Stock Market Opening 02 December 2022:
భారత స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాల్లో మొదలయ్యాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందాయి. సూచీలు గరిష్ఠాలకు చేరడంతో మదుపర్లు లాభాల స్వీకరణకు దిగారు. ఎన్ఎస్ఈ నిఫ్టీ (NSE Nifty) 114 పాయింట్ల నష్టంతో 18,698 బీఎస్ఈ సెన్సెక్స్ (BSE Sensex) 397 పాయింట్ల నష్టంతో 62,886 వద్ద ట్రేడవుతున్నాయి. పవర్, ఆటో, ఐటీ షేర్లపై సెల్లింగ్ ప్రెజర్ కనిపిస్తోంది.
BSE Sensex
క్రితం సెషన్లో 63,284 వద్ద ముగిసిన బీఎస్ఈ సెన్సెక్స్ నేడు 62,978 వద్ద మొదలైంది. 62,857 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 63,148 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 11 గంటలకు 397 పాయింట్ల నష్టంతో 62,886 వద్ద కొనసాగుతోంది.
NSE Nifty
గురువారం 18,812 వద్ద ముగిసిన ఎన్ఎస్ఈ నిఫ్టీ శుక్రవారం 18,752 వద్ద ఓపెనైంది. 18,689 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 18,781 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 114 పాయింట్ల నష్టంతో 18,698 వద్ద చలిస్తోంది.
Nifty Bank
నిఫ్టీ బ్యాంక్ నష్టాల్లో ఉంది. ఉదయం 42,976 వద్ద మొదలైంది. 42,961 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 43,127 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 210 పాయింట్లు పతనమై 43,050 వద్ద ట్రేడవుతోంది.
Gainers and Lossers
నిఫ్టీ 50లో 13 కంపెనీలు లాభాల్లో 37 నష్టాల్లో ఉన్నాయి. అపోలో హాస్పిటల్స్, ఓఎన్జీసీ, గ్రాసిమ్, అదానీ పోర్ట్స్, టాటా స్టీల్ లాభపడ్డాయి. ఐచర్ మోటార్స్, ఎం అండ్ ఎం, దివిస్ ల్యాబ్, సిప్లా, టాటా కన్జూమర్ నష్టపోయాయి. మీడియా, పీఎస్‌యూ బ్యాంక్, రియాల్టీ సూచీలు ఎగిశాయి. ఆటో, ఎఫ్ఎంసీజీ, ఫార్మా రంగాల సూచీలు ఎక్కువ ఎరుపెక్కాయి.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Also Read: అంబానీ ఫస్ట్, అదానీ లాస్ట్ - అత్యంత విలువైన కంపెనీ రిలయన్స్
Also Read: నవంబర్ నెలలోనూ కార్ సేల్స్‌లో హై స్పీడ్ - టాప్ గేర్‌లో మారుతి, హ్యుందాయ్, టాటా మోటార్స్