By: ABP Desam | Updated at : 01 Dec 2022 11:29 AM (IST)
Edited By: Ramakrishna Paladi
స్టాక్ మార్కెట్ అప్డేట్,
Stock Market Opening 1 December 2022:
భారత స్టాక్ మార్కెట్లు గురువారం భారీ లాభాల్లో మొదలయ్యాయి. సరికొత్త గరిష్ఠాలను నమోదు చేస్తూనే ఉన్నాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందాయి. జీడీపీ, పీఎంఐ గణాంకాలు మెరుగ్గా ఉండటం మదుపర్లలో సానుకూల సెంటిమెంటుకు దోహదం చేసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 83 పాయింట్ల లాభంతో 18,842 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 300 పాయింట్ల లాభంతో 63,400 వద్ద కొనసాగుతున్నాయి.
BSE Sensex
క్రితం సెషన్లో 63,099 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 63,357 వద్ద మొదలైంది. 63,319 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 63,583 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 11 గంటలకు 300 పాయింట్ల లాభంతో 63,400 వద్ద కొనసాగుతోంది.
NSE Nifty
బుధవారం 18,758 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ గురువారం 18,871 వద్ద ఓపెనైంది. 18,816 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 18,887 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 83 పాయింట్ల లాభంతో 18,842 వద్ద ట్రేడవుతోంది.
Nifty Bank
నిఫ్టీ బ్యాంక్ లాభాల్లో ఉంది. ఉదయం 43,512 వద్ద మొదలైంది. 43,331 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 43,515 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 152 పాయింట్ల లాభంతో 43,383 వద్ద చలిస్తోంది.
Also Read: గ్యాస్ ధరల్లో మార్పు! డిసెంబర్లో మారుతున్న ఆర్థిక నిబంధనలు!
Also Read: దటీజ్ ఇండియా! జీడీపీ వృద్ధిరేటు 6.3% - నెమ్మదించినా ప్రపంచంలోనే బెస్ట్!
Gainers and Lossers
నిఫ్టీ 50లో 29 కంపెనీలు లాభాల్లో 20 నష్టాల్లో ఉన్నాయి. హిందాల్కో, టీసీఎస్, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్, ఇన్ఫీ లాభాల్లో ఉన్నాయి. బజాజ్ ఆటో, సిప్లా, యూపీఎల్, హిందుస్థాన్ యునీలివర్, ఎం అండ్ ఎం నష్టపోయాయి. ఆటో,ఎఫ్‌ఎంసీజీ, ఫార్మా, హెల్త్‌కేర్ సూచీలు ఎరుపెక్కాయి. ఐటీ, మీడియా, మెటల్, బ్యాంకు, రియాల్టీ సూచీలు గ్రీన్‌లో కళకళలాడుతున్నాయి.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Women Investments: బంగారం తర్వాత మహిళల్ని ఎక్కువగా ఆకర్షించింది ఇదే, ఐదేళ్లలో డబ్బులు 'డబుల్'
Return On Gold ETFs: కళ్లు తిరిగే లాభం చూపించిన గోల్డ్ ఈటీఎఫ్‌లు, టాప్-10 లిస్ట్ ఇదే
MITRA Digital Platform: ఇన్వెస్టర్ల కోసం మిత్ర 'ప్లాట్‌ఫామ్' ప్రారంభించిన సెబీ - దీనిని ఎలా ఉపయోగించుకోవాలి?
Investment Ideas 2025: NFO అంటే ఏంటి? - రూ.100తో పెట్టుబడి ప్రారంభించొచ్చు, దీర్ఘకాలంలో డబ్బుల వర్షం!
Mutual Funds SIP: 'సిప్'లో చారిత్రాత్మక మార్పు - కేవలం రూ.250తో మ్యుచువల్ ఫండ్స్‌ను కొనొచ్చు!
Telangana Budget: తెలంగాణ బడ్జెట్‌లో నిరుద్యోగులకు తీపి కబురు- 57,946 పోస్టులు భర్తీ చేయబోతున్నట్టు ప్రకటన
Nara Lokesh: ఏపీలో పెట్టుబడిదారులకు రెడ్ కార్పెట్ - మల్లవల్లిలో అశోక్ లేలాండ్ బస్సుల ప్లాంట్ ప్రారంభించిన నారా లోకేష్
Telangana Latest News:పొలిటికల్ డైలమాలో తీన్‌మార్ మల్లన్న! బిఆర్‌ఎస్‌కు దగ్గరవ్వడం రేవంత్ వ్యూహమేనా?
YS Viveka Case: వివేకా కేసులో మరో నిందితుడికి ప్రాణభయం - హత్య సినిమాపైనా ఫిర్యాదు- ఎస్పీని కలిసిన ఏ-2 సునీల్ యాదవ్