By: ABP Desam | Updated at : 04 May 2023 03:58 PM (IST)
స్టాక్ మార్కెట్ అప్డేట్
Stock Closing 04 May 2023:
స్టాక్ మార్కెట్లు గురువారం ఒక రేంజులో పెరిగాయి. భారీ లాభాల్లో ముగిశాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందాయి. యూఎస్ ఫెడ్ 25 బేసిస్ పాయింట్లు వడ్డీరేటు పెంచినా మన మార్కెట్లపై ఎఫెక్ట్ తక్కువగానే ఉంది. ప్రమోటర్లు, ఎఫ్‌ఐఐలు, డీఐఐలు చాలా కంపెనీల్లో స్టేక్స్ పెంచుకున్నారు. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 165 పాయింట్లు పెరిగి 18,255 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 555 పాయింట్లు పెరిగి 61,749 వద్ద ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 3 పైసలు బలపడి 81.80 వద్ద స్థిరపడింది.8
BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)
క్రితం సెషన్లో 61,193 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 61,258 వద్ద మొదలైంది. 61,119 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 61,797 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 555 పాయింట్ల లాభంతో 61,749 వద్ద ముగిసింది.
NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)
బుధవారం 18,098 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ గురువారం 18,081 వద్ద ఓపెనైంది. 18,066 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 18,255 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 165 పాయింట్లు పెరిగి 18,255 వద్ద క్లోజైంది.
Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)
నిఫ్టీ బ్యాంక్ లాభపడింది. ఉదయం 43,236 వద్ద మొదలైంది. 43,213 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 43,739 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఆఖరికి 372 పాయింట్లు పెరిగి 43,685 వద్ద ముగిసింది.
Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)
నిఫ్టీ 50లో 33 కంపెనీలు లాభాల్లో 17 నష్టాల్లో ఉన్నాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్, బజాజ్ ఫైనాన్స్, హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీఐ లైఫ్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లు లాభపడ్డాయి. పవర్ గ్రిడ్, ఇండస్ ఇండ్ బ్యాంక్, యూపీఎల్, ఐటీసీ, నెస్లే ఇండియా షేర్లు నష్టపోయాయి. ఎఫ్‌ఎంసీజీ మినహా అన్ని రంగాల సూచీలు ఎగిశాయి. బ్యాంకు, ఫైనాన్స్, మెటల్, పీఎస్‌యూ బ్యాంక్, హెల్త్‌కేర్ సూచీలు ఎక్కువ లాభపడ్డాయి.
బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)
నేడు విలువైన లోహాల ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.540 పెరిగి రూ.62,180గా ఉంది. కిలో వెండి రూ.300 పెరిగి రూ.77,100 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.70 పెరిగి రూ.27,580 వద్ద ఉంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Join us in this session to understand about WTI Crude Oil & Natural Gas Futures Contracts!
— NSE India (@NSEIndia) May 4, 2023
Register Now: https://t.co/wDROuxLtV9#CrudeOil #NaturalGas #Commodities #Futures #Contracts #FNO #Derivatives @ashishchauhan pic.twitter.com/6XCyq52H4C
Stay connected for the upcoming sessions on WTI Crude Oil and Natural Gas Futures Contracts! Link for the sessions will be shared soon! #CrudeOil #NaturalGas #Commodities #Futures #Contracts #FNO #Derivatives @ashishchauhan pic.twitter.com/1excHbu4EZ
— NSE India (@NSEIndia) May 4, 2023
SIP Strategies: మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు
Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే"కింగ్" ఎంట్రీ - జియోకి గ్రీన్ సిగ్నల్
Mutual Funds: మీ డబ్బును వేగంగా రెట్టింపు చేసే 5 ఫండ్స్, 15-20 ఏళ్లు ఎదురు చూడాల్సిన అవసరం లేదు
Investment Tips: నెలకు రూ.20 వేలతో మూడేళ్లలో రూ.12 లక్షలు - అద్భుతం చేసిన ELSS ఫండ్స్
Investment For Children: ట్రెండ్ మారింది, చిల్డ్రన్ మ్యూచువల్ ఫండ్స్‌లోకి పెట్టుబడుల వరద
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
SBI Clerk Recruitment 2024: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
Chain Snatching: పట్టపగలే కాలింగ్ బెల్ కొట్టి మరీ చైన్ స్నాచింగ్ - భాగ్యనగరంలో షాకింగ్ ఘటన
Tirumala Vision 2047 : తిరుమల విజన్ 2047 - ప్రపోజల్స్ ఆహ్వానించిన టీటీడీ