search
×

Stock Market News: ఇంకా ఒడుదొడుకుల్లోనే సూచీలు - భారీగా పడ్డ బంగారం, వెండి, ప్లాటినం ధరలు!

Stock Market Closing 10 February 2023: స్టాక్‌ మార్కెట్లు నేడు నష్టాల్లోనే ముగిశాయి. కేంద్ర బ్యాంకులు రెపోరేట్లు పెంచడం, యూఎస్‌ ఫెడ్‌ హాకిష్ కామెంట్స్‌ మదుపర్లలో నెగెటివ్‌ సెంటిమెంటుకు దారితీసింది.

FOLLOW US: 
Share:

Stock Market Closing 10 February 2023: 

స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం నష్టాల్లోనే ముగిశాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలే అందాయి. కేంద్ర బ్యాంకులు రెపోరేట్లు పెంచడం, యూఎస్‌ ఫెడ్‌ హాకిష్ కామెంట్స్‌ మదుపర్లలో నెగెటివ్‌ సెంటిమెంటుకు దారితీసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 36 పాయింట్ల నష్టంతో 17,856 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 123 పాయింట్ల నష్టంతో 60,682 వద్ద ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి ఒక పైసా బలపడి 82.51 వద్ద స్థిరపడింది. ఉదయం టాప్‌గెయినర్స్‌గా ఉన్న అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ సాయంత్రానికి టాప్‌ లాసర్ల జాబితాలో చేరింది.

BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)

క్రితం సెషన్లో 60,806 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 60,706 వద్ద మొదలైంది. 60,501 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 60,774 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 123 పాయింట్ల నష్టంతో 60,682 వద్ద ముగిసింది.

NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)

గురువారం 17,893 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ శుక్రవారం 17,847 వద్ద ఓపెనైంది. 17,801 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 17,876 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 36 పాయింట్ల నష్టంతో 17,856 వద్ద క్లోజైంది.

Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)

నిఫ్టీ బ్యాంక్‌ స్వల్ప లాభాల్లో ముగిసింది. ఉదయం 41,452 వద్ద మొదలైంది. 41,424 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 41,678 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 5 పాయింట్లు పెరిగి 41,559 వద్ద స్థిరపడింది.

Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)

నిఫ్టీ 50లో 23 కంపెనీలు లాభాల్లో 27 నష్టపోయాయి. టాటా మోటార్స్‌, యూపీఎల్‌, సిప్లా, హీరోమోటో, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ షేర్లు లాభపడ్డాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, హిందాల్కో, టాటా స్టీల్‌, కోల్‌ ఇండియా షేర్లు నష్టపోయాయి. ఆటో, మీడియా, ఫార్మా, పీఎస్‌యూ బ్యాంక్‌, రియాల్టీ, కన్జూమర్‌ డ్యురబుల్స్‌ సూచీలు ఎగిశాయి. ఎఫ్‌ఎంసీజీ, ఐటీ, మెటల్‌, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ సూచీలు ఎరుపెక్కాయి.

బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)

నేడు విలువైన లోహాల ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాములు రూ.550 తగ్గి రూ.57,160గా ఉంది. కిలో వెండి రూ.550 తగ్గి రూ.71,800 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.700 తగ్గి రూ.25,180 వద్ద ఉంది.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

Published at : 10 Feb 2023 04:01 PM (IST) Tags: Stock Market Update stock market today Share Market Stock Market news

ఇవి కూడా చూడండి

Trisha: త్రిష ఇంట విషాదం... క్రిస్మస్ రోజు కుమారుడిని కోల్పోయానంటూ హీరోయిన్ ఎమోషనల్

Trisha: త్రిష ఇంట విషాదం... క్రిస్మస్ రోజు కుమారుడిని కోల్పోయానంటూ హీరోయిన్ ఎమోషనల్

Year Ender 2024: 2024లో పెట్టుబడిదార్లను ధనవంతులుగా మార్చిన టాప్‌-10 మ్యూచువల్ ఫండ్స్‌

Year Ender 2024: 2024లో పెట్టుబడిదార్లను ధనవంతులుగా మార్చిన టాప్‌-10 మ్యూచువల్ ఫండ్స్‌

New Mutual Fund: 'స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్‌' - అధిక లాభాలు కోరుకునే హైరిస్క్‌ ఇన్వెస్టర్లకు బెస్ట్‌ ఆప్షన్‌!

New Mutual Fund: 'స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్‌' - అధిక లాభాలు కోరుకునే హైరిస్క్‌ ఇన్వెస్టర్లకు బెస్ట్‌ ఆప్షన్‌!

SIP Strategies: మ్యూచువల్‌ ఫండ్స్‌ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు

SIP Strategies: మ్యూచువల్‌ ఫండ్స్‌ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు

Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే"కింగ్‌" ఎంట్రీ - జియోకి గ్రీన్‌ సిగ్నల్‌

Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే

టాప్ స్టోరీస్

Revanth Reddy on Benefit Shows: బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి

Revanth Reddy on Benefit Shows: బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి

Pushpa 2 Collection: మూడు వారాలకే ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌‌కు సరికొత్త ఫిగర్‌ని పరిచయం చేసిన పుష్పరాజ్.. ఇదీ పుష్పగాడి రేంజ్

Pushpa 2 Collection: మూడు వారాలకే ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌‌కు సరికొత్త ఫిగర్‌ని పరిచయం చేసిన పుష్పరాజ్.. ఇదీ పుష్పగాడి రేంజ్

Bhikkanur SI Suicide: ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?

Bhikkanur SI Suicide: ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?

Roja Comments: చిత్తూరు జిల్లా అధ్యక్షుడి మార్పుతో రోజాలో నూతనోత్సాహం- అందరికీ వడ్డితో తిరిగి ఇచ్చేస్తామని కామెంట్

Roja Comments: చిత్తూరు జిల్లా అధ్యక్షుడి మార్పుతో రోజాలో నూతనోత్సాహం- అందరికీ వడ్డితో తిరిగి ఇచ్చేస్తామని కామెంట్