By: ABP Desam | Updated at : 23 Dec 2022 11:02 AM (IST)
Edited By: Ramakrishna Paladi
స్టాక్ మార్కెట్
Stock Market Closing 23 December 2022:
భారత స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ నష్టాల్లో మొదలయ్యాయి. ఆసియా మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందాయి. కొవిడ్ భయంతో మదుపర్లు అమ్మకాలు చేపట్టారు. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 187 పాయింట్ల నష్టంతో 17,940 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 633 పాయింట్ల నష్టంతో 60,193 వద్ద కొనసాగుతున్నాయి. ఇన్వెస్టర్లు గంటలోనే రూ.3.50 లక్షల కోట్ల వరకు నష్టపోయారు.
BSE Sensex
క్రితం సెషన్లో 60,826 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 60,205 వద్ద మొదలైంది. 60,205 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 60,546 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 10 గంటలకు 633 పాయింట్ల నష్టంతో 60,193 వద్ద కొనసాగుతోంది.
NSE Nifty
గురువారం 18,127 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ శుక్రవారం 17,977 వద్ద ఓపెనైంది. 17,936 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 18,050 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 187 పాయింట్ల నష్టంతో 17,940 వద్ద చలిస్తోంది.
Nifty Bank
నిఫ్టీ బ్యాంక్ భారీ నష్టాల్లో ఉంది. ఉదయం 41,951 వద్ద మొదలైంది. 41,866 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 42,226 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 507 పాయింట్లు పతనమై 41,901 వద్ద ఉంది.
Gainers and Lossers
నిఫ్టీ 50లో 6 కంపెనీలు లాభాల్లో 44 నష్టాల్లో ఉన్నాయి. దివిస్ ల్యాబ్, సిప్లా, డాక్టర్ రెడ్డీస్, సన్ ఫార్మా, నెస్లే ఇండియా లాభాల్లో ఉన్నాయి. అదానీ పోర్ట్స్, హిందాల్కో, టాటా మోటార్స్, టాటా స్టీల్, అదానీ ఎంటర్‌ప్రైజెస్ నష్టపోయాయి. ఫార్మా, హెల్త్‌కేర్ మినహా అన్ని రంగాల సూచీలు పతనమయ్యాయి. రియాల్టీ, పీఎస్‌యూ బ్యాంక్, మీడియా, ఆటో ఎక్కువ ఎరుపెక్కాయి.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Trisha: త్రిష ఇంట విషాదం... క్రిస్మస్ రోజు కుమారుడిని కోల్పోయానంటూ హీరోయిన్ ఎమోషనల్
Year Ender 2024: 2024లో పెట్టుబడిదార్లను ధనవంతులుగా మార్చిన టాప్-10 మ్యూచువల్ ఫండ్స్
New Mutual Fund: 'స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్' - అధిక లాభాలు కోరుకునే హైరిస్క్ ఇన్వెస్టర్లకు బెస్ట్ ఆప్షన్!
SIP Strategies: మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు
Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే"కింగ్" ఎంట్రీ - జియోకి గ్రీన్ సిగ్నల్
Banakacharla Project: ఏపీలో మూడేళ్లలో బనకచర్లకు గోదావరి జలాలు- మూడు నెలల్లో డీపీఆర్, టెండర్లు - హైబ్రీడ్ విధానంలో పనులు
Revanth Reddy Meets Satyanadella: మైక్రోసాఫ్ట్ సీఈవోతో రేవంత్ రెడ్డి సమావేశం -తెలంగాణలో సాఫ్ట్‌వేర్ రంగ అభివృద్ధిపై చర్చ
Pawan Kalyan: 'ఇకపై నెలలో 14 రోజులు ప్రజల్లోనే ' - అన్నీ సరిచేస్తానంటూ డిప్యూటీ సీఎం పవన్ ఆసక్తికర కామెంట్స్
KTR: ఈడీ నోటీసులొచ్చాయి కానీ - కేటీఆర్ ఫస్ట్ రియాక్షన్ - పూర్తిగా లైట్ తీసుకున్నట్లేనా !?