search
×

Stock Market Today: సాయంత్రం చల్లబడ్డ స్టాక్‌ మార్కెట్లు - సెన్సెక్స్‌ 274, నిఫ్టీ 83 పాయింట్లు అప్‌!

Stock Market Closing 11 July 2023: స్టాక్‌ మార్కెట్లు మంగళవారం మోస్తరు లాభాల్లో ముగిశాయి. ఉదయం భారీగా కొనుగోళ్లు చేపట్టిన మదుపర్లు మధ్యాహ్నం తర్వాత చల్లబడ్డారు.

FOLLOW US: 
Share:

Stock Market Closing 11 July 2023:

స్టాక్‌ మార్కెట్లు మంగళవారం మోస్తరు లాభాల్లో ముగిశాయి. ఉదయం భారీగా కొనుగోళ్లు చేపట్టిన మదుపర్లు మధ్యాహ్నం తర్వాత చల్లబడ్డారు. అంతర్జాతీయంగా మిశ్రమ సంకేతాలు అందాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 83 పాయింట్లు పెరిగి 19,439 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 273 పాయింట్లు ఎగిసి 65,617 వద్ద ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 21 పైసలు బలపడి 82.36 వద్ద స్థిరపడింది.

BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)

క్రితం సెషన్లో 65,390 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 65,598 వద్ద మొదలైంది. 65,517 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 65,870 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 273 పాయింట్ల లాభంతో 65,617 వద్ద ముగిసింది.

NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)

సోమవారం 19,368 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ మంగళవారం 19,427 వద్ద ఓపెనైంది. 19,406 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 19,515 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 83 పాయింట్లు పెరిగి 19,439 వద్ద క్లోజైంది.

Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)

నిఫ్టీ బ్యాంక్‌ నష్టపోయింది. ఉదయం 44,998 వద్ద మొదలైంది. 44,663 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 45,139 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. సాయంత్రం 115 పాయింట్లు తగ్గి 44,745 వద్ద ముగిసింది.

Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)

నిఫ్టీ 50లో 33 కంపెనీలు లాభాల్లో 15 నష్టాల్లో ఉన్నాయి. ఐచర్‌ మోటార్స్‌, సన్ ఫార్మా, టాటా కన్జూమర్‌, అపోలో హాస్పిటల్స్‌, మారుతీ షేర్లు లాభపడ్డాయి. యూపీఎల్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌ షేర్లు నష్టపోయాయి. ఆటో, ఎఫ్‌ఎంసీజీ, ఐటీ, హెల్త్‌కేర్‌, కన్జూమర్‌ డ్యురబుల్స్‌, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ సూచీలు పెరిగాయి. బ్యాంకు, ఫైనాన్స్‌, మెటల్‌ సూచీలు ఎరుపెక్కాయి.

బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)

నేడు విలువైన లోహాల ధరల్లో మార్పులేం లేవు. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.59,410గా ఉంది. కిలో వెండి రూ.73,400 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.540 పెరిగి రూ.24,720 వద్ద ఉంది. 

Also Read: మధుమేహులకు బంపర్‌ ఆఫర్‌! డయాబెటిక్‌ టర్మ్‌ ఇన్సూరెన్స్‌ స్కీమ్‌ వచ్చేసింది!

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

Join Us on Telegram: https://t.me/abpdesamofficial 

Published at : 11 Jul 2023 03:47 PM (IST) Tags: Nse Nifty Share Market Nifty Bank Stock Market news BSE Sensex Stock Market update

ఇవి కూడా చూడండి

Trisha: త్రిష ఇంట విషాదం... క్రిస్మస్ రోజు కుమారుడిని కోల్పోయానంటూ హీరోయిన్ ఎమోషనల్

Trisha: త్రిష ఇంట విషాదం... క్రిస్మస్ రోజు కుమారుడిని కోల్పోయానంటూ హీరోయిన్ ఎమోషనల్

Year Ender 2024: 2024లో పెట్టుబడిదార్లను ధనవంతులుగా మార్చిన టాప్‌-10 మ్యూచువల్ ఫండ్స్‌

Year Ender 2024: 2024లో పెట్టుబడిదార్లను ధనవంతులుగా మార్చిన టాప్‌-10 మ్యూచువల్ ఫండ్స్‌

New Mutual Fund: 'స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్‌' - అధిక లాభాలు కోరుకునే హైరిస్క్‌ ఇన్వెస్టర్లకు బెస్ట్‌ ఆప్షన్‌!

New Mutual Fund: 'స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్‌' - అధిక లాభాలు కోరుకునే హైరిస్క్‌ ఇన్వెస్టర్లకు బెస్ట్‌ ఆప్షన్‌!

SIP Strategies: మ్యూచువల్‌ ఫండ్స్‌ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు

SIP Strategies: మ్యూచువల్‌ ఫండ్స్‌ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు

Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే"కింగ్‌" ఎంట్రీ - జియోకి గ్రీన్‌ సిగ్నల్‌

Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే

టాప్ స్టోరీస్

Nitish Family Photo With Kohli: కోహ్లీతో సెల్ఫీ దొరకలేదనే కసితో మొదలై.. తన ఫ్యామిలీతోనే విరాట్ ఫొటో దిగేలా ఎదిగిన నితీశ్.. వాట్ ఏ జర్నీ

Nitish Family Photo With Kohli: కోహ్లీతో సెల్ఫీ దొరకలేదనే కసితో మొదలై.. తన ఫ్యామిలీతోనే విరాట్ ఫొటో దిగేలా ఎదిగిన నితీశ్.. వాట్ ఏ జర్నీ

Venkatesh: వెంకటేష్ వారసుడు వస్తున్నాడోచ్... సినిమాల్లోకి వచ్చేందుకు అర్జున్ దగ్గుబాటి రెడీ

Venkatesh: వెంకటేష్ వారసుడు వస్తున్నాడోచ్... సినిమాల్లోకి వచ్చేందుకు అర్జున్ దగ్గుబాటి రెడీ

South Korea Plane Crash: ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, చెలరేగిన మంటలు - 28 మంది మృతి

South Korea Plane Crash: ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, చెలరేగిన మంటలు - 28 మంది మృతి

Anand Deverakonda: హిట్ దర్శకుడితో ఆనంద్ దేవరకొండ కొత్త సినిమా - హీరోయిన్‌గా మలయాళీ భామకు ఛాన్స్

Anand Deverakonda: హిట్ దర్శకుడితో ఆనంద్ దేవరకొండ కొత్త సినిమా - హీరోయిన్‌గా మలయాళీ భామకు ఛాన్స్