By: ABP Desam | Updated at : 06 Mar 2023 03:50 PM (IST)
Edited By: Ramakrishna Paladi
స్టాక్ మార్కెట్ అప్డేట్ ( Image Source : Pexels )
Stock Market Closing 06 March 2023:
స్టాక్ మార్కెట్లు సోమవారం భారీగా లాభపడ్డాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందాయి. అదానీ షేర్ల దూకుడు మదుపర్లలో ఉత్సాహం నింపింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 117 పాయింట్లు పెరిగి 17,711 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 415 పాయింట్లు ఎగిసి 60,224 వద్ద ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 5 పైసలు బలపడి 81.92 వద్ద స్థిరపడింది.
BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)
క్రితం సెషన్లో 59,808 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 60,007 వద్ద మొదలైంది. 60,005 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 60,498 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 415 పాయింట్ల లాభంతో 60,224 వద్ద ముగిసింది.
NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)
శుక్రవారం 17,594 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ సోమవారం 17,680 వద్ద ఓపెనైంది. 17,671 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 17,799 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఆఖరికి 117 పాయింట్లు పెరిగి 17,711 వద్ద క్లోజైంది.
Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)
నిఫ్టీ బ్యాంక్ లాభపడింది. ఉదయం 41,418 వద్ద మొదలైంది. 41,259 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 41,671 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 91 పాయింట్లు పెరిగి 41,350 వద్ద స్థిరపడింది.
Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)
నిఫ్టీ 50లో 39 కంపెనీలు లాభాల్లో 10 నష్టాల్లో ముగిశాయి. అదానీ ఎంటర్ ప్రైజెస్, టాటా మోటార్స్, ఓఎన్‌జీసీ, ఎన్‌టీపీసీ, పవర్ గ్రిడ్ షేర్లు లాభపడ్డాయి. బ్రిటానియా, టాటా స్టీల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, హిందాల్కో, ఎల్‌టీ షేర్లు నష్టపోయాయి. పీఎస్‌యూ బ్యాంకు, రియాల్టీ మినహా అన్ని రంగాల సూచీలు ఎగిశాయి. ఆటో, ఐటీ, కన్జూమర్ డ్యురబుల్స్, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు ఎక్కువ లాభపడ్డాయి.
బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)
నేడు విలువైన లోహాల ధరలు స్తబ్దుగా ఉన్నాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.56,550 గా ఉంది. కిలో వెండి రూ.100 పెరిగి రూ.67,000 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.30 తగ్గి రూ.25,680 వద్ద ఉంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
On this Holika Dahan, may you be blessed with good health, peace, joy, wealth and prosperity. Happy Holika Dahan to everyone!#HolikaDahan #Holi #IndianFestivals #NSEIndia @ashishchauhan pic.twitter.com/AQhv0m3qh5
— NSE India (@NSEIndia) March 6, 2023
Congratulations to Pondy Oxides and Chemicals Limited on getting #listed on #NSE today. #Listing #PondyOxidesandChemicalsLimited #POCL @ashishchauhan pic.twitter.com/J3pJY3c7Ny
— NSE India (@NSEIndia) March 6, 2023
Trisha: త్రిష ఇంట విషాదం... క్రిస్మస్ రోజు కుమారుడిని కోల్పోయానంటూ హీరోయిన్ ఎమోషనల్
Year Ender 2024: 2024లో పెట్టుబడిదార్లను ధనవంతులుగా మార్చిన టాప్-10 మ్యూచువల్ ఫండ్స్
New Mutual Fund: 'స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్' - అధిక లాభాలు కోరుకునే హైరిస్క్ ఇన్వెస్టర్లకు బెస్ట్ ఆప్షన్!
SIP Strategies: మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు
Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే"కింగ్" ఎంట్రీ - జియోకి గ్రీన్ సిగ్నల్
Aramghar -Zoopark Flyover: ఆరాంఘర్ - జూపార్క్ పైవంతెనను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి - నగరంలోనే రెండో పెద్ద ఫ్లైఓవర్, ప్రత్యేకతలివే!
Sankrantiki Vastunnam Trailer: భార్యకి, మాజీ ప్రేయసికి మధ్యలో ఇరుక్కున్న మాజీ పోలీసు - ‘సంక్రాంతికి వస్తున్నాం’ ట్రైలర్ వచ్చేసింది!
Voters List: సవరించిన ఓటర్ల జాబితా రిలీజ్ చేసిన ఎన్నికల సంఘం - తెలుగు రాష్ట్రాల్లో ఓటర్లు ఎంతమందంటే?
Chhattisgarh Blast: ఆర్మీ వాహనాన్ని పేల్చివేసిన మావోయిస్టులు, 9 మంది జవాన్లు మృతి: బస్తర్ ఐజీ