ట్రాటెక్ సెమ్ షేర్లు లాభపడ్డాయి. దివిస్ ల్యాబ్, యాక్సిస్ బ్యాంక్, రిలయన్స్, కొటక్ బ్యాంక్, బీపీసీఎల్ షేర్లు నష్టపోయాయి. ఐటీ, కన్జూమర్ డ్యురబుల్స్ సూచీలు స్వల్పంగా ఎగిశాయి. బ్యాంకు, ఫైనాన్స్, ఎఫ్‌ఎంసీజీ, ఫార్మా, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు ఎక్కువ ఎరుపెక్కాయి.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
SIP Strategies: మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు
Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే"కింగ్" ఎంట్రీ - జియోకి గ్రీన్ సిగ్నల్
Mutual Funds: మీ డబ్బును వేగంగా రెట్టింపు చేసే 5 ఫండ్స్, 15-20 ఏళ్లు ఎదురు చూడాల్సిన అవసరం లేదు
Investment Tips: నెలకు రూ.20 వేలతో మూడేళ్లలో రూ.12 లక్షలు - అద్భుతం చేసిన ELSS ఫండ్స్
Investment For Children: ట్రెండ్ మారింది, చిల్డ్రన్ మ్యూచువల్ ఫండ్స్‌లోకి పెట్టుబడుల వరద
Andhra Loan Politics: అప్పులపై చంద్రబాబు, జగన్ తలో వాదన - అసెంబ్లీలో తేల్చుకునేందుకు ప్రతిపక్ష నేత వస్తారా ?
India vs Canada: కెనడా - భారత్ సంబంధాలు చెడిపోవడానికి, ఈ కోల్డ్ వార్ కు కారణాలు ఇవే!
Rohit Sharma: మరోసారి తండ్రైన రోహిత్ శర్మ, బాబుకు జన్మనిచ్చిన రితికా - ఆస్ట్రేలియాకు హిట్ మ్యాన్ !
Jhansi Fire Accident: యూపీలోని ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం, 10 మంది చిన్నారులు సజీవదహనం