search
×

Sensex Today: ఇన్‌ఫ్లేషన్‌ డేటా దెబ్బకు బ్యాంకు షేర్లు విలవిల - 19,550 కిందే నిఫ్లీ క్లోజింగ్‌

Stock Market Closing 10 August 2023: స్టాక్‌ మార్కెట్లు గురువారం నష్టాల్లో ముగిశాయి. ఆర్బీఐ సమావేశం నేపథ్యంలో సూచీలు ఉదయం నుంచీ ఊగిసలాడాయి.

FOLLOW US: 
Share:

Stock Market Closing 10 August 2023:

స్టాక్‌ మార్కెట్లు గురువారం నష్టాల్లో ముగిశాయి. ఆర్బీఐ సమావేశం నేపథ్యంలో సూచీలు ఉదయం నుంచీ ఊగిసలాడాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్లూ ప్రతికూల సంకేతాలు పంపడం నెగెటివ్‌ సెంటిమెంటుకు దారితీసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 89 పాయింట్లు తగ్గి 19,543 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 307 పాయింట్లు తగ్గి 65,688 వద్ద ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 13 పైసలు బలపడి 82.71 వద్ద స్థిరపడింది.

BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)

క్రితం సెషన్లో 65,995 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 65,945 వద్ద మొదలైంది. 65,509 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 65,956 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 307 పాయింట్ల నష్టంతో 65,688 వద్ద ముగిసింది.

NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)

బుధవారం 19,632 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ గురువారం 19,605 వద్ద ఓపెనైంది. 19,495 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 19,623 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 89 పాయింట్లు తగ్గి 19,543 వద్ద క్లోజైంది.

Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)

నిఫ్టీ బ్యాంక్‌ నష్టపోయింది. ఉదయం 44,l797 వద్ద మొదలైంది. 44,418 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 44,980 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. సాయంత్రం 338 పాయింట్లు తగ్గి 44,541 వద్ద క్లోజైంది.

Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)

నిఫ్టీ 50లో 18 కంపెనీలు లాభాల్లో 32 నష్టాల్లో ఉన్నాయి. అదానీ పోర్ట్స్‌, అదానీ ఎంటర్‌టైన్‌మెంట్‌, ఇండస్‌ ఇండ్ బ్యాంక్‌, టైటాన్‌, ఓఎన్‌జీసీ షేర్లు లాభపడ్డాయి. ఏసియన్‌ పెయింట్స్‌, కొటక్‌ బ్యాంక్‌, బ్రిటానియా, ఐటీసీ, నెస్లే ఇండియా షేర్లు నష్టపోయాయి. మీడియా, మెటల్‌, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ మినహా అన్ని రంగా సూచీలు పతనమయ్యాయి. బ్యాంకు, ఫైనాన్స్‌, ఎఫ్‌ఎంసీజీ, ఫార్మా, పీఎస్‌యూ బ్యాంక్‌, హెల్త్‌కేర్‌ సూచీలు ఎక్కువ ఎరుపెక్కాయి.

బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)

నేడు విలువైన లోహాల ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.280 తగ్గి రూ.59,670 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి రూ.5000 తగ్గి రూ.73000 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.350 తగ్గి రూ.23,670 వద్ద ఉంది.

Also Read: 

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

Published at : 10 Aug 2023 03:50 PM (IST) Tags: Nse Nifty Share Market Nifty Bank BSE Sensex Stock Market update

ఇవి కూడా చూడండి

Money Earning Tips: ఇలా SIP చేస్తే కోటీశ్వరులు అవుతారు.. రూ.2000తో మొదలుపెట్టి ఇలా ఇన్వెస్ట్ చేయాలి

Money Earning Tips: ఇలా SIP చేస్తే కోటీశ్వరులు అవుతారు.. రూ.2000తో మొదలుపెట్టి ఇలా ఇన్వెస్ట్ చేయాలి

Passive Income: SIPs నుంచి REITs దాకా పాసివ్‌ ఆదాయం ఎలా సంపాదించాలో తెలుసుకోండి

Passive Income: SIPs నుంచి REITs దాకా పాసివ్‌ ఆదాయం ఎలా సంపాదించాలో తెలుసుకోండి

SIP Investment Mistakes: SIPలో లక్షల నష్టానికి కారణమయ్యే 7 అతిపెద్ద తప్పులు! 

SIP Investment Mistakes: SIPలో లక్షల నష్టానికి కారణమయ్యే 7 అతిపెద్ద తప్పులు! 

Long Term Investing : స్టాక్స్​లో​ లక్ష పెట్టిన తండ్రి.. 80 కోట్లు జాక్​ పాట్ కొట్టిన కొడుకు, రియల్ లైఫ్ లక్కీ భాస్కర్!

Long Term Investing : స్టాక్స్​లో​ లక్ష పెట్టిన తండ్రి.. 80 కోట్లు జాక్​ పాట్ కొట్టిన కొడుకు, రియల్ లైఫ్ లక్కీ భాస్కర్!

Mutual Funds: మిమ్మల్ని కోటీశ్వరులను చేసే మ్యూచువల్ ఫండ్స్‌ ఇవే!

Mutual Funds: మిమ్మల్ని కోటీశ్వరులను చేసే మ్యూచువల్ ఫండ్స్‌ ఇవే!

టాప్ స్టోరీస్

Hyderabad News: హైదరాబాద్‌లో పెళ్లి వాయిదా పడిందని ఏషియన్ పెయింట్స్‌కు జరిమానా!

Hyderabad News: హైదరాబాద్‌లో పెళ్లి వాయిదా పడిందని ఏషియన్ పెయింట్స్‌కు జరిమానా!

Kondagattu Temple: కనీస సౌకర్యాల్లేవ్ ఇవ్వలేరు కానీ రేట్లు పెంచేస్తారా? కొండగట్టు దేవస్థానంలో ఆర్జిత సేవా రుసుం పెంపుపై బండి సంజయ్‌ ఆగ్రహం  

Kondagattu Temple: కనీస సౌకర్యాల్లేవ్ ఇవ్వలేరు కానీ రేట్లు పెంచేస్తారా? కొండగట్టు దేవస్థానంలో ఆర్జిత సేవా రుసుం పెంపుపై బండి సంజయ్‌ ఆగ్రహం  

Delhi Bomb Blast : ఢిల్లీ బాంబు పేలుడు కేసులో రెడ్‌కారు డ్రైవర్ అరెస్టు- ప్రత్యేక కోడ్ నేమ్‌లతో సిరియల్ పేలుళ్లకు ఉగ్రవాదుల పథకం!

Delhi Bomb Blast : ఢిల్లీ బాంబు పేలుడు కేసులో రెడ్‌కారు డ్రైవర్ అరెస్టు- ప్రత్యేక కోడ్ నేమ్‌లతో సిరియల్ పేలుళ్లకు ఉగ్రవాదుల పథకం!

Official Apology : క్షమాపణలు చెబుతున్న కొండ సురేఖ సహా వీఐపీలు, వ్యాపార సంస్థలు; ఈ సారీ చెప్పే ట్రెండ్‌ ఎలా మొదలైంది? 

Official Apology : క్షమాపణలు చెబుతున్న కొండ సురేఖ సహా వీఐపీలు, వ్యాపార సంస్థలు; ఈ సారీ చెప్పే ట్రెండ్‌ ఎలా మొదలైంది?