By: Rama Krishna Paladi | Updated at : 01 Sep 2023 03:53 PM (IST)
స్టాక్ మార్కెట్ అప్డేట్
Stock Market Closing 01 September 2023:
స్టాక్ మార్కెట్లు శుక్రవారం దూసుకెళ్లాయి. భారీ లాభాల్లో ముగిశాయి. ఐదు వారాల నష్టాలకు తెరపడేశాయి. ఆసియా, గ్లోబల్ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందాయి. మెరుగైన జీడీపీ గణాంకాలు రావడం ఇన్వెస్టర్లలో విశ్వాసం నింపాయి. చైనా ఉద్దీపనతో కొన్ని కంపెనీల షేర్ల ధరలు పెరిగాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 181 పాయింట్లు పెరిగి 19,435 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 555 పాయింట్లు పెరిగి 65,387 వద్ద ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 7 పైసలు బలపడి 82.71 వద్ద స్థిరపడింది.
BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)
క్రితం సెషన్లో 64,831 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 64,855 వద్ద మొదలైంది. 64,818 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 65,473 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 555 పాయింట్ల లాభంతో 65,387 వద్ద ముగిసింది.
NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)
గురువారం 19,253 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ శుక్రవారం 19,258 వద్ద ఓపెనైంది. 19,255 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 19,458 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 181 పాయింట్లు పెరిగి 19,435 వద్ద క్లోజైంది.
Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)
నిఫ్టీ బ్యాంక్ పెరిగింది. ఉదయం 43,996 వద్ద మొదలైంది. 43,830 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 44,568 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. సాయంత్రానికి 446 పాయింట్ల లాభంతో 44,436 వద్ద ముగిసింది.
Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)
నిఫ్టీ 50లో 44 కంపెనీలు లాభాల్లో 7 నష్టాల్లో ఉన్నాయి. జియోఫిన్, ఓఎన్‌జీసీ, ఎన్టీపీసీ, టాటా స్టీల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ షేర్లు లాభపడ్డాయి. సిప్లా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, డాక్టర్ రెడ్డీస్, నెస్లే ఇండియా, అల్ట్రాటెక్ సెమ్ షేర్లు తగ్గాయి. ఫార్మా, హెల్త్‌కేర్ మినహా అన్ని రంగాల సూచీలు ఎగిశాయి. ఆటో, ఐటీ, మీడియా, మెటల్, పీఎస్‌యూ బ్యాంక్, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు ఎక్కువ పెరిగాయి.
బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)
నేడు విలువైన లోహాల ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.110 తగ్గి రూ.60,050 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి రూ.500 తగ్గి రూ.77,100 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.140 తగ్గి రూ.25,790 వద్ద ఉంది.
Also Read: ప్రస్తుతం ఓపెన్‌లో ఉన్న 5 బైబ్యాక్ ఆఫర్‌లు, వీటిలో ఏ కంపెనీ షేర్లు మీ దగ్గర ఉన్నాయి?
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
SIP Strategies: మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు
Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే"కింగ్" ఎంట్రీ - జియోకి గ్రీన్ సిగ్నల్
Mutual Funds: మీ డబ్బును వేగంగా రెట్టింపు చేసే 5 ఫండ్స్, 15-20 ఏళ్లు ఎదురు చూడాల్సిన అవసరం లేదు
Investment Tips: నెలకు రూ.20 వేలతో మూడేళ్లలో రూ.12 లక్షలు - అద్భుతం చేసిన ELSS ఫండ్స్
Investment For Children: ట్రెండ్ మారింది, చిల్డ్రన్ మ్యూచువల్ ఫండ్స్‌లోకి పెట్టుబడుల వరద
Telugu Politics: సంక్రాంతికి వస్తున్నాం- జగన్, కేసీఆర్‌ల జనం బాట.. కొత్త స్ట్రాటజీ హిట్టా ఫట్టా!
Dwarampudi Chandrasekhar Reddy Latest News: వైసీపీ లీడర్ ద్వారంపూడికి బిగ్ షాక్- ఫ్యాక్టరీ సీజ్ చేసిన పీసీబీ
Pushpa 2 Ticket Rates: ఏపీలో పుష్ప 2 బెనిఫిట్ షోలు, టికెట్ ధర పెంపునకు అనుమతి - తెలంగాణ కంటే ఎక్కువే
PV Sindhu And Venkata Datta Sai Wedding: పెళ్లి పీటలెక్కనున్న పీవీ సింధు.. వరుడు ఎవరంటే..?