By: ABP Desam | Updated at : 20 Apr 2023 03:49 PM (IST)
స్టాక్ మార్కెట్ అప్డేట్
Stock Market Closing 20 April 2023:
స్టాక్ మార్కెట్లు గురువారం ఫ్లాట్‌గా ముగిశాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి మిక్స్‌డ్ సిగ్నల్స్ వచ్చాయి. రియాల్టీ, ఫార్మా, ఐటీ షేర్లు సెల్లింగ్ ప్రెజర్‌కు గురయ్యాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 5 పాయింట్లు పెరిగి 17,624 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 64 పాయింట్లు పెరిగి 59,632 వద్ద ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 8 పైసలు పెరిగి 82.15 వద్ద స్థిరపడింది.
BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)
క్రితం సెషన్లో 59,567 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 59,586 వద్ద మొదలైంది. 59,489 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 59,836 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 64 పాయింట్ల లాభంతో 59,632 వద్ద ముగిసింది.
NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)
బుధవారం 17,618 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ గురువారం 17,638 వద్ద ఓపెనైంది. 17,584 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 17,684 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 5 పాయింట్లు పెరిగి 17,624 వద్ద క్లోజైంది.
Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)
నిఫ్టీ బ్యాంక్ లాభపడింది. ఉదయం 42,218 వద్ద మొదలైంది. 42,108 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 42,378 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఆఖరికి 115 పాయింట్లు పెరిగి 42,269 వద్ద స్థిరపడింది.
Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)
నిఫ్టీ 50లో 26 కంపెనీలు లాభాల్లో 23 నష్టాల్లో ఉన్నాయి. అదానీ పోర్ట్స్, ఎన్టీపీసీ, టాటా మోటార్స్, బజాజ్ ఆటో, ఏసియన్ పెయింట్స్ లాభపడ్డాయి. దివిస్ ల్యాబ్, ఐచర్ మోటార్స్, హిందుస్థాన్ యునీలివర్, హిందాల్కో, డాక్టర్ రెడ్డీస్ షేర్లు నష్టపోయాయి. బ్యాంకు, ఆటో, ఫైనాన్స్, మీడియా, ప్రైవేటు బ్యాంక్, కన్జూమర్ డ్యురబుల్స్ సూచీలు ఎగిశాయి. ఎఫ్‌ఎంసీజీ, ఐటీ, మెటల్, ఫార్మా, రియాల్టీ, హెల్త్‌కేర్, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు ఎరుపెక్కాయి.
బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)
నేడు విలువైన లోహాల ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.220 తగ్గి రూ.60,930గా ఉంది. కిలో వెండి రూ.200 తగ్గి రూ.77,400 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.320 పెరిగి రూ.28,740 వద్ద ఉంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
SIP Strategies: మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు
Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే"కింగ్" ఎంట్రీ - జియోకి గ్రీన్ సిగ్నల్
Mutual Funds: మీ డబ్బును వేగంగా రెట్టింపు చేసే 5 ఫండ్స్, 15-20 ఏళ్లు ఎదురు చూడాల్సిన అవసరం లేదు
Investment Tips: నెలకు రూ.20 వేలతో మూడేళ్లలో రూ.12 లక్షలు - అద్భుతం చేసిన ELSS ఫండ్స్
Investment For Children: ట్రెండ్ మారింది, చిల్డ్రన్ మ్యూచువల్ ఫండ్స్‌లోకి పెట్టుబడుల వరద
YSRCP Plan: పవన్ కల్యాణ్‌ను పొగిడేస్తున్న వైఎస్ఆర్‌సీపీ - 2029కి జగన్ రోడ్ మ్యాప్ రెడీ చేసుకున్నారా?
Om Prakash Chautala: హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాష్ చౌతాలా కన్నుమూత
KTR: 'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
Ambedkar Row in Parliament: మరింత తీవ్రమవుతున్న అమిత్‌షా కామెంట్స్ వివాదం- నేడు కాంగ్రెస్ దేశవ్యాప్త నిరసనలు