By: ABP Desam | Updated at : 14 Jun 2023 03:55 PM (IST)
స్టాక్ మార్కెట్ అప్డేట్, ( Image Source : Unsplash )
Stock Market Closing 14 June 2023:
స్టాక్ మార్కెట్లు బుధవారం స్వల్ప లాభాల్లో ముగిశాయి. ఆల్‌టైమ్ హై దిశగా సాగే క్రమంలో కన్సాలిడేషన్ అవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 39 పాయింట్లు పెరిగి 18,755 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 85 పాయింట్లు పెరిగి 63,228 వద్ద ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 27 పైసలు బలపడి 82.10 వద్ద స్థిరపడింది.
BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)
క్రితం సెషన్లో 63,143 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 63,115 వద్ద మొదలైంది. 63,013 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 63,274 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 85 పాయింట్ల లాభంతో 63,228 వద్ద ముగిసింది.
NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)
మంగళవారం 18,716 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ బుధవారం 18,744 వద్ద ఓపెనైంది. 18,690 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 18,769 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 39 పాయింట్లు ఎగిసి 18,755 వద్ద క్లోజైంది.
Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)
నిఫ్టీ బ్యాంక్ నష్టపోయింది. ఉదయం 44,181 వద్ద మొదలైంది. 43,956 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 44,212 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఆఖరికి 91 పాయింట్లు తగ్గి 43,988 వద్ద నడుస్తోంది.
Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)
నిఫ్టీ 50లో 27 కంపెనీలు లాభాల్లో 22 నష్టాల్లో ఉన్నాయి. టాటా కన్జూమర్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్, గ్రాసిమ్, పవర్ గ్రిడ్ షేర్లు లాభపడ్డాయి. భారతీ ఎయిర్‌టెల్, బజాజ్ ఫైనాన్స్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, హీరోమోటో కార్ప్ షేర్లు తగ్గాయి. బ్యాంకు, ఫైనాన్స్, ఐటీ, మీడియా, ఫార్మా, ప్రైవేటు బ్యాంకు సూచీలు తగ్గాయి. ఎఫ్‌ఎంసీజీ, మెటల్, రియాల్టీ, హెల్త్‌కేర్, కన్జూమర్ డ్యురబుల్స్, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు ఎగిశాయి.
బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)
నేడు విలువైన లోహాల ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.400 తగ్గి రూ.60,050గా ఉంది. కిలో వెండి రూ.100 తగ్గి రూ.74,000 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.460 తగ్గి రూ.25,890 వద్ద ఉంది.
Also Read: మ్యూచువల్ ఫండ్స్‌లో SIP మాత్రమే కాదు, STP కూడా ఉంది తెలుసా?
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Rights entitlement is the privilege for existing shareholders to purchase additional shares in proportion to their current holdings. Know more: https://t.co/4xnivMHmBU#NSE #NSEIndia #Investing #StockMarket #ShareMarket #RightsEntitlement @ashishchauhan
— NSE India (@NSEIndia) June 14, 2023
Congratulations to Kore Digital Limited on getting listed on NSE Emerge today. Public Issue was of Rs. 1800 lakhs at an issue price of Rs. 180 per share.#NSE #Listing #IPO #NSEIndia #StockMarket #ShareMarket #BellRinging #NSEBell #KoreDigital @ashishchauhan pic.twitter.com/wvzleSk8q6
— NSE India (@NSEIndia) June 14, 2023
Year Ender 2024: 2024లో పెట్టుబడిదార్లను ధనవంతులుగా మార్చిన టాప్-10 మ్యూచువల్ ఫండ్స్
New Mutual Fund: 'స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్' - అధిక లాభాలు కోరుకునే హైరిస్క్ ఇన్వెస్టర్లకు బెస్ట్ ఆప్షన్!
SIP Strategies: మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు
Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే"కింగ్" ఎంట్రీ - జియోకి గ్రీన్ సిగ్నల్
Mutual Funds: మీ డబ్బును వేగంగా రెట్టింపు చేసే 5 ఫండ్స్, 15-20 ఏళ్లు ఎదురు చూడాల్సిన అవసరం లేదు
Game Changer : ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్!
Anger On Allu Arjun: 'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
Allu Arjun: బాధ్యతగా ఉండండి - ఫ్యాన్స్‌కు బన్నీ ఇంపార్టెంట్ మెసేజ్!
PM Modi : మిమ్మల్ని చూస్తుంటే నాకు 12 గంటలు పని చేయాలనిపిస్తోంది - కువైట్‌లో కార్మికులతో మోదీ