By: ABP Desam | Updated at : 12 May 2022 10:20 AM (IST)
Edited By: Ramakrishna Paladi
స్టాక్ మార్కెట్ అప్డేట్
Stock Market Opening Bell: భారత స్టాక్ మార్కెట్లు (Indian equity markets) వరుసగా ఐదో సెషన్లో నష్టాల్లోనే మొదలయ్యాయి. అంతర్జాతీయ, అమెరికా, భారత్ సీపీఐ, ఐఐపీ డేటా వస్తుండటంతో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఆసియా మార్కెట్లు నెగెటివ్‌గా ఓపెనవ్వడంతో ఇన్వెస్టర్లు అమ్మకాలు చేపట్టారు. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 15,882 వద్ద కొనసాగుతోంది. బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 850 పాయింట్లు నష్టపోయింది. ఇన్వెస్టర్లు దాదాపుగా రూ.4 లక్షల కోట్ల సంపదను కోల్పోయారు.
BSE Sensex
క్రితం సెషన్లో 54,088 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 53,608 వద్ద నష్టాల్లో మొదలైంది. 53,632 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని నమోదు చేసింది. ఉదయం నుంచే అమ్మకాలు పెరగడంతో 53,047 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 10 గంటలకు 850 పాయింట్ల నష్టంతో 53,231 వద్ద కొనసాగుతోంది.
NSE Nifty
బుధవారం 16,167 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ గురువారం 16,021 వద్ద ఓపెనైంది. ఆరంభం నుంచే పతనమైంది. 16,041 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని చేరుకుంది. అమ్మకాల సెగతో 15,848 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. ప్రస్తుతం 275 పాయింట్ల నష్టంతో 15,882 వద్ద ట్రేడ్ అవుతోంది.
Nifty Bank
నిఫ్టీ బ్యాంక్ నష్టాల్లో ట్రేడ్ అవుతోంది. ఉదయం 34,289 వద్ద మొదలైంది. 33,837 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 34,341 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 830 పాయింట్ల నష్టంతో 33,862 వద్ద కొనసాగుతోంది.
Gainers and Lossers
నిఫ్టీ 50లో 2 కంపెనీలు లాభాల్లో 48 నష్టాల్లో ఉన్నాయి. టీసీఎస్, హెచ్‌సీఎల్ మాత్రమే స్వల్ప లాభాల్లో ఉన్నాయి. హిందాల్కో, అదానీ పోర్ట్స్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, హీరోమోటో కార్ప్, టాటా మోటార్స్ నష్టాల్లో కొనసాగుతున్నాయి. అన్ని రంగాల సూచీలు నష్టాల్లోనే ట్రేడ్ అవుతున్నాయి. ఆటో, బ్యాంక్, మెటల్, పవర్, రియాల్టీ సూచీలు 2 శాతానికి పైగా పతనం అయ్యాయి.
Year Ender 2024: 2024లో పెట్టుబడిదార్లను ధనవంతులుగా మార్చిన టాప్-10 మ్యూచువల్ ఫండ్స్
New Mutual Fund: 'స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్' - అధిక లాభాలు కోరుకునే హైరిస్క్ ఇన్వెస్టర్లకు బెస్ట్ ఆప్షన్!
SIP Strategies: మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు
Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే"కింగ్" ఎంట్రీ - జియోకి గ్రీన్ సిగ్నల్
Mutual Funds: మీ డబ్బును వేగంగా రెట్టింపు చేసే 5 ఫండ్స్, 15-20 ఏళ్లు ఎదురు చూడాల్సిన అవసరం లేదు
Paravada Gas Leak: పరవాడ ఫార్మాసిటీలో విషవాయువులు లీక్, నలుగురు సిబ్బందికి తీవ్ర అస్వస్థత
Congress vs Tollywood: సినీ ఇండస్టీని కాంగ్రెస్ ప్రభుత్వం టార్గెట్ చేసిందా ? సినీ పెద్దలపై ఎందుకంత పగ?
AP Belt Shops: గ్రామాల్లో బెల్ట్ బాజా, గోదావరి జిల్లాల్లో ఎటు చూసినా విచ్చలవిడిగా మద్యం విక్రయాలు
Hyderabad CP CV Anand: సంచలన ఆరోపణలు చేసి క్షమాపణ కోరిన హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్