Stock Market Closing 06 February 2023: 


స్టాక్‌ మార్కెట్లు సోమవారం నష్టాల్లోనే ముగిశాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందాయి. ఉదయం నుంచీ బెంచ్‌మార్క్‌ సూచీలు ఊగిసలాడాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 89 పాయింట్ల నష్టంతో 17,764 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 334 పాయింట్ల నష్టంతో 60,406 వద్ద ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి పది పైసలు బలపడి రూ.91.73 వద్ద స్థిరపడింది. అదానీ ట్రాన్స్‌మిషన్‌ మెరుగైన ఫలితాలు విడుదల చేసింది. అదానీ పోర్ట్స్‌ షేరు ఏకంగా 9 శాతం పెరిగింది.


BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)


క్రితం సెషన్లో 60,841 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 60,847 వద్ద మొదలైంది. 60,345 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 60,847 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 334 పాయింట్ల నష్టంతో 60,506 వద్ద ముగిసింది.


NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)


శుక్రవారం 17,854 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ సోమవారం 17,818 వద్ద ఓపెనైంది. 17,698 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 17,823 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 89 పాయింట్ల నష్టంతో 17,764 వద్ద క్లోజైంది.


Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)


నిఫ్టీ బ్యాంక్‌ నష్టపోయింది. ఉదయం 41,530 వద్ద మొదలైంది. 41,261 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 41,724 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఆఖరికి 125 పాయింట్లు తగ్గి 41,374 వద్ద స్థిరపడింది.


Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)


నిఫ్టీ 50లో 16 కంపెనీలు లాభాల్లో 34 నష్టపోయాయి. అదానీ పోర్ట్స్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, బీపీసీఎల్‌, అపోలో హాస్పిటల్స్‌, హీరోమోటొకార్ప్‌ షేర్లు లాభపడ్డాయి. దివిస్‌ ల్యాబ్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, హిందాల్కో, టాటా స్టీల్‌, ఇన్ఫీ షేర్లు నష్టపోయాయి. బ్యాంకు, ఆటో, ఫైనాన్స్‌, ఐటీ, మెటల్‌, ప్రైవేటు బ్యాంకు, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ సూచీలు పతనమయ్యాయి. ఎఫ్ఎంసీజీ, మీడియా, పీఎస్‌యూ బ్యాంక్‌, రియాల్టీ, హెల్త్‌కేర్‌, కన్జూమర్‌ డ్యురబుల్స్‌ సూచీలు ఎగిశాయి.


Also Read: ఆ అప్పులు తీర్చడంపై 'అదానీ' షాకింగ్‌ నిర్ణయం!


Also Read: తనలా మరొకరు బాధ పడకూడదన్న మస్క్‌, ఆ మూడు నెలలు చాలా కఠినంగా గడిచాయట!


Also Read: గుడ్‌న్యూస్‌ చెప్పిన PWC - 30వేల ఉద్యోగాలు ఇస్తారట!


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.