By: Rama Krishna Paladi | Updated at : 29 Aug 2023 12:40 PM (IST)
స్టాక్ మార్కెట్ అప్డేట్ ( Image Source : Pexels )
Stock Market at 12 PM, 29 August 2023:
స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాల్లో కొనసాగుతున్నాయి. ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలే వచ్చాయి. సుప్రీం కోర్టు విచారణ నేపథ్యంలో అదానీ గ్రూప్ షేర్లు మిశ్రమంగా కదలాడుతున్నాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 46 పాయింట్లు పెరిగి 19,352 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 111 పాయింట్లు పెరిగి 65,097 వద్ద కొనసాగుతున్నాయి. మెటల్, రియాల్టీ షేర్లకు గిరాకీ పెరిగింది.
BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)
క్రితం సెషన్లో 64,996 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 65,201 వద్ద మొదలైంది. 64,994 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 65,229 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మధ్యాహ్నం 12 గంటలకు 111 పాయింట్ల లాభంతో 65,097 వద్ద కొనసాగుతోంది.
NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)
సోమవారం 19,306 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ మంగళవారం 19,374 వద్ద ఓపెనైంది. 19,313 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 19,377 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 46 పాయింట్లు ఎగిసి 19,352 వద్ద ట్రేడవుతోంది.
Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)
నిఫ్టీ బ్యాంక్ పెరిగింది. ఉదయం 44,655 వద్ద మొదలైంది. 44,471 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 44,655 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మధ్యాహ్నం 81 పాయింట్లు పెరిగి 44,576 వద్ద కొనసాగుతోంది.
Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)
నిఫ్టీ 50లో 41 కంపెనీలు లాభాల్లో 10 నష్టాల్లో ఉన్నాయి. జియో ఫైనాన్స్, యూపీఎల్, హిందాల్కో, అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ పోర్ట్స్ షేర్లు లాభపడ్డాయి. భారతీ ఎయిర్‌టెల్, యాక్సిస్ బ్యాంక్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, రిలయన్స్, హిందుస్థాన్ యునీలివర్ షేర్లు నష్టపోయాయి. ఎఫ్‌ఎంసీజీ, పీఎస్‌యూ బ్యాంకు సూచీలు ఎరుపెక్కాయి. ఆటో, మీడియా, మెటల్, రియాల్టీ, కన్జూమర్ డ్యురబుల్స్ సూచీలు ఎగిశాయి.
బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)
నేడు విలువైన లోహాల ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.270 పెరిగి రూ.59,670 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి రూ.200 పెరిగి రూ.77,100 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.590 పెరిగి రూ.25,670 వద్ద ఉంది.
Also Read: హైబ్రీడ్ అందరికీ బెస్ట్! పూర్తిగా ఆఫీసులకు వద్దంటున్న నిపుణులు!
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Year Ender 2024: 2024లో పెట్టుబడిదార్లను ధనవంతులుగా మార్చిన టాప్-10 మ్యూచువల్ ఫండ్స్
New Mutual Fund: 'స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్' - అధిక లాభాలు కోరుకునే హైరిస్క్ ఇన్వెస్టర్లకు బెస్ట్ ఆప్షన్!
SIP Strategies: మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు
Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే"కింగ్" ఎంట్రీ - జియోకి గ్రీన్ సిగ్నల్
Mutual Funds: మీ డబ్బును వేగంగా రెట్టింపు చేసే 5 ఫండ్స్, 15-20 ఏళ్లు ఎదురు చూడాల్సిన అవసరం లేదు
Devansh: చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
Best Gifts For Christmas: రూ.2000 ధరలో బెస్ట్ క్రిస్మస్ గిఫ్ట్‌లు ఇవే - స్పీకర్ల నుంచి స్మార్ట్ వాచ్ దాకా!
Allu Aravind: 'సంయమనం పాటిస్తాం, ఎలాంటి వ్యాఖ్యలు చేయబోం' - దాడి ఘటనపై అల్లు అరవింద్ స్పందన
Top 5 Mileage Cars: మనదేశంలో బెస్ట్ మైలేజీలు ఇచ్చే ఐదు కార్లు ఇవే - డామినేషన్ ఆ కంపెనీదే!