search
×

Sensex Today: నిఫ్టీ మేజర్‌ సపోర్ట్‌ బ్రేక్‌! స్టాక్‌ మార్కెట్లు మరింత క్రాష్‌ అవుతాయా!

Stock Market Closing 11 August 2023: స్టాక్‌ మార్కెట్ల వరుస పతనానికి అడ్డుకట్ట పడటం లేదు. శుక్రవారమూ భారీగా నష్టపోయాయి.

FOLLOW US: 
Share:

Stock Market Closing 11 August 2023:

స్టాక్‌ మార్కెట్ల వరుస పతనానికి అడ్డుకట్ట పడటం లేదు. శుక్రవారమూ భారీగా నష్టపోయాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందాయి. నిఫ్టీ కీలకమైన సపోర్ట్‌ లెవల్స్‌ను బ్రేక్‌ చేసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 114 పాయింట్లు తగ్గి 19,428 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 365 పాయింట్లు తగ్గి 65,322 వద్ద ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 14 పైసలు బలహీనపడి రూ.82.85 వద్ద స్థిరపడింది.

BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)

క్రితం సెషన్లో 65,688 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 65,727 వద్ద మొదలైంది. 65,274 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 65,727 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 365 పాయింట్ల నష్టంతో 65,322 వద్ద ముగిసింది.


NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)

గురువారం 19,543 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ శుక్రవారం 19,554 వద్ద ఓపెనైంది. 19,412 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 19,557 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. 114 పాయింట్లు తగ్గి 19,428 వద్ద క్లోజైంది.

Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)

నిఫ్టీ బ్యాంక్‌ నష్టపోయింది. ఉదయం 44,568 వద్ద మొదలైంది. 44,120 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 44,571 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. సాయంత్రం 342 పాయింట్లు తగ్గి 44,199 వద్ద స్థిరపడింది.

Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)

నిఫ్టీ 50లో 11 కంపెనీలు లాభాల్లో 39 నష్టాల్లో ఉన్నాయి. హెచ్‌సీఎల్‌ టెక్‌, టైటాన్‌, టాటా స్టీల్‌, పవర్ గ్రిడ్‌, అల్ట్రాటెక్‌ సెమ్‌ షేర్లు లాభపడ్డాయి. ఎస్బీఐ లైఫ్, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, ఏసియన్‌ పెయింట్స్‌, యూపీఎల్‌, టాటా కన్జూమర్‌  షేర్లు నష్టపోయాయి. పీఎస్‌యూ బ్యాంక్‌, కన్జూమర్‌ డ్యురబుల్స్‌ మినహా అన్ని రంగాల సూచీలు ఎరుపెక్కాయి. బ్యాంకు, ఫైనాన్స్‌, ఎఫ్ఎంసీజీ, మీడియా, ఫార్మా, హెల్త్‌కేర్‌ సూచీలు ఎక్కువ పతనం అయ్యాయి.

బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)

నేడు విలువైన లోహాల ధరలు తగ్గాయి. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.270 తగ్గి రూ.57,800 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి రూ.500 తగ్గి రూ.76200 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.630 పెరిగి రూ.24,300 వద్ద ఉంది.

Also Read: కస్టమర్లకు భారీ షాక్‌, FD రేట్లను అడ్డంగా కత్తిరించిన 5 బ్యాంకులు

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

Published at : 11 Aug 2023 04:03 PM (IST) Tags: Nse Nifty Share Market Nifty Bank BSE Sensex Stock Market update

ఇవి కూడా చూడండి

Investment Tips: నెలకు రూ.20 వేలతో మూడేళ్లలో రూ.12 లక్షలు - అద్భుతం చేసిన ELSS ఫండ్స్‌

Investment Tips: నెలకు రూ.20 వేలతో మూడేళ్లలో రూ.12 లక్షలు - అద్భుతం చేసిన ELSS ఫండ్స్‌

Investment For Children: ట్రెండ్‌ మారింది, చిల్డ్రన్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి పెట్టుబడుల వరద

Investment For Children: ట్రెండ్‌ మారింది, చిల్డ్రన్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి పెట్టుబడుల వరద

SIP: అంచనాలొద్దు, రియాలిటీ చూడండి - చాలా ప్రశ్నలకు ఇక్కడ సమాధానాలు లభిస్తాయ్‌

SIP: అంచనాలొద్దు, రియాలిటీ చూడండి - చాలా ప్రశ్నలకు ఇక్కడ సమాధానాలు లభిస్తాయ్‌

Mutual Funds: మోదీ 3.0 హయాంలో లాభపడే బెస్ట్‌ ఫండ్స్‌ - మీ ఇంట కనకవర్షం కురవొచ్చు!

Mutual Funds: మోదీ 3.0 హయాంలో లాభపడే బెస్ట్‌ ఫండ్స్‌ - మీ ఇంట కనకవర్షం కురవొచ్చు!

SIP Calculator: రూ.25,000 జీతం ఉన్నా రూ.15 కోట్లు కూడబెట్టొచ్చు - పక్కా లెక్క ఇదిగో!

SIP Calculator: రూ.25,000 జీతం ఉన్నా రూ.15 కోట్లు కూడబెట్టొచ్చు - పక్కా లెక్క ఇదిగో!

టాప్ స్టోరీస్

Erraballi Dayakar Rao: బీఆర్ఎస్‌తో అంటీముట్టనట్లుగా ఎర్రబెల్లి! సొంత పార్టీలోనే ఇబ్బందులా?

Erraballi Dayakar Rao: బీఆర్ఎస్‌తో అంటీముట్టనట్లుగా ఎర్రబెల్లి! సొంత పార్టీలోనే ఇబ్బందులా?

Double iSmart: 'డబుల్‌ ఇస్మార్ట్‌' సాంగ్‌లో కేసీఆర్ వాయిస్‌ వాడటంపై వివాదం - వివరణ ఇచ్చిన మ్యూజిక్‌ డైరెక్టర్ మణిశర్మ

Double iSmart: 'డబుల్‌ ఇస్మార్ట్‌' సాంగ్‌లో కేసీఆర్ వాయిస్‌ వాడటంపై వివాదం - వివరణ ఇచ్చిన మ్యూజిక్‌ డైరెక్టర్ మణిశర్మ

Paris Olympics 2024: చరిత్రలో నిలిచిపోయేలా, క్రీడా ప్రపంచం అబ్బురపడేలా

Paris Olympics 2024: చరిత్రలో నిలిచిపోయేలా, క్రీడా ప్రపంచం అబ్బురపడేలా

వయస్సును రివర్స్ చేయొచ్చు - నమ్మడం లేదా? తన ఏజ్‌ను 22 ఏళ్లకు తగ్గించుకున్న ఈ 78 ఏళ్ల డాక్టర్ సీక్రెట్ ఇదే

వయస్సును రివర్స్ చేయొచ్చు - నమ్మడం లేదా? తన ఏజ్‌ను 22 ఏళ్లకు తగ్గించుకున్న ఈ 78 ఏళ్ల డాక్టర్ సీక్రెట్ ఇదే