search
×

Stock Market News: వరుసగా రెండో రోజు మార్కెట్లు పతనం - నిఫ్టీ 18,650 మీదే క్లోజింగ్‌!

Stock Market Closing 23 June 2023: స్టాక్‌ మార్కెట్లు వరుసగా రెండో రోజు నష్టాల్లో ముగిశాయి. గ్లోబల్‌ మార్కెట్ల నుంచి నెగెటివ్‌ సిగ్నల్స్‌ అందాయి.

FOLLOW US: 
Share:

Stock Market Closing 23 June 2023:

స్టాక్‌ మార్కెట్లు వరుసగా రెండో రోజు నష్టాల్లో ముగిశాయి. గ్లోబల్‌ మార్కెట్ల నుంచి నెగెటివ్‌ సిగ్నల్స్‌ అందాయి. అదానీ గ్రూప్‌ కంపెనీలపై అమెరికా రెగ్యులేటరీ సమీక్ష నేపథ్యంలో మదుపర్లు అమ్మకాలు చేపట్టారు. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 105 పాయింట్లు తగ్గి 18,665 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 259 పాయింట్లు తగ్గి 62,979 వద్ద ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 82.02 వద్ద స్థిరపడింది.

BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)

క్రితం సెషన్లో 63,238 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 63,124 వద్ద మొదలైంది. 62,874 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 63,240 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 259 పాయింట్ల నష్టంతో 62,979 వద్ద ముగిసింది.

NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)

గురువారం 18,771 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ శుక్రవారం 18,741 వద్ద ఓపెనైంది. 18,647 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 18,756 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 105 పాయింట్ల నష్టంతో 18,665 వద్ద క్లోజైంది.

Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)

నిఫ్టీ బ్యాంక్‌ ఎరుపెక్కింది. ఉదయం 43,641 వద్ద మొదలైంది. 43,519 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 43,824 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. సాయంత్రం 101 పాయింట్లు తగ్గి 43,622 వద్ద క్లోజైంది.

Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)

నిఫ్టీ 50లో 10 కంపెనీలు లాభాల్లో 40 నష్టాల్లో ఉన్నాయి. ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, ఏసియన్‌ పెయింట్స్‌, భారతీ ఎయిర్‌టెల్‌, ఎన్టీపీసీ షేర్లు లాభపడ్డాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, అదానీ పోర్ట్స్‌, బీపీసీఎల్‌, హిందాల్కో, దివిస్‌ ల్యాబ్‌ షేర్లు నష్టపోయాయి. ఫార్మా సూచీ ఒక్కటే గ్రీన్‌లో ఉంది. ఆటో, ఫైనాన్స్‌, ఐటీ, మీడియా, మెటల్‌, పీఎస్‌యూ బ్యాంక్‌, కన్జూమర్‌ డ్యురబుల్స్‌, ఆయిల్‌ అండ్ గ్యాస్‌ సూచీలు ఎరుపెక్కాయి.

బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)

నేడు విలువైన లోహాల ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.430 తగ్గి రూ.59,020గా ఉంది. కిలో వెండి రూ.500 తగ్గి రూ.71,500 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.680 తగ్గి రూ.24,220 వద్ద ఉంది. 

Also Read: ITR-1 ఎవరు ఫైల్ చేయాలి, ఎవరు ఎలిజిబుల్‌ కాదు?

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

Published at : 23 Jun 2023 04:14 PM (IST) Tags: Stock Market Update stock market today Stock Market Telugu Share Market Stock Market news

ఇవి కూడా చూడండి

SIP , PPFలో లాంగ్‌ టెర్మ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌కి ఏది ఉత్తమం? ఎక్కడ ఎక్కువ సంపాదించవచ్చు?

SIP , PPFలో లాంగ్‌ టెర్మ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌కి ఏది ఉత్తమం? ఎక్కడ ఎక్కువ సంపాదించవచ్చు?

Investments for Child : పిల్లల ఫ్యూచర్​ కోసం పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా ? ఈ ఈక్విటీ ఫండ్స్​తో అధిక రాబడి మీ సొంతం

Investments for Child : పిల్లల ఫ్యూచర్​ కోసం పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా ? ఈ ఈక్విటీ ఫండ్స్​తో అధిక రాబడి మీ సొంతం

Children Day: ట్రెండ్‌ మారింది, చిల్డ్రన్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి పెట్టుబడుల వరద

Children Day: ట్రెండ్‌ మారింది, చిల్డ్రన్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి పెట్టుబడుల వరద

Money Earning Tips: ఇలా SIP చేస్తే కోటీశ్వరులు అవుతారు.. రూ.2000తో మొదలుపెట్టి ఇలా ఇన్వెస్ట్ చేయాలి

Money Earning Tips: ఇలా SIP చేస్తే కోటీశ్వరులు అవుతారు.. రూ.2000తో మొదలుపెట్టి ఇలా ఇన్వెస్ట్ చేయాలి

Passive Income: SIPs నుంచి REITs దాకా పాసివ్‌ ఆదాయం ఎలా సంపాదించాలో తెలుసుకోండి

Passive Income: SIPs నుంచి REITs దాకా పాసివ్‌ ఆదాయం ఎలా సంపాదించాలో తెలుసుకోండి

టాప్ స్టోరీస్

AP Police Constable Recruitment: ఏపీలో పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్ మెంట్ పూర్తి.. ఈ నెల 22 నుంచి ట్రైనింగ్ ప్రారంభం

AP Police Constable Recruitment: ఏపీలో పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్ మెంట్  పూర్తి.. ఈ నెల 22 నుంచి ట్రైనింగ్ ప్రారంభం

Arjuna Ranatunga: వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ అర్జున రణతుంగపై అరెస్ట్ వారెంట్ జారీ.. ఏ క్షణంలోనైనా అరెస్ట్

Arjuna Ranatunga: వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ అర్జున రణతుంగపై అరెస్ట్ వారెంట్ జారీ.. ఏ క్షణంలోనైనా అరెస్ట్

Dharma Mahesh: గుంటూరులో ధర్మ మహేష్ బలప్రదర్శన... రెస్టారెంట్ ఓపెనింగ్‌కు వెయ్యి మందితో బైక్ ర్యాలీ!

Dharma Mahesh: గుంటూరులో ధర్మ మహేష్ బలప్రదర్శన... రెస్టారెంట్ ఓపెనింగ్‌కు వెయ్యి మందితో బైక్ ర్యాలీ!

Year Ender 2025: రికార్డు ధర నుంచి భారీ పతనం.. 2025లో బిట్‌కాయిన్ అనిశ్చితికి కారణాలివే

Year Ender 2025: రికార్డు ధర నుంచి భారీ పతనం.. 2025లో బిట్‌కాయిన్ అనిశ్చితికి కారణాలివే