By: ABP Desam | Updated at : 26 Apr 2023 03:44 PM (IST)
స్టాక్ మార్కెట్ అప్డేట్ ( Image Source : Pexels )
Stock Market Closing 26 April 2023:
స్టాక్ మార్కెట్లు బుధవారం లాభపడ్డాయి. ఇంటర్నేషనల్ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందాయి. బ్యాంకింగ్, రియాల్టీ, క్యాపిటల్ గూడ్స్, ఆటో షేర్లు యాక్టివ్‌గా ట్రేడయ్యాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 48 పాయింట్లు పెరిగి 17,818 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 169 పాయింట్లు పెరిగి 60,300 వద్ద ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 15 పైసలు బలపడి 81.76 వద్ద స్థిరపడింది.
BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)
క్రితం సెషన్లో 60,130 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 60,087 వద్ద మొదలైంది. 59,954 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 60,362 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 169 పాయింట్ల లాభంతో 60,300 వద్ద ముగిసింది.
NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)
మంగళవారం 17,769 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ బుధవారం 17,767 వద్ద ఓపెనైంది. 17,711 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 17,827 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 48 పాయింట్లు పెరిగి 17,818 వద్ద క్లోజైంది.
Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)
నిఫ్టీ బ్యాంక్ లాభపడింది. ఉదయం 42,559 వద్ద మొదలైంది. 42,432 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 42,875 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. సాయంత్రానికి 196 పాయింట్లు పెరిగి 42,875 వద్ద స్థిరపడింది.
Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)
నిఫ్టీ 50లో 33 కంపెనీలు లాభాల్లో 17 నష్టాల్లో ఉన్నాయి. పవర్ గ్రిడ్, టాటా కన్జూమర్, నెస్లే ఇండియా, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఎస్‌బీఐ లైఫ్ షేర్లు లాభపడ్డాయి. హిందాల్కో, అదానీ పోర్ట్స్, బజాజ్ ఆటో, బజాజ్ ఫిన్‌సర్వ్, ఎన్‌టీపీసీ షేర్లు నష్టపోయాయి. మెటల్, హెల్త్‌కేర్, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు స్వల్పంగా ఎరుపెక్కాయి. బ్యాంకు, ఆటో, ఫైనాన్స్, ఎఫ్‌ఎంసీజీ, పీఎస్‌యూ బ్యాంక్, రియాల్టీ సూచీలు ఎగిశాయి.
బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)
నేడు విలువైన లోహాల ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.110 పెరిగి రూ.61,040గా ఉంది. కిలో వెండి రూ.200 తగ్గి రూ.76,500 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.270 తగ్గి రూ.28,870 వద్ద ఉంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
In today's #StockTerm, let's look at what Ask Price is!#NSE #StockMarket #ShareMarket #StockTerms #NSEIndia #InvestorEducation #StockMarketIndia #StockExchange #StockTrading #Stocks #Investing #Trading #AskPrice pic.twitter.com/73si58jehy
— NSE India (@NSEIndia) April 26, 2023
Congratulations to Kirloskar Pneumatic Limited on getting listed at NSE today.#NSE #Listing #Kirloskar #StockMarket #ShareMarket @ashishchauhan pic.twitter.com/iBMNctRDzm
— NSE India (@NSEIndia) April 26, 2023
Mutual Funds: స్మార్ట్‌గా డబ్బు సంపాదించిన స్మాల్ క్యాప్ ఫండ్స్, మూడేళ్లలో 65% రిటర్న్
Stock Market News: 18,500 మీదే నిఫ్టీ క్లోజింగ్ - ఆటో, రియాల్టీ, మెటల్స్ బూమ్!
Stock Market News: ఫ్లాట్‌గా ట్రేడవుతున్న నిఫ్టీ, సెన్సెక్స్ - హీరో మోటో దూకుడు!
Stock Market News: రెడ్ జోన్లో సూచీలు - 18,500 నిఫ్టీ క్లోజింగ్!
Stock Market: లైఫ్ టైమ్ హై ముందు మార్కెట్లో వొలటిలిటీ - సెన్సెక్స్ 327 పాయింట్లు డౌన్!
Gudivada Amarnath: రైలు ప్రమాద స్థలాన్ని పరిశీలించిన మంత్రి గుడివాడ, మానవ తప్పిదమేనని వెల్లడి
TDP Leaders on YCP Govt: ఆనం వెంకట రమణారెడ్డిపై దాడి అనాగరికం, అప్రజాస్వామికం: టీడీపీ నేతలు
Sharwanand Wedding Photos : రాయల్‌గా శర్వా - రక్షిత వెడ్డింగ్, కొత్త జంట ఫోటోలు చూశారా?
Odisha Train Accident: రైల్వే నెట్‌వర్క్‌లో కొన్ని లూప్‌హోల్స్ ఉన్నాయ్, అసలు సమస్య అదే - నిపుణులు