search
×

Stock Market Closing: బుల్‌ రన్‌ కంటిన్యూ! ఐటీ, మెటల్‌, పీయూస్‌ దన్నుతో సెన్సెక్స్‌, నిఫ్టీ అదుర్స్‌!

Stock Market Closing 01 December 2022: భారత స్టాక్‌ మార్కెట్లు గురువారం లాభాల్లో ముగిశాయి. జీడీపీ, పీఎంఐ, జీఎస్‌టీ రాబడి గణాంకాల ఊపుతో సరికొత్త గరిష్ఠాలకు ఎగబాకుతున్నాయి.

FOLLOW US: 
Share:

Stock Market Closing 01 December 2022:

భారత స్టాక్‌ మార్కెట్లు గురువారం లాభాల్లో ముగిశాయి. జీడీపీ, పీఎంఐ, జీఎస్‌టీ రాబడి గణాంకాల ఊపుతో సరికొత్త గరిష్ఠాలకు ఎగబాకుతున్నాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందాయి. ఉదయంతో పోలిస్తే మదుపర్లు కాస్త లాభాల స్వీకరణకు దిగడంతో సాయంత్రానికి సూచీలు కాస్త తగ్గాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 54 పాయింట్ల లాభంతో 18,812 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 184 పాయింట్ల లాభంతో 63,284 వద్ద ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 21 పైసలు బలపడి 81.21 వద్ద స్థిరపడింది.

BSE Sensex

క్రితం సెషన్లో 63,099 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 63,357 వద్ద మొదలైంది. 63,183 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 63,583 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 184 పాయింట్ల లాభంతో 63,284 వద్ద ముగిసింది.

NSE Nifty

బుధవారం 18,758 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ గురువారం 18,871 వద్ద ఓపెనైంది. 18,778 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 18,887 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 54 పాయింట్ల లాభంతో 18,812 వద్ద క్లోజైంది.

Nifty Bank

నిఫ్టీ బ్యాంక్‌ స్వల్ప లాభాల్లో ముగిసింది. ఉదయం 43,512 వద్ద మొదలైంది. 43,101 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 43,515 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 29 పాయింట్ల లాభంతో 43,260 వద్ద సెటిలైంది.

Gainers and Lossers

నిఫ్టీ 50లో 23 కంపెనీలు లాభాల్లో 27 నష్టాల్లో క్లోజయ్యాయి. అల్ట్రాటెక్‌ సెమ్‌, హిందాల్కో, టాటా స్టీల్‌, గ్రాసిమ్‌, టీసీఎస్‌ లాభపడ్డాయి. ఐసీసీఐ బ్యాంక్‌, యూపీఎల్‌, సిప్లా, ఐచర్‌ మోటార్స్‌, బజాజ్‌ ఆటో షేర్లు నష్టాల్ని చవిచూశాయి. ఆటో, ఎఫ్‌ఎంసీజీ, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ సూచీలు ఎక్కువ ఎరుపెక్కాయి. ఐటీ, మీడియా, మెటల్‌, పీఎస్‌యూ బ్యాంక్‌, రియాల్టీ సూచీలు గ్రీన్‌లో కళకళలాడాయి.

Also Read: గ్యాస్‌ ధరల్లో మార్పు! డిసెంబర్లో మారుతున్న ఆర్థిక నిబంధనలు!

Also Read: దటీజ్‌ ఇండియా! జీడీపీ వృద్ధిరేటు 6.3% - నెమ్మదించినా ప్రపంచంలోనే బెస్ట్‌!

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

View this post on Instagram
 
A post shared by BSEIndia (@bseindia)

Published at : 01 Dec 2022 04:11 PM (IST) Tags: Stock Market Update stock market today Stock Market Telugu Share Market Stock Market news

ఇవి కూడా చూడండి

SIP Strategies: మ్యూచువల్‌ ఫండ్స్‌ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు

SIP Strategies: మ్యూచువల్‌ ఫండ్స్‌ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు

Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే"కింగ్‌" ఎంట్రీ - జియోకి గ్రీన్‌ సిగ్నల్‌

Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే

Mutual Funds: మీ డబ్బును వేగంగా రెట్టింపు చేసే 5 ఫండ్స్, 15-20 ఏళ్లు ఎదురు చూడాల్సిన అవసరం లేదు

Mutual Funds: మీ డబ్బును వేగంగా రెట్టింపు చేసే 5 ఫండ్స్, 15-20 ఏళ్లు ఎదురు చూడాల్సిన అవసరం లేదు

Investment Tips: నెలకు రూ.20 వేలతో మూడేళ్లలో రూ.12 లక్షలు - అద్భుతం చేసిన ELSS ఫండ్స్‌

Investment Tips: నెలకు రూ.20 వేలతో మూడేళ్లలో రూ.12 లక్షలు - అద్భుతం చేసిన ELSS ఫండ్స్‌

Investment For Children: ట్రెండ్‌ మారింది, చిల్డ్రన్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి పెట్టుబడుల వరద

Investment For Children: ట్రెండ్‌ మారింది, చిల్డ్రన్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి పెట్టుబడుల వరద

టాప్ స్టోరీస్

TGPSC: తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు

TGPSC: తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు

CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు

CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు

Pushpa 2 Trailer: మైండ్ బ్లాక్ అయ్యేలా బీహార్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్... ఇవాళ సాయంత్రమే 'పుష్ప 2' ట్రైలర్ విడుదల

Pushpa 2 Trailer: మైండ్ బ్లాక్ అయ్యేలా బీహార్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్... ఇవాళ సాయంత్రమే 'పుష్ప 2' ట్రైలర్ విడుదల

Toyota Camry Hybrid Facelift: టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?

Toyota Camry Hybrid Facelift: టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?