search
×

Stock Market Closing: మళ్లీ ఊపొచ్చింది! 60K పైనే స్థిరపడ్డి సెన్సెక్స్‌, 86 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ

Stock Market Closing Bell 23 August 2022: రెండు రోజుల భారీ నష్టాలకు తెర పడింది! భారత స్టాక్‌ మార్కెట్లు మంగళవారం లాభాల్లో ముగిశాయి. ఐరోపా, అంతర్జాతీయంగా ఇంధన ధరల పెరుగుదల అంశాలు కలవరపెట్టాయి.

FOLLOW US: 
Share:

Stock Market Closing Bell 23 August 2022: రెండు రోజుల భారీ నష్టాలకు తెర పడింది! భారత స్టాక్‌ మార్కెట్లు మంగళవారం లాభాల్లో ముగిశాయి. ఉదయం తీవ్ర ఒడుదొడుకులు ఎదుర్కొన్న సూచీలు మధ్యాహ్నం తర్వాత నిలదొక్కుకున్నాయి. ఐరోపా, అంతర్జాతీయంగా ఇంధన ధరల పెరుగుదల అంశాలు కలవరపెట్టాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 86 పాయింట్ల లాభంతో 17,577 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 257 పాయింట్ల లాభంతో 59,031 వద్ద ముగిశాయి. డాలర్‌త పోలిస్తే రూపాయి 2 పైసలు బలహీన పడి 79.91 వద్ద స్థిరపడింది.

BSE Sensex

క్రితం సెషన్లో 58,789 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 58,205 వద్ద మొదలైంది. 58,172 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 59,199 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 257 పాయింట్ల లాభంతో 59,031 వద్ద ముగిసింది.

NSE Nifty

సోమవారం 17,490 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ మంగళవారం 17,357 వద్ద ఓపెనైంది. 17,345 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 17,625 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 86 పాయింట్ల లాభంతో 17,577 వద్ద క్లోజైంది.

Nifty Bank

నిఫ్టీ బ్యాంక్‌ భారీ లాభాల్లో ముగిసింది. ఉదయం 37,955 వద్ద మొదలైంది. 37,950 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 38,869 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 399 పాయింట్ల లాభంతో 38,697 వద్ద స్థిరపడింది.

Gainers and Lossers

నిఫ్టీ 50లో 42 కంపెనీలు లాభాల్లో 8 నష్టాల్లో ఉన్నాయి. ఎం అండ్‌ ఎం, ఐచర్‌ మోటార్స్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, టైటాన్‌, టాటా స్టీల్‌ షేర్లు లాభపడ్డాయి. ఇన్ఫీ, టీసీఎస్‌, దివిస్‌ ల్యాబ్‌, హిందుస్థాన్‌ యునీలివర్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌ నష్టపోయాయి. ఐటీ మినహా మిగతా సూచీలన్నీ ఎగిశాయి. బ్యాంకు, ఆటో, మెటల్‌, కన్జూమర్‌ డ్యురబుల్స్‌, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ సూచీలు ఒక శాతాన్ని మించి లాభాల్లో ముగిశాయి. 

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

View this post on Instagram
 
A post shared by BSEIndia (@bseindia)

Published at : 23 Aug 2022 04:05 PM (IST) Tags: Stock Market Update stock market today Stock Market Telugu Share Market Stock Market news

ఇవి కూడా చూడండి

Investing In SIP: ప్రతి నెలా రూ.1000 SIP చేస్తే మీరు ఎన్ని సంవత్సరాల్లో రూ.కోటి సంపాదిస్తారు?

Investing In SIP: ప్రతి నెలా రూ.1000 SIP చేస్తే మీరు ఎన్ని సంవత్సరాల్లో రూ.కోటి సంపాదిస్తారు?

Trisha: త్రిష ఇంట విషాదం... క్రిస్మస్ రోజు కుమారుడిని కోల్పోయానంటూ హీరోయిన్ ఎమోషనల్

Trisha: త్రిష ఇంట విషాదం... క్రిస్మస్ రోజు కుమారుడిని కోల్పోయానంటూ హీరోయిన్ ఎమోషనల్

Year Ender 2024: 2024లో పెట్టుబడిదార్లను ధనవంతులుగా మార్చిన టాప్‌-10 మ్యూచువల్ ఫండ్స్‌

Year Ender 2024: 2024లో పెట్టుబడిదార్లను ధనవంతులుగా మార్చిన టాప్‌-10 మ్యూచువల్ ఫండ్స్‌

New Mutual Fund: 'స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్‌' - అధిక లాభాలు కోరుకునే హైరిస్క్‌ ఇన్వెస్టర్లకు బెస్ట్‌ ఆప్షన్‌!

New Mutual Fund: 'స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్‌' - అధిక లాభాలు కోరుకునే హైరిస్క్‌ ఇన్వెస్టర్లకు బెస్ట్‌ ఆప్షన్‌!

SIP Strategies: మ్యూచువల్‌ ఫండ్స్‌ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు

SIP Strategies: మ్యూచువల్‌ ఫండ్స్‌ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు

టాప్ స్టోరీస్

CM Revanth Reddy: 'భేషజాలు లేవు, ఎవరి సలహాలనైనా స్వీకరిస్తాను' - పుస్తకావిష్కరణలో సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు, ఒకే వేదికపై అన్ని పార్టీల నేతలు

CM Revanth Reddy: 'భేషజాలు లేవు, ఎవరి సలహాలనైనా స్వీకరిస్తాను' - పుస్తకావిష్కరణలో సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు, ఒకే వేదికపై అన్ని పార్టీల నేతలు

Bhogi 2025 : భోగిపళ్లకి దిష్టికి ఏంటి సంబంధం ..భోగిపళ్లు అంటే ఏమేం ఉంటాయి!

Bhogi 2025 : భోగిపళ్లకి దిష్టికి ఏంటి సంబంధం ..భోగిపళ్లు అంటే ఏమేం ఉంటాయి!

JC Prabhakar Reddy: 'తిరుమల టోకెన్లు అమ్ముకుని రోజా బెంజ్ కారు తెచ్చుకుంది' - మాజీ మంత్రిపై జేసీ ప్రభాకర్‌రెడ్డి సంచలన కామెంట్స్

JC Prabhakar Reddy: 'తిరుమల టోకెన్లు అమ్ముకుని రోజా బెంజ్ కారు తెచ్చుకుంది' - మాజీ మంత్రిపై జేసీ ప్రభాకర్‌రెడ్డి సంచలన కామెంట్స్

Daaku Mahaaraj Review - డాకు మహారాజ్ రివ్యూ: బాక్సాఫీస్ కింగ్ అయ్యే ఛాన్స్ ఉందా? బాలకృష్ణ సినిమా ఎలా ఉందంటే?

Daaku Mahaaraj Review - డాకు మహారాజ్ రివ్యూ: బాక్సాఫీస్ కింగ్ అయ్యే ఛాన్స్ ఉందా? బాలకృష్ణ సినిమా ఎలా ఉందంటే?