By: ABP Desam | Updated at : 02 Mar 2023 09:44 AM (IST)
Edited By: Ramakrishna Paladi
స్టాక్ మార్కెట్ అప్డేట్ ( Image Source : Pexels )
Stock Market Opening 02 March 2023:
స్టాక్ మార్కెట్లు గురువారం నష్టాల్లోనే మొదలయ్యాయి. ఆసియా మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందాయి. ఉదయం ఎన్ఎస్ఈ నిఫ్టీ (NSE Nifty) 70 పాయింట్లు తగ్గి 17,380 బీఎస్ఈ సెన్సెక్స్ (BSE Sensex) 168 పాయింట్లు తగ్గి 59,242 వద్ద కొనసాగుతున్నాయి. అదానీ షేర్లలో ఓ బ్లాక్ డీల్ జరిగినట్టు తెలిసింది.
BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)
క్రితం సెషన్లో 59,411 వద్ద ముగిసిన బీఎస్ఈ సెన్సెక్స్ నేడు 59,287 వద్ద మొదలైంది. 59,215 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 59,423 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఆరంభంలో 168 పాయింట్ల నష్టంతో 59,242 వద్ద కొనసాగుతోంది.
NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)
బుధవారం 17,380 వద్ద ముగిసిన ఎన్ఎస్ఈ నిఫ్టీ గురువారం 17,421 వద్ద ఓపెనైంది. 17,379 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 17,445 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 70 పాయింట్లు తగ్గి 17,380 వద్ద ట్రేడవుతోంది.
Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)
నిఫ్టీ బ్యాంక్ నష్టాల్లో మొదలైంది. ఉదయం 40,604 వద్ద మొదలైంది. 40,552 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 40,773 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 120 పాయింట్లు తగ్గి 40,577 వద్ద ట్రేడవుతోంది.
Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)
నిఫ్టీ 50లో 10 కంపెనీలు లాభాల్లో 40 నష్టాల్లో ఉన్నాయి. బజాజ్ ఫిన్సర్వ్, హీరోమోటో కార్ప్, ఎల్టీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్ షేర్లు లాభపడ్డాయి. అదానీ ఎంటర్ప్రైజెస్, టెక్ మహీంద్రా, ఎం అండ్ ఎం, ఇన్ఫీ, టీసీఎస్ షేర్లు నష్టపోయాయి. రియాల్టీ మినహా అన్ని రంగాల సూచీలు ఎరుపెక్కాయి. ఆటో, ఎఫ్ఎంసీజీ, ఐటీ, పీఎస్‌యూ బ్యాంకు, హెల్త్‌కేర్ సూచీలు ఎక్కువ పతనమయ్యాయి.
బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)
నేడు విలువైన లోహాల ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.170 పెరిగి రూ.56,290 గా ఉంది. కిలో వెండి రూ.66,800 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.400 పెరిగి రూ.25,410 వద్ద ఉంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Press Release: "NSE receives regulatory nod to launch WTI Crude Oil and Natural Gas futures contracts." For more details visit: https://t.co/nJYs45TLXe #NSEIndia #StockExchange #PressRelease #WTI #CrudeOil #NaturalGas #futures #contracts @ashishchauhan pic.twitter.com/up1ecqaMD2
— NSE India (@NSEIndia) March 1, 2023
Market Update for the day.
— NSE India (@NSEIndia) March 1, 2023
See more:https://t.co/XW5Vr5ouXKhttps://t.co/hyRwDLLMmR#NSEUpdates #Nifty #Nifty50 #NSEIndia #StockMarketIndia #ShareMarket #MarketUpdates pic.twitter.com/JxvC6VQ4uJ
Investing In SIP: ప్రతి నెలా రూ.1000 SIP చేస్తే మీరు ఎన్ని సంవత్సరాల్లో రూ.కోటి సంపాదిస్తారు?
Trisha: త్రిష ఇంట విషాదం... క్రిస్మస్ రోజు కుమారుడిని కోల్పోయానంటూ హీరోయిన్ ఎమోషనల్
Year Ender 2024: 2024లో పెట్టుబడిదార్లను ధనవంతులుగా మార్చిన టాప్-10 మ్యూచువల్ ఫండ్స్
New Mutual Fund: 'స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్' - అధిక లాభాలు కోరుకునే హైరిస్క్ ఇన్వెస్టర్లకు బెస్ట్ ఆప్షన్!
SIP Strategies: మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు
Kumbh mela: గత జన్మలో భారత్‌లో పుట్టానేమో- కుంభమేళాలో విదేశీ భక్తురాలి ఆసక్తికర వ్యాఖ్యలు
Sobhan Babu Birthday: సొంత ఊరికి ఎంతో చేసిన శోభన్ బాబు... కనీసం ఒక్క విగ్రహం కూడా లేదు, ఎక్కడో తెల్సా?
RK Roja: ఫ్యామిలీతో కలిసి నగరిలో రోజా భోగి సెలబ్రేషన్స్, కూటమి ప్రభుత్వంపై ఘాటు విమర్శలు
Daaku Maharaj Collection Day 1: 'డాకు మహారాజ్' ఫస్ట్ డే కలెక్షన్స్ - ఓవర్సీస్లో బాలయ్య అరుదైన రికార్డు