search
×

Stock Market News: కన్సాలిడేషన్‌ కంటిన్యూ - సెన్సెక్స్‌ 99 పాయింట్లు అప్‌, నిఫ్టీ 18,600 మీదే క్లోజింగ్‌!

Stock Market Closing 12 June 2023: స్టాక్‌ మార్కెట్లు సోమవారం స్వల్ప లాభాల్లో ముగిశాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 38 పాయింట్లు పెరిగింది.

FOLLOW US: 
Share:

Stock Market Closing 12 June 2023: 

స్టాక్‌ మార్కెట్లు సోమవారం స్వల్ప లాభాల్లో ముగిశాయి. గ్లోబల్‌ మార్కెట్ల నుంచి మిక్స్‌డ్‌ సిగ్నల్స్‌ అందాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 38 పాయింట్లు పెరిగి 18,601 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 99 పాయింట్లు ఎగిసి 62,724 వద్ద కొనసాగుతున్నాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 3 పైసలు బలపడి 82.43 వద్ద స్థిరపడింది.

BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)

క్రితం సెషన్లో 62,625 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 62,659 వద్ద మొదలైంది. 62,615 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 62,804 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 99 పాయింట్ల లాభంతో 62,724 వద్ద ముగిసింది.

NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)

శుక్రవారం 18,563 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ సోమవారం 18,595 వద్ద ఓపెనైంది. 18,559 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 18,633 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఆఖరికి 38 పాయింట్లు పెరిగి 18,601 వద్ద క్లోజైంది.

Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)

నిఫ్టీ బ్యాంక్‌ ఫ్లాట్‌గా ముగిసింది. ఉదయం 44,035 వద్ద మొదలైంది. 43,874 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 44,124 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. సాయంత్రం 44 పాయింట్లు తగ్గి 43,944 వద్ద ముగిసింది.

Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)

నిఫ్టీ 50లో 37 కంపెనీలు లాభాల్లో 13 నష్టాల్లో ఉన్నాయి. బీపీసీఎల్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఎన్టీపీసీ, ఇన్ఫీ, అదానీ పోర్ట్స్‌ షేర్లు లాభపడ్డాయి. పవర్ గ్రిడ్‌, ఎల్‌టీ, సిప్లా, మారుతీ, టైటాన్ షేర్లు  నష్టపోయాయి. బ్యాంకు, ఫైనాన్స్‌, ఫార్మా, ప్రైవేటు బ్యాంకు, హెల్త్‌కేర్‌ సూచీలు ఎరుపెక్కాయి. ఆటో, ఐటీ, మీడియా, ఎఫ్ఎంసీజీ, మెటల్‌, పీఎస్‌యూ బ్యాంక్‌, రియాల్టీ, కన్జూమర్‌ డ్యురబుల్స్‌ సూచీలు ఎగిశాయి.

బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)

నేడు విలువైన లోహాల ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.100 తగ్గి రూ.60,450గా ఉంది. కిలో వెండి రూ.200 తగ్గి రూ.74,౩00 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.150 తగ్గి రూ.25,560 వద్ద ఉంది. 

Also Read: ఐటీ రిటర్న్ ఫైల్ చేసే ముందు ఇది చెక్ చేయండి, మీకు తిరుగుండదు

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

Published at : 12 Jun 2023 03:50 PM (IST) Tags: Stock Market Update stock market today Stock Market Telugu Share Market Stock Market news

ఇవి కూడా చూడండి

Retirement Planning : రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం స్టెప్-అప్ SIPలు బెస్ట్... ఎక్కువ బెనిఫిట్స్ కోసం

Retirement Planning : రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం స్టెప్-అప్ SIPలు బెస్ట్... ఎక్కువ బెనిఫిట్స్ కోసం

SIP , PPFలో లాంగ్‌ టెర్మ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌కి ఏది ఉత్తమం? ఎక్కడ ఎక్కువ సంపాదించవచ్చు?

SIP , PPFలో లాంగ్‌ టెర్మ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌కి ఏది ఉత్తమం? ఎక్కడ ఎక్కువ సంపాదించవచ్చు?

Investments for Child : పిల్లల ఫ్యూచర్​ కోసం పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా ? ఈ ఈక్విటీ ఫండ్స్​తో అధిక రాబడి మీ సొంతం

Investments for Child : పిల్లల ఫ్యూచర్​ కోసం పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా ? ఈ ఈక్విటీ ఫండ్స్​తో అధిక రాబడి మీ సొంతం

Children Day: ట్రెండ్‌ మారింది, చిల్డ్రన్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి పెట్టుబడుల వరద

Children Day: ట్రెండ్‌ మారింది, చిల్డ్రన్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి పెట్టుబడుల వరద

Money Earning Tips: ఇలా SIP చేస్తే కోటీశ్వరులు అవుతారు.. రూ.2000తో మొదలుపెట్టి ఇలా ఇన్వెస్ట్ చేయాలి

Money Earning Tips: ఇలా SIP చేస్తే కోటీశ్వరులు అవుతారు.. రూ.2000తో మొదలుపెట్టి ఇలా ఇన్వెస్ట్ చేయాలి

టాప్ స్టోరీస్

AP Crime News: పోలీసుల అదుపులో ఉన్న వ్యక్తిని కొడవళ్లతో నరికి దారుణహత్య.. వివాహేతర సంబంధమే కారణమా?

AP Crime News: పోలీసుల అదుపులో ఉన్న వ్యక్తిని కొడవళ్లతో నరికి దారుణహత్య.. వివాహేతర సంబంధమే కారణమా?

Donald Trump: 120 దేశాల వలసదారులకు అమెరికా సాయం.. జాబితాలో కనిపించని భారత్, పలు దేశాల్లో గందరగోళం

Donald Trump: 120 దేశాల వలసదారులకు అమెరికా సాయం.. జాబితాలో కనిపించని భారత్, పలు దేశాల్లో గందరగోళం

Crazy Kalyanam : 'క్రేజీ కల్యాణం' చూసేందుకు రెడీయేనా! - క్రేజీ కాంబోతో వంద శాతం ఎంటర్టైన్మెంట్ కన్ఫర్మ్

Crazy Kalyanam : 'క్రేజీ కల్యాణం' చూసేందుకు రెడీయేనా! - క్రేజీ కాంబోతో వంద శాతం ఎంటర్టైన్మెంట్ కన్ఫర్మ్

Jana Nayagan OTT : 'జన నాయగన్' రిలీజ్‌కు ముందే ట్విస్ట్? - ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయిపోయిందా!

Jana Nayagan OTT : 'జన నాయగన్' రిలీజ్‌కు ముందే ట్విస్ట్? - ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయిపోయిందా!