Stock Market Closing 02 December 2022:
భారత స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టపోయాయి. ఎనిమిది రోజుల లాభాలకు నేడు తెరపడింది. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందాయి. సూచీలు గరిష్ఠాలకు చేరడంతో మదుపర్లు లాభాల స్వీకరణకు దిగారు. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 116 పాయింట్ల నష్టంతో 18,696 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 415 పాయింట్ల నష్టంతో 62,868 వద్ద ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 10 పైసలు బలహీన పడి 81.31 వద్ద స్థిరపడింది.
BSE Sensex
క్రితం సెషన్లో 63,284 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 62,978 వద్ద మొదలైంది. 62,679 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 63,148 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 415 పాయింట్ల లాభంతో 62,868 వద్ద ముగిసింది.
NSE Nifty
గురువారం 18,812 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ శుక్రవారం 18,752 వద్ద ఓపెనైంది. 18,639 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 18,781 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 116 పాయింట్ల నష్టంతో 18,696 వద్ద క్లోజైంది.
Nifty Bank
నిఫ్టీ బ్యాంక్ ఎరుపెక్కింది. ఉదయం 42,976 వద్ద మొదలైంది. 42,937 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 43,131 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 156 పాయింట్లు పతనమై 43,103 వద్ద స్థిరపడింది.
Gainers and Lossers
నిఫ్టీ 50లో 18 కంపెనీలు లాభాల్లో 31 నష్టపోయాయి. అపోలో హాస్పిటల్స్, అపోలో హాస్పిటల్స్, టెక్‌మహీంద్రా, డాక్టర్ రెడ్డీస్, టాటా స్టీల్, గ్రాసిమ్ షేర్లు లాభపడ్డాయి. ఐచర్ మోటార్స్; టాటా కన్జూమర్, ఎం అండ్ ఎం, హీరో మోటో, హిందుస్థాన్ యునీలివర్ నష్టపోయాయి. ఆటో, ఎఫ్‌ఎంసీజీ, ఫైనాన్స్ సూచీలు ఎక్కువ ఎరుపెక్కాయి. మీడియా, మెటల్, పీఎస్‌యూ బ్యాంక్, రియాల్టీ గ్రీన్‌లో కళకళలాడాయి.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Also Read: డిసెంబర్లో బ్యాంకులకు 14 రోజులు సెలవు! 31కు డబ్బు జాగ్రత్త!
Also Read: వేతన పరిమితి రూ.21,000కు పెంచితే ఈపీఎఫ్, ఈపీఎస్‌లో వచ్చే మార్పులేంటి! ఉద్యోగికి నష్టమా లాభమా?