Stock Market Closing 07 February 2023:
స్టాక్ మార్కెట్లు మంగళవారం స్వల నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందాయి. ఉదయం ఫ్లాట్‌గా మొదలైన సూచీలు మధ్యాహ్నం ఇంట్రాడే కనిష్ఠాలకు చేరుకున్నాయి. ఐరోపా మార్కెట్లు తెరిచాక మళ్లీ పుంజుకున్నాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 43 పాయింట్ల నష్టంతో 17,721 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 220 పాయింట్ల నష్టంతో 60,286 వద్ద ముగిశాయి. గడువు తీరకున్నా ముందుగానే రుణాలు చెల్లిస్తామని ప్రకటించడంతో అదానీ గ్రూప్ షేర్లు పరుగులు పెట్టాయి.
BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)
క్రితం సెషన్లో 60,506 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 60,511 వద్ద మొదలైంది. 60,063 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 60,655 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 220 పాయింట్ల నష్టంతో 60,286 వద్ద ముగిసింది.
NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)
సోమవారం 17,764 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ మంగళవారం 17,790 వద్ద ఓపెనైంది. 17,652 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 17,811 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 43 పాయింట్ల నష్టంతో 17,721 వద్ద క్లోజైంది.
Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)
నిఫ్టీ బ్యాంక్ స్వల్ప లాభాల్లో ముగిసింది. ఉదయం 41,513 వద్ద మొదలైంది. 41,095 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 41,630 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఆఖరికి 116 పాయింట్లు పెరిగి 41,490 వద్ద స్థిరపడింది.
Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)
నిఫ్టీ 50లో 19 కంపెనీలు లాభాల్లో 31 నష్టాల్లో ముగిశాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ పోర్ట్స్, డాక్టర్ రెడ్డీస్, ఇండస్ ఇండ్ బ్యాంక్, కొటక్ బ్యాంకు షేర్లు లాభపడ్డాయి. టాటా స్టీల్, హిందాల్కో, ఐటీసీ, హీరో మోటో, మారుతీ షేర్లు నష్టపోయాయి. బ్యాంకు, ఫైనాన్స్, ప్రైవేటు బ్యాంకు, రియాల్టీ సూచీలు స్వల్పంగా ఎగిశాయి. ఆటో, ఎఫ్‌ఎంసీజీ, ఐటీ, మీడియా, మెటల్ సూచీలు ఎరుపెక్కాయి.
Also Read: డీఏ 4 శాతం పెంచితే నెల జీతం ఎంత పెరుగుతుందో తెలుసా!
Also Read: ఫోన్‌పే వాడుతున్నారా! ఇకపై ఫారిన్లో యూపీఐతో డబ్బులు చెల్లించొచ్చు తెలుసా!
Also Read: పేటీఎం సర్‌ప్రైజ్! 20 శాతం దూసుకెళ్లిన షేరు ధర.. ఇవే రీజన్స్!
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.