By: Rama Krishna Paladi | Updated at : 03 Aug 2023 04:08 PM (IST)
స్టాక్ మార్కెట్ అప్డేట్ ( Image Source : Pexels )
Stock Market Closing 03 August 2023:
స్టాక్ మార్కెట్లు గురువారం మళ్లీ విలవిల్లాడాయి. అమెరికా క్రెడిట్ రేటింగ్‌ను ఫిచ్ తగ్గించడం మార్కెట్లను ఇంకా వెంటాడుతోంది. ఆసియా, ఐరోపా నుంచి ప్రతికూల సంకేతాలే అందుతున్నాయి. బెంచ్ మార్క్ సూచీలు కీలక సపోర్ట్ లెవల్స్‌ను బ్రేక్ చేయడంతో మదుపర్లు ఎకాఎకిన అమ్మకాలు మొదలు పెట్టారు. వీరికి ఎఫ్ఐఐలు తోడయ్యారు. మొత్తంగా ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 144 పాయింట్లు తగ్గి 19,381 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 542 పాయింట్లు తగ్గి 65,240 వద్ద ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 82.76 వద్ద స్థిరపడింది.
BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)
క్రితం సెషన్లో 65,782 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 65,550 వద్ద మొదలైంది. 64,963 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 65,820 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 542 పాయింట్ల నష్టంతో 65,240 వద్ద ముగిసింది.
NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)
బుధవారం 19,526 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ గురువారం 19,463 వద్ద ఓపెనైంది. 19,296 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 19,537 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 144 పాయింట్లు తగ్గి 19,381 వద్ద క్లోజైంది.
Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)
నిఫ్టీ బ్యాంక్ నష్టపోయింది. ఉదయం 44,862 వద్ద మొదలైంది. 44,279 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 45,038 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. సాయంత్రం 482 పాయింట్లు తగ్గి 44,513 వద్ద ముగిసింది.
Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)
నిఫ్టీ 50లో 11 కంపెనీలు లాభాల్లో 39 నష్టాల్లో ఉన్నాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ పోర్ట్స్, ఐచర్ మోటార్స్, దివిస్ ల్యాబ్, హిందాల్కో షేర్లు లాభపడ్డాయి. టైటాన్, ఓఎన్‌జీసీ, బజాజ్ ఫిన్‌సర్వ్, ఐసీఐసీఐ బ్యాంక్, నెస్లే ఇండియా నష్టపోయాయి. మీడియా, ఫార్మా, హెల్త్‌కేర్ సూచీలు పెరిగాయి. బ్యాంకు, ఫైనాన్స్, ఎఫ్‌ఎంసీజీ, పీఎస్‌యూ బ్యాంక్, ప్రైవేటు బ్యాంకు, రియాల్టీ, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు ఎరుపెక్కాయి.
బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)
నేడు విలువైన లోహాల ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.160 తగ్గి రూ.59,950 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి రూ.2300 తగ్గి రూ.75000 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.130 తగ్గి రూ.24,420 వద్ద కొనసాగుతోంది.
Also Read: మీకు రూ.15,490 రీఫండ్ వస్తోంది! ఆ మెసేజ్ అస్సలు తెరవొద్దని ఐటీ శాఖ వార్నింగ్!
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
In collaboration with Government of Odisha, we are inviting MSME CXO and Director level executives for an interactive and informative workshop on "SME IPO - Promising Avenue of Fund Raising for SMEs" on Aug 10, at 10:30AM. Register now - https://t.co/mxL9hj1Dda
— NSE India (@NSEIndia) August 3, 2023
NOTE: Entry by… pic.twitter.com/N4Rt8gWQJm
As a smart investor, only deal with registered stockbrokers! Know more: https://t.co/6EIJrMfLod#NSEIndia #SochKarSamajhKarInvestKar #InvestorAwareness #StockMarket #InvestorEducation #ShareMarket #InvestorProtection @ashishchauhan
— NSE India (@NSEIndia) August 3, 2023
MIDCPNIFTY Derivatives touches new high - over 44 million contracts traded.
— NSE India (@NSEIndia) August 2, 2023
We are grateful to all the market participants and intermediaries in achieving this milestone.#MIDCPNIFTY #FNO #Index #Options #Futures #trading #Derivatives #NSEIndia @ashishchauhan pic.twitter.com/MjeHr0760S
MITRA Digital Platform: ఇన్వెస్టర్ల కోసం మిత్ర 'ప్లాట్‌ఫామ్' ప్రారంభించిన సెబీ - దీనిని ఎలా ఉపయోగించుకోవాలి?
Investment Ideas 2025: NFO అంటే ఏంటి? - రూ.100తో పెట్టుబడి ప్రారంభించొచ్చు, దీర్ఘకాలంలో డబ్బుల వర్షం!
Mutual Funds SIP: 'సిప్'లో చారిత్రాత్మక మార్పు - కేవలం రూ.250తో మ్యుచువల్ ఫండ్స్‌ను కొనొచ్చు!
Investing In SIP: ప్రతి నెలా రూ.1000 SIP చేస్తే మీరు ఎన్ని సంవత్సరాల్లో రూ.కోటి సంపాదిస్తారు?
Trisha: త్రిష ఇంట విషాదం... క్రిస్మస్ రోజు కుమారుడిని కోల్పోయానంటూ హీరోయిన్ ఎమోషనల్
Kishan Reddy : ఏడాదికే కాంగ్రెస్ పై అసంతృప్తి.. ఇక వచ్చేది బీజేపీనే - తెలంగాణకు రూ. 10 లక్షల కోట్లు : కిషన్ రెడ్డి
Who Is Mastan Sai: ఐఐటీలో బీటెక్ నుంచి డ్రగ్స్ పెడ్లర్, బ్లాక్ మెయిలర్ వరకు.. ఎవరీ మస్తాన్ సాయి, అతడి బ్యాక్‌గ్రౌండ్ ఏంటీ?
Sai Pallavi: 'జాతీయ అవార్డు అందుకోవాలని ఎంతో ఆశగా ఉంది' - సాయిపల్లవి అమ్మమ్మ చీర సెంటిమెంట్ నెరవేరుతుందా?
Stampedes in Railway Stations: రైల్వేస్టేషన్లో తొక్కిసలాట ఇదే మొదటిసారి కాదు.. గతంలో ఎన్నో విషాదాలు!