By: Rama Krishna Paladi | Updated at : 01 Aug 2023 10:53 AM (IST)
స్టాక్ మార్కెట్ అప్డేట్
Stock Market Opening 1 August 2023:
స్టాక్ మార్కెట్లు మంగళవారం ఫ్లాట్‌గా మొదలయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందాయి. మానుఫ్యాక్చరింగ్ డేటా నేపథ్యంలో మదుపర్లు ఆచితూచి కొనుగోళ్లు చేస్తున్నారు. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 9 పాయింట్లు తగ్గి 19,744 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 8 పాయింట్లు తగ్గి 66,518 వద్ద కొనసాగుతున్నాయి.
BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)
క్రితం సెషన్లో 66,527 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 66,532 వద్ద మొదలైంది. 66,505 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 66,658 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 10:30 గంటలకు 8 పాయింట్ల నష్టంతో 66,518 వద్ద కొనసాగుతోంది.
NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)
సోమవారం 19,753 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ మంగళవారం 19,784 వద్ద ఓపెనైంది. 19,739 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 19,795 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 9 పాయింట్లు తగ్గి 19,744 వద్ద ట్రేడవుతోంది.
Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)
నిఫ్టీ బ్యాంక్ స్వల్ప లాభాల్లో ఉంది. ఉదయం 45,740 వద్ద మొదలైంది. 45,641 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 45,782 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 2 పాయింట్లు పెరిగి 45,653 వద్ద చలిస్తోంది.
Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)
నిఫ్టీ 50లో 27 కంపెనీలు లాభాల్లో 23 నష్టాల్లో ఉన్నాయి. ఎన్టీపీసీ, కోల్ ఇండియా, టెక్ మహీంద్రా, ఐచర్ మోటార్స్, ఎల్‌టీఐ మైండ్‌ట్రీ షేర్లు లాభపడ్డాయి. పవర్ గ్రిడ్, అపోలో హాస్పిటల్స్, ఎస్బీఐ లైఫ్, హెచ్‌డీఎఫ్సీ లైఫ్, అదానీ పోర్ట్స్ షేర్లు నష్టపోయాయి. బ్యాంకు, ఫైనాన్స్, మీడియా, రియాల్టీ సూచీలు ఎక్కువ ఎరుపెక్కాయి. ఆటో, ఐటీ, ఫార్మా సూచీలు కళకళలాడుతున్నాయి.
బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)
నేడు విలువైన లోహాల ధరలు స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.160 పెరిగి రూ.60,440 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి రూ.1000 పెరిగి రూ.78000 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.520 పెరిగి రూ.25,110 వద్ద కొనసాగుతోంది.
Also Read: గుడ్‌న్యూస్ - LPG సిలిండర్ రేటు ₹100 తగ్గింది, కొత్త రేటు ఇదే
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Attention Investors! Always make sure that your stockbroker settles the funds within 1 working day of settlement.#NSEIndia #SochKarSamajhKarInvestKar #InvestorAwareness #StockMarket #InvestorEducation #ShareMarket #InvestorProtection #brokersarenotbankers @ashishchauhan
— NSE India (@NSEIndia) July 31, 2023
Market Update for the day.
— NSE India (@NSEIndia) July 31, 2023
See more:https://t.co/XW5Vr5nX8chttps://t.co/hyRwDLLexj#NSEUpdates #Nifty #Nifty50 #NSEIndia #StockMarketIndia #ShareMarket #MarketUpdates pic.twitter.com/F4KcoWNwoz
Investors must transfer shares to the Stockbroker only if they are sold on the Stock Exchange platform. Know more: https://t.co/9wkVNEaKXk#NSE #NSEIndia #marginpledge #transfershares #shares @ashishchauhan
— NSE India (@NSEIndia) July 31, 2023
Year Ender 2024: 2024లో పెట్టుబడిదార్లను ధనవంతులుగా మార్చిన టాప్-10 మ్యూచువల్ ఫండ్స్
New Mutual Fund: 'స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్' - అధిక లాభాలు కోరుకునే హైరిస్క్ ఇన్వెస్టర్లకు బెస్ట్ ఆప్షన్!
SIP Strategies: మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు
Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే"కింగ్" ఎంట్రీ - జియోకి గ్రీన్ సిగ్నల్
Mutual Funds: మీ డబ్బును వేగంగా రెట్టింపు చేసే 5 ఫండ్స్, 15-20 ఏళ్లు ఎదురు చూడాల్సిన అవసరం లేదు
Champions Trophy 2025 Schedule:ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది- భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఎప్పుడంటే?
Andhra Fibernet: ఏపీ ఫైబర్ నెట్‌లో జీతాలు - చేసేది వైసీపీ నేతల ఇంట్లో పని - వందల మందికి ఊస్టింగ్
Bank Defaulters: లోన్ తీర్చలేదని పరువు తీస్తే బ్యాంకులకైనా శిక్షే - కేరళ హైకోర్టు కీలక తీర్పు - క్రెడిట్ కార్డు లోన్లకూ వర్తిస్తుంది !
Dil Raju Comments: సీఎంను కలిశా... అల్లు అర్జున్ కలుస్తా... రేవతి ఫ్యామిలీని ఆదుకునే బాధ్యత నాదే: దిల్‌రాజు