By: Rama Krishna Paladi | Updated at : 30 Jun 2023 03:51 PM (IST)
స్టాక్ మార్కెట్ అప్డేట్
Stock Market Closing 30 June 2023:
స్టాక్ మార్కెట్లు శుక్రవారం సరికొత్త రికార్డు సృష్టించాయి. జీవిత కాల గరిష్ఠాలను మించి పెరుగుతున్నాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 216 పాయింట్లు పెరిగి 19,189 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 803 పాయింట్లు పెరిగి 64,768 వద్ద ముగిశాయి. ఉదయం నుంచి ఇన్వెస్టర్లు కొనుగోళ్లు చేస్తూనే ఉన్నారు. అన్ని రంగాల సూచీలు పైపైకి ఎగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 82.04 వద్ద స్థిరపడింది. మదుర్లు నేడు ఒక్కరోజే రూ.4 లక్షల కోట్ల మేర ఆర్జించారు.
BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)
క్రితం సెషన్లో 63,915 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 64,068 వద్ద మొదలైంది. 64,068 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 64,768 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 803 పాయింట్ల లాభంతో 64,718 వద్ద ముగిసింది.
NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)
బుధవారం 18,972 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ శుక్రవారం 19,076 వద్ద ఓపెనైంది. 19,024 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 19,201 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 216 పాయింట్ల లాభంతో 19,189 వద్ద క్లోజైంది.
Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)
నిఫ్టీ బ్యాంక్ లాభపడింది. ఉదయం 44,666 వద్ద మొదలైంది. 44,447 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 44,787 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. సాయంత్రం 419 పాయింట్లు పెరిగి 44,747 వద్ద స్థిరపడింది.
Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)
నిఫ్టీ 50లో 40 కంపెనీలు లాభాల్లో 10 నష్టాల్లో ఉన్నాయి. ఎం అండ్ ఎం, ఇన్ఫీ, ఇండస్‌ఇండ్ బ్యాంక్, సన్‌ఫార్మా, హీరోమోటో కార్ప్ షేర్లు లాభపడ్డాయి. అదానీ పోర్ట్స్, గ్రాసిమ్, అపోలో హాస్పిటల్స్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేర్లు నష్టపోయాయి. మెటల్ మినహా అన్ని రంగాల షేర్లు పెరిగాయి. బ్యాంకు, ఆటో, ఫైనాన్స్, ఐటీ, ఫార్మా, పీఎస్‌యూ బ్యాంక్, ప్రైవేటు బ్యాంకు, రియాల్టీ సూచీలు పెరిగాయి.
బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)
నేడు విలువైన లోహాల ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.58,750గా ఉంది. కిలో వెండి రూ.71,900 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.280 తగ్గి రూ.23,820 వద్ద ఉంది.
Also Read: ట్రెండింగ్‌లో ఉమెన్ స్కీమ్, 3 నెలల్లో 10 లక్షల కొత్త అకౌంట్స్
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Inauguration of the Common Investor Service Center in Indore, Madhya Pradesh by Shri B J Dilip, Regional Director, SEBI, Western Regional Office. The regional seminar was also conducted with SEBI, NSE and NSDL to empower investors through education and awareness and facilitate… pic.twitter.com/HZ3vfRQdSR
— NSE India (@NSEIndia) June 30, 2023
Congratulations Aatmaj Healthcare Limited on getting listed on NSE Emerge today! The Company is a healthcare services provider. The public Issue was of Rs. 3,840.00 lakhs at an issue price of Rs.60 per share.#NSE #NSEIndia #NSEEmerge #listing #IPO #StockMarket #ShareMarket… pic.twitter.com/2Vh88MnFIR
— NSE India (@NSEIndia) June 30, 2023
In ASBA, the amount is blocked in
— NSE India (@NSEIndia) June 29, 2023
SIP Strategies: మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు
Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే"కింగ్" ఎంట్రీ - జియోకి గ్రీన్ సిగ్నల్
Mutual Funds: మీ డబ్బును వేగంగా రెట్టింపు చేసే 5 ఫండ్స్, 15-20 ఏళ్లు ఎదురు చూడాల్సిన అవసరం లేదు
Investment Tips: నెలకు రూ.20 వేలతో మూడేళ్లలో రూ.12 లక్షలు - అద్భుతం చేసిన ELSS ఫండ్స్
Investment For Children: ట్రెండ్ మారింది, చిల్డ్రన్ మ్యూచువల్ ఫండ్స్‌లోకి పెట్టుబడుల వరద
CM Chandrababu: 'ఏపీలో 2029లోనే ఎన్నికలు' - జమిలి ఎన్నికలపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Kalvakuntla Kavitha: తెలంగాణ జాగృతితో మళ్లీ రాజకీయ పోరాటం - ఈ సారి బీసీ నినాదం - కవిత ఇక అన్‌స్టాపబుల్ ?
Game Changer: ఇండియన్ హిస్టరీలో ఫస్ట్ టైమ్ ఇటువంటి ప్రీ రిలీజ్ వేడుక... రిలీజ్‌కు ముందు 'గేమ్ ఛేంజర్' ఖాతాలో అరుదైన రికార్డు
Rajamundry Rail Bridge: మన గోదారమ్మపై వంతెన ఎప్పటికీ అపురూపమే - రాజమండ్రి రోడ్ కం రైల్ బ్రిడ్జికి 50 ఏళ్లు!