search
×

Stock Market Today: మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ సూపర్‌ హిట్‌! 19,500 మీదే నిఫ్టీ ముగింపు

Stock Market Closing, 04 September 2023: స్టాక్‌ మార్కెట్లు మళ్లీ వృద్ధిబాట పట్టాయి. స్మాల్‌ క్యాప్‌, మిడ్‌ క్యాప్‌ సూచీలు జీవిత కాల గరిష్ఠ స్థాయిలను చేరాయి.

FOLLOW US: 
Share:

Stock Market Closing, 04 September 2023: 

స్టాక్‌ మార్కెట్లు మళ్లీ వృద్ధిబాట పట్టాయి. సోమవారం లాభాల్లో ముగిశాయి. ఆసియా, గ్లోబల్‌ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందాయి. చైనా ఉద్దీపన ప్యాకేజీ ఫలితాలను ఇస్తోంది. ఇక స్మాల్‌ క్యాప్‌, మిడ్‌ క్యాప్‌ సూచీలు జీవిత కాల గరిష్ఠ స్థాయిలను చేరాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 93 పాయింట్లు పెరిగి 19,528 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 240 పాయింట్లు పెరిగి 65,628 వద్ద ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 3 పైసలు బలహీనపడి 82.75 వద్ద స్థిరపడింది.

BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)

క్రితం సెషన్లో 65,387 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 65,525 వద్ద మొదలైంది. 65,285 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 65,683 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 240 పాయింట్ల లాభంతో 65,628 వద్ద ముగిసింది.

NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)

శుక్రవారం 19,435 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ సోమవారం 19,525 వద్ద ఓపెనైంది. 19,432 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 19,545 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 93 పాయింట్లు పెరిగి 19,528 వద్ద క్లోజైంది.

Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)

నిఫ్టీ బ్యాంక్‌ లాభపడింది.  ఉదయం 44,647 వద్ద మొదలైంది. 44,310 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 44,656 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. సాయంత్రం 142 పాయింట్లు పెరిగి 44,578 వద్ద ముగిసింది.

Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)

నిఫ్టీ 50లో 32 కంపెనీలు లాభాల్లో 19 నష్టాల్లో ఉన్నాయి. కోల్‌ ఇండియా, విప్రో, అల్ట్రాటెక్‌ సెమ్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, జియో ఫైనాన్స్ షేర్లు లాభపడ్డాయి. ఎం అండ్‌ ఎం, నెస్లే ఇండియా, ఐటీసీ, యాక్సిస్‌ బ్యాంకు, బజాజ్‌ ఫైనాన్స్‌ షేర్లు నష్టపోయాయి. ఎఫ్‌ఎంసీజీ, కన్జూమర్‌ డ్యురబుల్స్‌ మినహా అన్ని సూచీలు పెరిగాయి. ఐటీ, మీడియా, మెటల్‌, పీఎస్‌యూ బ్యాంక్‌, రియాల్టీ రంగాల సూచీలు 1-2.5 శాతం మేర ఎగిశాయి.

బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)

నేడు విలువైన లోహాల ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.100 పెరిగి రూ.60,320 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి రూ.76,900 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.50 పెరిగి రూ.25,600 వద్ద ఉంది.

Also Read: ఉద్యోగం పోయినా.. కంపెనీ ఇన్సూరెన్స్‌ పొందడం ఎలా?

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

Published at : 04 Sep 2023 04:02 PM (IST) Tags: Nse Nifty Share Market Nifty Bank Stock Market news BSE Sensex Stock Market update

ఇవి కూడా చూడండి

Stock Market Today: కొనసాగిన అమ్మకాలు! 19,450 కిందకు నిఫ్టీ - సెన్సెక్స్‌ 286 డౌన్‌

Stock Market Today: కొనసాగిన అమ్మకాలు! 19,450 కిందకు నిఫ్టీ - సెన్సెక్స్‌ 286 డౌన్‌

Stock Market Today: బ్యాంకు, ఫైనాన్స్‌ షేర్ల పతనం - భారీ నష్టాల్లో సెన్సెక్స్‌, నిఫ్టీ

Stock Market Today: బ్యాంకు, ఫైనాన్స్‌ షేర్ల పతనం - భారీ నష్టాల్లో సెన్సెక్స్‌, నిఫ్టీ

Stock Market Today: కొనసాగిన నష్టాలు! 19,550 కిందకు నిఫ్టీ!

Stock Market Today: కొనసాగిన నష్టాలు! 19,550 కిందకు నిఫ్టీ!

Stock Market Today: నెగెటివ్‌ సెంటిమెంటు నింపిన ముడి చమురు! నష్టాల్లో సెన్సెక్స్‌, నిఫ్టీ!

Stock Market Today: నెగెటివ్‌ సెంటిమెంటు నింపిన ముడి చమురు! నష్టాల్లో సెన్సెక్స్‌, నిఫ్టీ!

Stock Market Today: సెన్సెక్స్‌, నిఫ్టీ రికవరీ! కొంతైన పూడిన నిన్నటి నష్టాలు

Stock Market Today: సెన్సెక్స్‌, నిఫ్టీ రికవరీ! కొంతైన పూడిన నిన్నటి నష్టాలు

టాప్ స్టోరీస్

Talasani Srinivas : చంద్రబాబు అరెస్టు బాధాకరం - వైసీపీవి కక్ష సాధింపులు - మంత్రి తలసాని కీలక వ్యాఖ్యలు

Talasani Srinivas :  చంద్రబాబు అరెస్టు బాధాకరం - వైసీపీవి కక్ష సాధింపులు -  మంత్రి తలసాని కీలక వ్యాఖ్యలు

మనీ లాండరింగ్ కేసులో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ అరెస్ట్ చేసిన ఈడీ

మనీ లాండరింగ్ కేసులో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ అరెస్ట్ చేసిన ఈడీ

Nobel Prize 2023 in Chemistry: రసాయన శాస్త్రంలో ముగ్గురు అమెరికా శాస్త్రవేత్తలకు నోబెల్ పురస్కారం

Nobel Prize 2023 in Chemistry: రసాయన శాస్త్రంలో ముగ్గురు అమెరికా శాస్త్రవేత్తలకు నోబెల్ పురస్కారం

APSRTC News: దసరాకు ఏపీఎస్ఆర్టీసీ 5,500 స్పెషల్‌ సర్వీసులు - ఈ నగరాల నుంచే

APSRTC News: దసరాకు ఏపీఎస్ఆర్టీసీ 5,500 స్పెషల్‌ సర్వీసులు - ఈ నగరాల నుంచే