search
×

Stock Market Opening: మళ్లీ అమెరికా డేటా భయం! భారీ నష్టాల్లో సెన్సెక్స్‌, నిఫ్టీ - ఆ షేర్లు మాత్రం జిగేల్‌!

Stock Market Opening 10 November 2022: స్టాక్‌ మార్కెట్లు గురువారం నష్టాల్లో మొదలయ్యాయి. అమెరికా ద్రవ్యోల్బణం గణాంకాలు నేడు విడుదల అవుతుండటంతో మదుపర్లు అమ్మకాలు చేపట్టారు.

FOLLOW US: 
Share:

Stock Market Opening 10 November 2022: స్టాక్‌ మార్కెట్లు గురువారం నష్టాల్లో మొదలయ్యాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి నెగెటివ్‌ సంకేతాలు వచ్చాయి. అమెరికా ద్రవ్యోల్బణం గణాంకాలు నేడు విడుదల అవ్వనున్నాయి. గతం కన్నా దారుణంగా పరిస్థితి ఉంటుందన్న అంచనాలతో మదుపర్లు అమ్మకాలు చేపట్టారు. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 134 పాయింట్ల నష్టంతో 18,022 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 491 పాయింట్ల నష్టంతో 60,542 వద్ద ఉన్నాయి. ఫార్మా షేర్లకు గిరాకీ పెరగ్గా ఆటో షేర్లు విలవిల్లాడుతున్నాయి.

BSE Sensex

క్రితం సెషన్లో 61,033 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 60,524 వద్ద మొదలైంది. 60,511 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 60,848 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 10 గంటలకు 491 పాయింట్ల నష్టంతో 60,542 వద్ద కొనసాగుతోంది.

NSE Nifty

బుధవారం 18,157 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ గురువారం 18,044 వద్ద ఓపెనైంది. 18,010 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 18,103 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 134 పాయింట్ల నష్టంతో 18,022 వద్ద ట్రేడవుతోంది.

Nifty Bank

నిఫ్టీ బ్యాంక్‌ నష్టాల్లో ఉంది. ఉదయం 41,462 వద్ద మొదలైంది. 41,643 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 41,456 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 253 పాయింట్ల నష్టంతో 41,529 వద్ద కొనసాగుతోంది.

Gainers and Lossers

నిఫ్టీ 50లో 12 కంపెనీలు లాభాల్లో 36 నష్టాల్లో ఉన్నాయి. దివిస్‌ ల్యాబ్‌, సిప్లా, డాక్టర్‌ రెడ్డీస్‌, హిందుస్థాన్‌ యునీలివర్‌, కొటక్‌ బ్యాంక్‌ లాభాల్లో ఉన్నాయి. టాటా మోటార్స్‌, టైటాన్‌, ఎం అండ్‌ ఎం, ఐచర్‌ మోటార్స్‌, యాక్సిస్‌ బ్యాంకు షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఆటో, కన్జూమర్‌ డ్యురబుల్‌ సూచీలు 1.50 శాతం వరకు పతనమయ్యాయి. 

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

View this post on Instagram
 
A post shared by BSEIndia (@bseindia)

Published at : 10 Nov 2022 10:06 AM (IST) Tags: Stock Market Update stock market today Stock Market Telugu Share Market Stock Market news

ఇవి కూడా చూడండి

Investment Opportunity: కొత్త ఫండ్‌ ఆఫర్లు వస్తున్నాయ్‌, పెట్టుబడిదార్లకు భలే అవకాశం!

Investment Opportunity: కొత్త ఫండ్‌ ఆఫర్లు వస్తున్నాయ్‌, పెట్టుబడిదార్లకు భలే అవకాశం!

Mutual Funds: ఈ మ్యూచువల్‌ ఫండ్స్‌ పెట్టుబడిదార్లు అదృష్టవంతులు, భారీ లాభాలు కళ్లజూశారు

Mutual Funds: ఈ మ్యూచువల్‌ ఫండ్స్‌ పెట్టుబడిదార్లు అదృష్టవంతులు, భారీ లాభాలు కళ్లజూశారు

Mutual Fund: మ్యూచువల్‌ ఫండ్స్‌ రికార్డ్‌, ప్రభంజనంలా వచ్చి పడుతున్న జనం

Mutual Fund: మ్యూచువల్‌ ఫండ్స్‌ రికార్డ్‌, ప్రభంజనంలా వచ్చి పడుతున్న జనం

Mutual Funds: హైబ్రిడ్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌కు మహా గిరాకీ - టాక్స్‌ సేవింగ్‌ ఆప్షనే కారణం

Mutual Funds: హైబ్రిడ్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌కు మహా గిరాకీ - టాక్స్‌ సేవింగ్‌ ఆప్షనే కారణం

ELSS: ట్యాక్స్‌ ఆదా చేయండి, డబ్బూ సంపాదించండి - బెస్ట్‌ ELSS ఫండ్స్‌ ఇవే!

ELSS: ట్యాక్స్‌ ఆదా చేయండి, డబ్బూ సంపాదించండి - బెస్ట్‌ ELSS ఫండ్స్‌ ఇవే!

టాప్ స్టోరీస్

Baak: బ్యాడ్ న్యూస్ - తమన్నా, రాశీఖన్నాల మూవీ విడుదల వాయిదా, కొత్త రిలీజ్ డేట్ ఇదే!

Baak: బ్యాడ్ న్యూస్ - తమన్నా, రాశీఖన్నాల మూవీ విడుదల వాయిదా, కొత్త రిలీజ్ డేట్ ఇదే!

North Lakhimpur: EVM ని మోసుకెళ్తున్న కార్‌ నదిలో మునక, అసోంలో ఊహించని ఘటన

North Lakhimpur: EVM ని మోసుకెళ్తున్న కార్‌ నదిలో మునక, అసోంలో ఊహించని ఘటన

YS Vijayamma Birthday : తల్లి వైఎస్ విజయలక్ష్మి పుట్టిన రోజు - షర్మిలారెడ్డి ఎమోషనల్ - సీఎం జగన్ కూడా !

YS Vijayamma Birthday : తల్లి వైఎస్ విజయలక్ష్మి పుట్టిన రోజు -   షర్మిలారెడ్డి ఎమోషనల్ -  సీఎం జగన్ కూడా !

Brs Mla: బీఆర్ఎస్ కు మరో షాక్ - కాంగ్రెస్ లోకి మరో ఎమ్మెల్యే?

Brs Mla: బీఆర్ఎస్ కు మరో షాక్ - కాంగ్రెస్ లోకి మరో ఎమ్మెల్యే?