By: ABP Desam | Updated at : 03 Oct 2023 03:48 PM (IST)
స్టాక్ మార్కెట్ అప్డేట్ ( Image Source : Pexels )
Stock Market Closing 03 October 2023:
భారత స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాల్లో ముగిశాయి. క్రూడాయిల్ ధరలు పెరగడం, ఐరోపా మార్కెట్లు పతనమవ్వడం ఇన్వెస్టర్లలో నెగెటివ్ సెంటిమెంటుకు దారితీసింది. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ట్రేడయ్యాయి. ఆటో, ఆయిల్, ఫార్మా రంగాలు సెల్లింగ్ ప్రెజర్ ఎదుర్కొన్నాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 109 పాయింట్లు తగ్గి 19,528 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 316 పాయింట్లు తగ్గి 65,512 వద్ద ముగిశాయి.
BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)
క్రితం సెషన్లో 65,828 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 65,813 వద్ద మొదలైంది. 65,344 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 65,813 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 316 పాయింట్లు తగ్గి 65,512 వద్ద ముగిసింది.
NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)
శుక్రవారం 19,638 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ మంగళవారం 19,622 వద్ద ఓపెనైంది. 19,479 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 19,623 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 109 పాయింట్లు తగ్గి 19,528 వద్ద క్లోజైంది.
Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)
నిఫ్టీ బ్యాంక్ తగ్గింది. ఉదయం 44,561 వద్ద మొదలైంది. 44,243 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 44,566 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. సాయంత్రం 185 పాయింట్ల నష్టంతో 44,399 వద్ద ముగిసింది.
Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)
నిఫ్టీ 50లో 13 కంపెనీలు లాభాల్లో 37 నష్టాల్లో ఉన్నాయి. బజాజ్ ఫైనాన్స్ (2.00%), ఎల్‌టీ (1.67%), టైటాన్ (1.34%), బజాజ్ ఫిన్‌సర్వ్ (1.33%), అదానీ పోర్ట్స్ (0.79%) షేర్లు లాభపడ్డాయి. ఓఎన్‌జీసీ (3.78%), ఐచర్ మోటార్స్ (2.68%), మారుతీ (2.67%), హిందాల్కో (2.50%), డాక్టర్ రెడ్డీస్ (2.31%) షేర్లు నష్టపోయాయి. మీడియా, పీఎస్‌యూ బ్యాంక్, రియాల్టీ, కన్జూమర్ డ్యురబుల్స్ సూచీలు పెరిగాయి. ఆటో, ఎఫ్‌ఎంసీజీ, మెటల్, ఫార్మా, ప్రైవేటు బ్యాంకు, హెల్త్‌కేర్ సూచీలు తగ్గాయి.
బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)
నేడు విలువైన లోహాల ధరలు తగ్గుముఖం పట్టాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.660 తగ్గి రూ.57,380 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి రూ.2000 తగ్గి రూ.71,000 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.1130 తగ్గి రూ.23,200 వద్ద ఉంది.
క్రితం సెషన్లో ఏం జరిగిందంటే?
భారత స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాల్లో ముగిశాయి. గురువారం నాటి నష్టాలను కొంత పూడ్చాయి. క్రూడాయిల్ ఫ్యూచర్స్ తగ్గడం ఇన్వెస్టర్లలో సానుకూల సెంటిమెంటుకు దారితీసింది. పైగా పెరిగిన ముడి చమురు ధరల ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థపై తక్కువగానే ఉంటుందని నిపుణులు చెప్పడం ఊరటనిచ్చింది. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి పాజిటివ్ సిగ్నల్స్ అందాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 114 పాయింట్లు పెరిగి 19,638 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 320 పాయింట్లు ఎగిసి 65,828 వద్ద ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 15 పైసలు బలపడి 83.04 వద్ద స్థిరపడింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
SIP Strategies: మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు
Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే"కింగ్" ఎంట్రీ - జియోకి గ్రీన్ సిగ్నల్
Mutual Funds: మీ డబ్బును వేగంగా రెట్టింపు చేసే 5 ఫండ్స్, 15-20 ఏళ్లు ఎదురు చూడాల్సిన అవసరం లేదు
Investment Tips: నెలకు రూ.20 వేలతో మూడేళ్లలో రూ.12 లక్షలు - అద్భుతం చేసిన ELSS ఫండ్స్
Investment For Children: ట్రెండ్ మారింది, చిల్డ్రన్ మ్యూచువల్ ఫండ్స్‌లోకి పెట్టుబడుల వరద
Andhra News: ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
Devi Sri Prasad: ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
Jio New Plan: ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
Group 3 Exams: భార్యకు పరీక్ష, భర్తకు బాధ్యత - గ్రూప్ 3 పరీక్షా కేంద్రాల వద్ద వైరల్ 'సిత్రాలు'
This website uses cookies or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy