search
×

Stock Market News: అక్కడ డౌన్.. ఇక్కడ అప్! టెక్‌ మహీంద్రా, ఎన్‌టీపీసీ టాప్‌ గెయినర్స్!

Stock Market Closing 02 May 2023: స్టాక్‌ మార్కెట్లు పరుగులు పెట్టాయి. కంపెనీలు నాలుగో క్వార్టర్‌ ఫలితాలు సానుకూలంగా ఉండటం, జీఎస్‌టీ వసూళ్లు పెరగడంతో మదుపర్లు కొనుగోళ్లు చేపట్టారు.

FOLLOW US: 
Share:

Stock Market Closing 02 May 2023:  

స్టాక్‌ మార్కెట్లు మంగళవారం పరుగులు పెట్టాయి. ఇంటర్నేషనల్ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందాయి. అయితే కంపెనీలు నాలుగో క్వార్టర్‌ ఫలితాలు సానుకూలంగా ఉండటం, జీఎస్‌టీ వసూళ్లు పెరగడం, ఇండస్ట్రీ ప్రొడక్షన్‌ పెరగడంతో మదుపర్లు కొనుగోళ్లు చేపట్టారు. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 82 పాయింట్లు పెరిగి 18,147 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 242 పాయింట్లు పెరిగి 61,354 వద్ద ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 0.07 శాతం బలహీనపడి 81.89 వద్ద స్థిరపడింది.

BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)

క్రితం సెషన్లో 60,112 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 61,301 వద్ద మొదలైంది. 61,255 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 61,486 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 242 పాయింట్ల లాభంతో 61,354 వద్ద ముగిసింది.

NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)

శుక్రవారం 18,065 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ మంగళవారం 18,124 వద్ద ఓపెనైంది. 18,101 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 18,180 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 82 పాయింట్లు పెరిగి 18,147 వద్ద క్లోజైంది.

Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)

నిఫ్టీ బ్యాంక్‌ లాభపడింది. ఉదయం 43,395 వద్ద మొదలైంది. 43,269 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 43,483 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఆఖరికి 118 పాయింట్లు పెరిగి 43,352 వద్ద ముగిసింది.

Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)

నిఫ్టీ 50లో 29 కంపెనీలు లాభాల్లో 21 నష్టాల్లో ఉన్నాయి. ఓఎన్‌జీసీ, టెక్‌ మహీంద్రా, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, ఎన్టీపీసీ, హిందాల్కో షేర్లు లాభపడ్డాయి. హీరోమోటో, సన్ ఫార్మా, అల్ట్రాటెక్‌ సెమ్‌, భారతీ ఎయిర్‌టెల్‌, కొటక్‌ బ్యాంక్‌ షేర్లు నష్టపోయాయి. ఎఫ్‌ఎంసీజీ, ఫార్మా, రియాల్టీ సూచీలు స్వల్పంగా ఎరుపెక్కాయి. బ్యాంకు, ఆటో, ఐటీ, మెటల్‌, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ సూచీలు ఎగిశాయి.

బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)

నేడు విలువైన లోహాల ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.60,760గా ఉంది. కిలో వెండి రూ.100 పెరిగి రూ.76,100 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.530 తగ్గి రూ.27,580 వద్ద ఉంది.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

Published at : 02 May 2023 04:05 PM (IST) Tags: Stock Market Update stock market today Stock Market Telugu Share Market Stock Market news

సంబంధిత కథనాలు

Stock Market News: 18,600 మీదే నిఫ్టీ క్లోజింగ్‌ - సెన్సెక్స్‌ 123 పాయింట్లు ప్లస్‌!

Stock Market News: 18,600 మీదే నిఫ్టీ క్లోజింగ్‌ - సెన్సెక్స్‌ 123 పాయింట్లు ప్లస్‌!

Stock Market News: మార్కెట్లో పుల్‌బ్యాక్‌ ఎఫెక్ట్‌! ఫ్లాట్‌ నోట్‌లో సెన్సెక్స్‌, నిఫ్టీ!

Stock Market News: మార్కెట్లో పుల్‌బ్యాక్‌ ఎఫెక్ట్‌! ఫ్లాట్‌ నోట్‌లో సెన్సెక్స్‌, నిఫ్టీ!

Stock Market News: ఫుల్‌ జోష్‌లో స్టాక్‌ మార్కెట్లు - 18,600 సమీపంలో ముగిసిన నిఫ్టీ!

Stock Market News: ఫుల్‌ జోష్‌లో స్టాక్‌ మార్కెట్లు - 18,600 సమీపంలో ముగిసిన నిఫ్టీ!

Stock Market News: ఆల్‌టైమ్‌ హై వైపు పరుగులు - ఇంట్రాడేలో 63,026 టచ్‌ చేసిన సెన్సెక్స్‌!

Stock Market News: ఆల్‌టైమ్‌ హై వైపు పరుగులు - ఇంట్రాడేలో 63,026 టచ్‌ చేసిన సెన్సెక్స్‌!

Stock Market News: స్టాక్‌ మార్కెట్లో లక్ష్మీ కళ! నేడు రూ.3 లక్షల కోట్లు లాభపడ్డ మదుపర్లు!

Stock Market News: స్టాక్‌ మార్కెట్లో లక్ష్మీ కళ! నేడు రూ.3 లక్షల కోట్లు లాభపడ్డ మదుపర్లు!

టాప్ స్టోరీస్

Telangana Congress : టిక్కెట్లిస్తే పార్టీలోకి వస్తాం - తెలంగాణ కాంగ్రెస్‌కు ఇద్దరు మాజీ ఎంపీల కబురు !

Telangana Congress :  టిక్కెట్లిస్తే పార్టీలోకి వస్తాం - తెలంగాణ కాంగ్రెస్‌కు ఇద్దరు మాజీ ఎంపీల కబురు !

Tammineni Seetharam: సెక్యూరిటీ లేకపోతే బాబు బయటకే రాలేరు, కమాండోలను తీసేస్తే ఆయన ఫినిష్: తమ్మినేని సీతారాం

Tammineni Seetharam: సెక్యూరిటీ లేకపోతే బాబు బయటకే రాలేరు, కమాండోలను తీసేస్తే ఆయన ఫినిష్: తమ్మినేని సీతారాం

BRS Politics : కలిసి నడిచేందుకు వచ్చిన వారందర్నీ దూరం పెడుతున్న కేసీఆర్ - జాతీయ వ్యూహం మారిపోయిందా ?

BRS Politics : కలిసి నడిచేందుకు వచ్చిన వారందర్నీ దూరం పెడుతున్న కేసీఆర్ -   జాతీయ వ్యూహం మారిపోయిందా ?

Balakrishna Movie Title : టైటిల్ కన్ఫర్మ్ - NBK 108లో బాలకృష్ణ క్యారెక్టర్ పేరే సినిమాకు, అది ఏమిటంటే?

Balakrishna Movie Title : టైటిల్ కన్ఫర్మ్ - NBK 108లో బాలకృష్ణ క్యారెక్టర్ పేరే సినిమాకు, అది ఏమిటంటే?