By: ABP Desam | Updated at : 21 Dec 2022 03:50 PM (IST)
Edited By: Ramakrishna Paladi
స్టాక్ మార్కెట్ అప్డేట్
Stock Market Closing 21 December 2022:
భారత స్టాక్ మార్కెట్లు బుధవారం భారీగా నష్టపోయాయి. ఆసియా మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు వచ్చాయి. చైనాలో కొవిడ్ ప్రకంపనలతో మదుపర్లు అమ్మకాలు చేపట్టారు. ఫార్మా, హెల్త్‌కేర్ షేర్లు మాత్రమే కొనుగోలు చేశారు. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 186 పాయింట్ల నష్టంతో 18,199 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 635 పాయింట్ల నష్టంతో 61,067 వద్ద ముగిశాయి. ఈ ఒక్కరోజే మదుపర్లు రూ.3.5 లక్షల కోట్లమేర సంపద కోల్పోయారు.
BSE Sensex
క్రితం సెషన్లో 61,702 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 61,993 వద్ద మొదలైంది. 60,938 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 62,006 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 635 పాయింట్ల నష్టంతో 61,067 వద్ద ముగిసింది.
NSE Nifty
మంగళవారం 18,385 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ బుధవారం 18,435 వద్ద ఓపెనైంది. 18,162 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 18,473 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 186 పాయింట్ల నష్టంతో 18,199 వద్ద క్లోజైంది.
Nifty Bank
నిఫ్టీ బ్యాంక్ భారీగా నష్టపోయింది. ఉదయం 43,525 వద్ద మొదలైంది. 42,363 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 43,614 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 741 పాయింట్లు పతనమై 42,617 వద్ద స్థిరపడింది.
Gainers and Lossers
నిఫ్టీ 50లో 12 కంపెనీలు లాభాల్లో 38 నష్టాల్లో ఉన్నాయి. దివిస్ ల్యాబ్, సిప్లా, అపోలో హాస్పిటల్స్, సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్ షేర్లు లాభపడ్డాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ పోర్ట్స్, అల్ట్రాటెక్ సెమ్, ఇండస్ ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫిన్‌సర్వ్ షేర్లు నష్టపోయాయి. ఎఫ్‌ఎంసీజీ, ఫార్మా, హెల్త్‌కేర్, ఐటీ మినహా అన్ని రంగాల సూచీలు ఎరుపెక్కాయి.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Trisha: త్రిష ఇంట విషాదం... క్రిస్మస్ రోజు కుమారుడిని కోల్పోయానంటూ హీరోయిన్ ఎమోషనల్
Year Ender 2024: 2024లో పెట్టుబడిదార్లను ధనవంతులుగా మార్చిన టాప్-10 మ్యూచువల్ ఫండ్స్
New Mutual Fund: 'స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్' - అధిక లాభాలు కోరుకునే హైరిస్క్ ఇన్వెస్టర్లకు బెస్ట్ ఆప్షన్!
SIP Strategies: మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు
Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే"కింగ్" ఎంట్రీ - జియోకి గ్రీన్ సిగ్నల్
Maha Kumbh Mela 2025: మహా కుంభమేళా కోసం ప్రత్యేక రైళ్లు, 40 కోట్ల మంది వస్తారని అంచనా- సీపీఆర్వో
Daaku Maharaaj Trailer: 'డాకు మహారాజ్' ట్రైలర్ వచ్చేసింది... బాలయ్య ఒక్క డైలాగ్ చెప్పలేదు కానీ మామూలు మాసీగా లేదు
Nara Lokesh: దటీజ్ నారా లోకేష్ - గంటల వ్యవధిలో మాట నిలబెట్టుకున్న ఏపీ మంత్రి
Jasprit Bumrah Injury: స్టార్ పేసర్ బుమ్రా లేకపోతే ఆస్ట్రేలియా బ్యాటర్లను ఆపలేరా? ఇలాగైతే టీమిండియాకు కష్టమే