Stock Market Opening 07 February 2023: 


స్టాక్‌ మార్కెట్లు మంగళవారం ఫ్లాట్‌గా మొదలయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ఒడుదొడుకులు కనిపిస్తున్నాయి. బ్యాంకు మినహా అన్ని రంగాల షేర్లపై అమ్మకాల ఒత్తిడి ఉంది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 21 పాయింట్ల నష్టంతో 17,743 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 113 పాయింట్ల నష్టంతో 60,393 వద్ద ఉన్నాయి. అదానీ గ్రూప్‌ షేర్లు తిరిగి పుంజుకుంటున్నాయి.


BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)


క్రితం సెషన్లో 60,506 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 60,511 వద్ద మొదలైంది. 60,374 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 60,655 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 10 గంటలకు 113 పాయింట్ల నష్టంతో 60,393 వద్ద కొనసాగుతోంది.


NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)


సోమవారం 17,764 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ మంగళవారం 17,790 వద్ద ఓపెనైంది. 17,730 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 17,811 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 21 పాయింట్ల నష్టంతో 17,743 వద్ద ట్రేడవుతోంది.


Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)


నిఫ్టీ బ్యాంక్‌ స్వల్ప లాభాల్లో ఉంది. ఉదయం 41,513 వద్ద మొదలైంది. 41,371 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 41,558 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 36 పాయింట్లు పెరిగి 41,410 వద్ద కొనసాగుతోంది.


Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)


నిఫ్టీ 50లో 18 కంపెనీలు లాభాల్లో 31 నష్టాల్లో ఉన్నాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, అదానీ పోర్ట్స్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ లాభపడ్డాయి. టాటా స్టీల్‌, హిందాల్కో, ఐటీసీ, హీరో మోటో, టాటా మోటార్స్‌ నష్టపోయాయి. బ్యాంకు, పీఎస్‌యూ బ్యాంకు, ప్రైవేటు బ్యాంకు, రియాల్టీ సూచీలు స్వల్పంగా ఎగిశాయి. మిగతావన్నీ ఎరుపెక్కాయి.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.