By: ABP Desam | Updated at : 16 Jun 2022 04:12 PM (IST)
Edited By: Ramakrishna Paladi
స్టాక్ మార్కెట్ అప్డేట్ ( Image Source : Pixabay )
Stock Market Closing Bell 16 June 2022: భారత స్టాక్ మార్కెట్లు (Indian equity markets) గురువారం రక్తమోడాయి! ఉదయం లాభపడ్డ సూచీలు మధ్యాహ్నం నుంచి క్రాష్ అయ్యాయి. ద్రవ్యోల్బణం భయాలు ఒకవైపు, అమెరికా, ఇంగ్లాండ్ వడ్డీరేట్లను పెంచుతాయన్న వార్తలు మరోవైపు మదుపర్లను కలవరపెట్టాయి. ఇందుకు క్రూడాయిల్ ధరల పెరుగుదల మరింత ఆజ్యం పోసింది. దాంతో ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 331 పాయింట్ల నష్టంతో 15,360, బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 1045 పాయింట్ల నష్టంతో 51,495 వద్ద ముగిశాయి. రెండు సూచీలు 52 వారాల కనిష్ఠాన్ని నమోదు చేయడంతో ఇన్వెస్టర్లు రూ.5 లక్షల కోట్ల మేర నష్టపోయారు.
BSE Sensex
క్రితం సెషన్లో 52,541 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 53,246 వద్ద భారీ లాభాల్లో మొదలైంది. 51,425 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 53,142 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 1,045 పాయింట్ల నష్టంతో 51,495 వద్ద ముగిసింది. సింగపూర్ నిఫ్టీ నుంచి సానుకూల సంకేతాలు రావడంతో ఉదయం 500 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్ మధ్యాహ్నం నుంచి నష్టాల్లోకి జారుకుంది.
Also Read: ఎన్‌పీఎస్ కడుతున్నారా! బెనిఫిట్స్‌పై కీలక మార్పులు చేసిన పీఎఫ్ఆర్‌డీఏ!
NSE Nifty
బుధవారం 15,692 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ గురువారం 15,832 వద్ద ఓపెనైంది. 15,335 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 15,863 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 331 పాయింట్ల నష్టంతో 15,360 వద్ద ముగిసింది.
Nifty Bank
నిఫ్టీ బ్యాంక్ నష్టాల్లో క్లోజైంది. ఉదయం 33,648 వద్ద మొదలైంది. 32,537 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 33,756 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 721 పాయింట్ల నష్టంతో 32,617 వద్ద ముగిసింది.
Gainers and Lossers
నిఫ్టీ 50లో 2 కంపెనీలు లాభాల్లో 48 నష్టాల్లో ముగిశాయి. నెస్లే ఇండియా, బ్రిటానియా షేర్లు స్వల్పంగా లాభపడ్డాయి. హిందాల్కో, టాటా స్టీల్, ఓఎన్‌జీసీ, కోల్ ఇండియా, టాటా మోటార్స్ షేర్లు 5-7 శాతం వరకు నష్టపోయాయి. అన్ని రంగాల సూచీలు భారీగా పతనం అయ్యాయి. బ్యాంకు, ఆటో, ఐటీ, మీడియా, మెటల్, ఫార్మా, ప్రైవేటు బ్యాంకు, పీఎస్‌యూ బ్యాంక్, రియాల్టీ, కన్జూమర్ డ్యురబుల్స్ సూచీలు 2 శాతానికి పైగా ఎరుపెక్కాయి.
Also Read: సౌందర్యం కోల్పోయిన రెవ్లాన్! దివాలా అంచున అతిపెద్ద కాస్మొటిక్ కంపెనీ!
Year Ender 2024: 2024లో పెట్టుబడిదార్లను ధనవంతులుగా మార్చిన టాప్-10 మ్యూచువల్ ఫండ్స్
New Mutual Fund: 'స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్' - అధిక లాభాలు కోరుకునే హైరిస్క్ ఇన్వెస్టర్లకు బెస్ట్ ఆప్షన్!
SIP Strategies: మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు
Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే"కింగ్" ఎంట్రీ - జియోకి గ్రీన్ సిగ్నల్
Mutual Funds: మీ డబ్బును వేగంగా రెట్టింపు చేసే 5 ఫండ్స్, 15-20 ఏళ్లు ఎదురు చూడాల్సిన అవసరం లేదు
Prakasam Earthquake: ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు, ఈ నెలలో తెలుగు రాష్ట్రాల్లో వరుస భూకంపాలు
Prashanth Neel: ఎన్టీఆర్ సినిమా గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్... మైథాలజీ కాదు
Viral News: పొరపాటున హుండీలో పడిన భక్తుడి ఐఫోన్, తిరిగిచ్చే ఛాన్స్ ఉందా? రూల్స్ ఏం చెబుతున్నాయి
Perni Nani: మాజీ మంత్రి పేర్ని నాని, కుమారుడు పేర్ని కిట్టుకు పోలీసుల నోటీసులు- నేటి మధ్యాహ్నం వరకు డెడ్‌లైన్
This website uses cookies or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy