search
×

Sensex Today: ఫ్లాట్.. పాజిటివ్‌గా సెన్సెక్స్‌, నిఫ్టీ! ఐటీ సూచీ పతనం!

Stock Market Opening 22 August 2023: స్టాక్‌ మార్కెట్లు మంగళవారం ఫ్లాట్‌గా మొదలయ్యాయి. ఫియర్‌ ఇండెక్స్‌ విక్స్‌ తగ్గుతుండటం మదుపర్లలో ఆత్మవిశ్వాసం పెంచింది.

FOLLOW US: 
Share:

Stock Market Opening 22 August 2023:

స్టాక్‌ మార్కెట్లు మంగళవారం ఫ్లాట్‌గా మొదలయ్యాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందాయి. ఫియర్‌ ఇండెక్స్‌ విక్స్‌ తగ్గుతుండటం మదుపర్లలో ఆత్మవిశ్వాసం పెంచింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 18 పాయింట్లు పెరిగి 19,411 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 25 పాయింట్లు పెరిగి 65,241 వద్ద కొనసాగుతున్నాయి. ఐటీ, ఫార్మాలో ప్రాఫిట్‌ బుకింగ్‌ కనిపిస్తోంది.

BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)

క్రితం సెషన్లో 65,216 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 65,272 వద్ద మొదలైంది. 65,165 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 65,362 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 25 పాయింట్ల లాభంతో 65,241 వద్ద కొనసాగుతోంది.

NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)

సోమవారం 19,393 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ మంగళవారం 19,417 వద్ద ఓపెనైంది. 19,381 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 19,443 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 18 పాయింట్లు పెరిగి 19,411 వద్ద ట్రేడవుతోంది.

Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)

నిఫ్టీ బ్యాంక్‌ లాభపడింది. ఉదయం 44,125 వద్ద మొదలైంది. 44,034 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 44,151 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. సాయంత్రం 72 పాయింట్లు పెరిగి 44,074 వద్ద కొనసాగుతోంది.

Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)

నిఫ్టీ 50లో 18 కంపెనీలు లాభాల్లో 21 నష్టాల్లో ఉన్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, ఎస్బీఐ లైఫ్, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, ఎన్టీపీసీ, బజాజ్ ఫైనాన్స్‌ షేర్లు లాభపడ్డాయి. జియో ఫైనాన్స్‌, సిప్లా, టైటాన్‌, ఐచర్‌ మోటార్స్‌, టీసీఎస్‌ షేర్లు నష్టాల్లో ఉన్నాయి. ఐటీ, ఫార్మా, హెల్త్‌కేర్‌ సూచీలు ఎరుపెక్కాయి. ఆటో, ఫైనాన్స్‌, ఎఫ్‌ఎంసీజీ, రియాల్టీ సూచీలు ఎక్కువ పెరిగాయి.

బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)

నేడు విలువైన లోహాల ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.60 పెరిగి రూ.59,130 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి రూ.1200 పెరిగి రూ.74,500 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.90 తగ్గి రూ.24,300 వద్ద ఉంది.

Also Read: బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్‌పై భారీ తగ్గింపు - ఇప్పుడు ఎంతంటే?

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

Published at : 22 Aug 2023 11:18 AM (IST) Tags: Nse Nifty Share Market Nifty Bank Stock Market news BSE Sensex Stock Market update

ఇవి కూడా చూడండి

SIP Strategies: మ్యూచువల్‌ ఫండ్స్‌ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు

SIP Strategies: మ్యూచువల్‌ ఫండ్స్‌ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు

Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే"కింగ్‌" ఎంట్రీ - జియోకి గ్రీన్‌ సిగ్నల్‌

Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే

Mutual Funds: మీ డబ్బును వేగంగా రెట్టింపు చేసే 5 ఫండ్స్, 15-20 ఏళ్లు ఎదురు చూడాల్సిన అవసరం లేదు

Mutual Funds: మీ డబ్బును వేగంగా రెట్టింపు చేసే 5 ఫండ్స్, 15-20 ఏళ్లు ఎదురు చూడాల్సిన అవసరం లేదు

Investment Tips: నెలకు రూ.20 వేలతో మూడేళ్లలో రూ.12 లక్షలు - అద్భుతం చేసిన ELSS ఫండ్స్‌

Investment Tips: నెలకు రూ.20 వేలతో మూడేళ్లలో రూ.12 లక్షలు - అద్భుతం చేసిన ELSS ఫండ్స్‌

Investment For Children: ట్రెండ్‌ మారింది, చిల్డ్రన్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి పెట్టుబడుల వరద

Investment For Children: ట్రెండ్‌ మారింది, చిల్డ్రన్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి పెట్టుబడుల వరద

టాప్ స్టోరీస్

YS Viveka Case: బెయిల్ రద్దు ఎందుకు చేయకూడదు ?- అవినాష్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు

YS Viveka Case: బెయిల్ రద్దు ఎందుకు చేయకూడదు ?-  అవినాష్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు

Pushpa 2 Chennai Event Date: ఏయ్ బిడ్డా... ఆ రెండు రోజులు చెన్నై, కొచ్చి నగరాలు పుష్పరాజ్ అడ్డా - అక్కడ ఈవెంట్స్ చేసేది ఎప్పుడంటే?

Pushpa 2 Chennai Event Date: ఏయ్ బిడ్డా... ఆ రెండు రోజులు చెన్నై, కొచ్చి నగరాలు పుష్పరాజ్ అడ్డా - అక్కడ ఈవెంట్స్ చేసేది ఎప్పుడంటే?

Lagacharla Incident: అధికారులపై దాడి కేసులో కీలక పరిణామం, లొంగిపోయిన కీలక నిందితుడు సురేష్

Lagacharla Incident: అధికారులపై దాడి కేసులో కీలక పరిణామం, లొంగిపోయిన కీలక నిందితుడు సురేష్

YSRCP: సజ్జలకే కిరీటం - వైసీపీలో ముసలం ! ఆ సీనియర్లంతా సైలెంటేనా ?

YSRCP: సజ్జలకే కిరీటం - వైసీపీలో ముసలం ! ఆ సీనియర్లంతా సైలెంటేనా ?