By: ABP Desam | Updated at : 04 Oct 2023 11:48 AM (IST)
స్టాక్ మార్కెట్ అప్డేట్ ( Image Source : Pexels )
Stock Market Opening 04 October 2023:
భారత స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ నష్టాల్లో ఉన్నాయి. క్రూడాయిల్ ధరలు, డాలర్ ఇండెక్స్, వినియోగ ధరల ద్రవ్యోల్బణం పెరుగుదల వంటివి మార్కెట్లో నెగెటివ్ సెంటిమెంటు పెంచాయి. వీటికి తోడు ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందాయి. ముఖ్యంగా బ్యాంకు, ఫైనాన్స్ షేర్లు విలవిల్లాడుతున్నాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 122 పాయింట్లు తగ్గి 19,306 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 460 పాయింట్లు తగ్గి 65,051 వద్ద కొనసాగుతున్నాయి.
BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)
క్రితం సెషన్లో 65,512 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 65,330 వద్ద మొదలైంది. 64,978 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 65,332 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 11 గంటలకు 460 పాయింట్లు తగ్గి 65,051 వద్ద కొనసాగుతోంది.
NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)
మంగళవారం 19,528 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ బుధవారం 19,446 వద్ద ఓపెనైంది. 19,375 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 19,457 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 122 పాయింట్లు తగ్గి 19,306 వద్ద ట్రేడవుతోంది.
Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)
నిఫ్టీ బ్యాంక్ తగ్గింది. ఉదయం 44,108 వద్ద మొదలైంది. 43,885 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 44,161 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 438 పాయింట్ల నష్టంతో 43,960 వద్ద కొనసాగుతోంది.
Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)
నిఫ్టీ 50లో 9 కంపెనీలు లాభాల్లో 41 నష్టాల్లో ఉన్నాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్, నెస్లే ఇండియా, అదానీ పోర్ట్స్, ఐచర్ మోటార్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు షేర్లు లాభపడ్డాయి. యాక్సిస్ బ్యాంకు, ఇండస్‌ఇండ్ బ్యాంకు, అపోలో హాస్పిటల్స్, అల్ట్రాటెక్ సిమెంట్, మారుతీ సుజుకీ నష్టపోయాయి. ఎఫ్‌ఎంసీజీ మినహా అన్ని రంగాల సూచీలు ఎరుపెక్కాయి. బ్యాంకు, ఆటో, ఫైనాన్స్, మీడియా, ఫార్మా, పీఎస్‌యూ బ్యాంకు, రియాల్టీ, ప్రైవేటు బ్యాంకు, హెల్త్‌కేర్ సూచీలు భారీగా పతనమయ్యాయి.
బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)
నేడు విలువైన లోహాల ధరలు తగ్గుముఖం పట్టాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.10 తగ్గి రూ.57,370 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి రూ.300 తగ్గి రూ.70,700 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.110 తగ్గి రూ.23,090 వద్ద ఉంది.
క్రితం సెషన్లో ఏం జరిగిందంటే?
భారత స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాల్లో ముగిశాయి. క్రూడాయిల్ ధరలు పెరగడం, ఐరోపా మార్కెట్లు పతనమవ్వడం ఇన్వెస్టర్లలో నెగెటివ్ సెంటిమెంటుకు దారితీసింది. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ట్రేడయ్యాయి. ఆటో, ఆయిల్, ఫార్మా రంగాలు సెల్లింగ్ ప్రెజర్ ఎదుర్కొన్నాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 109 పాయింట్లు తగ్గి 19,528 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 316 పాయింట్లు తగ్గి 65,512 వద్ద ముగిశాయి.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
New Mutual Fund: 'స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్' - అధిక లాభాలు కోరుకునే హైరిస్క్ ఇన్వెస్టర్లకు బెస్ట్ ఆప్షన్!
SIP Strategies: మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు
Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే"కింగ్" ఎంట్రీ - జియోకి గ్రీన్ సిగ్నల్
Mutual Funds: మీ డబ్బును వేగంగా రెట్టింపు చేసే 5 ఫండ్స్, 15-20 ఏళ్లు ఎదురు చూడాల్సిన అవసరం లేదు
Investment Tips: నెలకు రూ.20 వేలతో మూడేళ్లలో రూ.12 లక్షలు - అద్భుతం చేసిన ELSS ఫండ్స్
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన