By: ABP Desam | Updated at : 19 May 2022 03:51 PM (IST)
Edited By: Ramakrishna Paladi
స్టాక్ మార్కెట్ అప్డేట్
Stock Market Opening Bell: భారత స్టాక్ మార్కెట్లు (Indian equity markets) గురువారం భారీగా నష్టపోయాయి. ఆరంభం నుంచే అమ్మకాల వెల్లువ కొనసాగింది. ఇన్వెస్టర్లు తమ వద్ద ఉన్న షేర్లను తెగనమ్ముతున్నారు. అమెరికా, జపాన్, చైనా, సింగపూర్ మార్కెట్లు తీవ్రంగా నష్టపోవడంతో మదుపర్ల సెంటిమెంటును దెబ్బతీసింది. ఐటీ షేర్ల పతనం అందరినీ కలవరపరుస్తోంది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 15,809 వద్ద ముగిసింది. బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 1416 పాయింట్ల వరకు నష్టపోయింది. ఇన్వెస్టర్లు దాదాపుగా రూ.7 లక్షల కోట్ల వరకు నష్టపోయారు.
BSE Sensex
క్రితం సెషన్లో 54,208 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 53,070 వద్ద భారీ నష్టాల్లో మొదలైంది. 52,669 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. ఉదయం నుంచే అమ్మకాల వెల్లువతో సూచీ నేల చూపులు చూస్తోంది. 53,356 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 1416 పాయింట్ల నష్టంతో 52,792 వద్ద కొనసాగుతోంది.
NSE Nifty
బుధవారం 16,240 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ గురువారం 15,917 వద్ద ఓపెనైంది. ఆరంభం నుంచే నష్టాల బాట పట్టింది. 15,775 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 15,984 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 430 పాయింట్లు నష్టపోయి 15,809 వద్ద ముగిసింది.
Nifty Bank
నిఫ్టీ బ్యాంక్ నష్టాల్లో ముగిసింది. ఉదయం 33,461 వద్ద మొదలైంది. 33,180 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 33,633 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 848 పాయింట్ల నష్టంతో 33,315 వద్ద ముగిసింది.
Gainers and Lossers
నిఫ్టీ 50లో 3 కంపెనీలు లాభాల్లో 47 నష్టాల్లో ఉన్నాయి. హెచ్‌సీఎల్ టెక్, విప్రో, ఇన్ఫీ, టీసీఎస్, టెక్ మహీంద్రా 5 శాతానికి పైగా నష్టపోయాయి. అన్ని రంగాల సూచీలు పతనమయ్యాయి. ఐటీ సూచీ మాత్రం 4-5 శాతం వరకు పతనమైంది. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ 2 శాతం వరకు నష్టపోయింది.
Mutual Funds SIP: 'సిప్'లో చారిత్రాత్మక మార్పు - కేవలం రూ.250తో మ్యుచువల్ ఫండ్స్‌ను కొనొచ్చు!
Investing In SIP: ప్రతి నెలా రూ.1000 SIP చేస్తే మీరు ఎన్ని సంవత్సరాల్లో రూ.కోటి సంపాదిస్తారు?
Trisha: త్రిష ఇంట విషాదం... క్రిస్మస్ రోజు కుమారుడిని కోల్పోయానంటూ హీరోయిన్ ఎమోషనల్
Year Ender 2024: 2024లో పెట్టుబడిదార్లను ధనవంతులుగా మార్చిన టాప్-10 మ్యూచువల్ ఫండ్స్
New Mutual Fund: 'స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్' - అధిక లాభాలు కోరుకునే హైరిస్క్ ఇన్వెస్టర్లకు బెస్ట్ ఆప్షన్!
New Income Tax Bill: కొత్త ఆదాయపు పన్ను బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం, వచ్చే వారం పార్లమెంట్‌లో బిల్లు
Balakrishna Akhanda 2: ఈ శివరాత్రికి శివ'తాండవ'మేనా! - బాలకృష్ణ 'అఖండ 2' ఫస్ట్ లుక్ అప్పుడేనా?
YS Sharmila On jagan : జగన్ క్రెడిబులిటి ఖాళీ బాటిల్, సున్నా - బిడ్డల ఆస్తులు కాజేయాలని కుట్ర - షర్మిల సంచలన వ్యాఖ్యలు
Thandel: 'తండేల్' రియల్ స్టోరీ... చేపల కోసం వెళ్ళి పాకిస్థాన్ చెరలో చిక్కుకున్న ఆ మత్స్యకారుడు ఎవరో తెలుసా?
This website uses cookies or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy