Bank Holidays in December 2022: డిసెంబర్లో బ్యాంకులకు 14 రోజులు సెలవు! 31కు డబ్బు జాగ్రత్త!
డిసెంబర్-2022 బ్యాంకు సెలవుల జాబితా వచ్చేసింది. ఈ సారి బ్యాంకులకు 14 రోజులు సెలవులు వచ్చాయి.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఈ నెల 4, 11, 18, 25న ఆదివారాలు వచ్చాయి. 10, 24న రెండు, నాలుగో శనివారాలు. అంటే వీకెండ్ సెలవులు.
డిసెంబర్ 1, 3, 5, 12, 18, 19 తేదీల్లో నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర అవతరణ, సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ ఫీస్ట్, షేక్ మహ్మద్ అబ్దుల్లా జయంతి, పా టొగాన్ నెగ్మిన్జా సగ్మా, ఉసోసో తమ్, గురు గసిదాస్ జయంతి, గోవా లిబరేషన్ డే సెలవులు ఉన్నాయి.
డిసెంబర్ 24, 25, 26, 30, 31న క్రిస్మస్ ఈవ్, క్రిస్మస్, షాహీద్ ఉద్దామ్ సింగ్ జయంతి, బాక్సింగ్ డే, టాము లొసార్, నాగ్బా, న్యూ ఇయర్ ఈవ్ సందర్భంగా సెలవులు ఉన్నాయి.
ఆర్బీఐ ప్రకారం రాష్ట్రాలను బట్టి సెలవులు ఉంటాయి. నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్, ఆర్టీజీఎస్, బ్యాంక్స్ క్లోజింగ్ అకౌంట్స్ చట్టాల ప్రకారం సెలవులు ఇస్తారు. బ్యాంకు సెలవులు రాష్ట్రాలు, ప్రాంతాలను బట్టి మారుతుంటాయి. కొన్ని సెలవులు మాత్రం దేశ వ్యాప్తంగా ఒకేలా ఉంటాయి.