By: ABP Desam | Updated at : 10 Nov 2023 01:29 PM (IST)
'గోడ మీద పిల్లి' ఫార్ములా
Mutual Funds Through Systematic Transfer Plan: ఒక విషయం మీద నిలకడగా ఉండని "గోడ మీద పిల్లి" అంటారు. సాధారణంగా, ఒక వ్యక్తిని విమర్శించడానికి ఈ వాక్యాన్ని వాడుతుంటారు. స్టాక్ మార్కెట్‌లో మాత్రం గోడ మీద పిల్లి వాటమే కరెక్ట్. ఎందుకంటే, మార్కెట్ ట్రెండ్‌ను బట్టి మన నిర్ణయాలు మార్చుకుంటూ ఉండాలి. మార్కెట్‌లో ఎటు వైపు అవకాశం ఉంటే అటు వైపు దూకాలి. అలా కాకుండా మడిగట్టుకు కూర్చుంటే నష్టాలు నెత్తికెక్కుతాయి.
మ్యూచువల్ ఫండ్స్ (MFs) ద్వారా, స్టాక్ మార్కెట్‌లో ఇన్‌డైరెక్ట్‌గా పెట్టుబడులు పెడుతుంటారు. మ్యూచువల్ ఫండ్స్ వల్ల పెట్టుబడి రిస్క్ తక్కువ. అదే సమయంలో, రిటర్న్స్ కూడా భారీ స్థాయిలో ఉండవు. మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులు పెట్టే మార్గాల్లో ఎక్కువ ప్రాచుర్యం పొందిన పద్ధతి 'సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్' (SIP). దీంతోపాటు, సిస్టమాటిక్ విత్‌డ్రాల్ ప్లాన్ (Systematic Withdrawal Plan - SWP), సిస్టమాటిక్ ట్రాన్స్‌ఫర్ ప్లాన్ (Systematic Transfer Plan- STP) కూడా ఉన్నాయి. ఇంతకుముందు చెప్పుకున్నట్లు, 'గోడ మీద పిల్లి' వాటంతో వచ్చే ప్రయోజనాలను సిస్టమాటిక్ ట్రాన్స్‌ఫర్ ప్లాన్ అందిస్తుంది.
STP ద్వారా, ఒక మ్యూచువల్ ఫండ్ పథకం నుంచి మరో మ్యూచువల్ ఫండ్‌లోకి జంప్ చేయవచ్చు. ఎక్కువ లాభాలను అందించే సెక్యూరిటీల్లోకి మారిపోవచ్చు. మార్కెట్ స్వింగ్ సమయంలో, నష్టపోయే పథకాల నుంచి లాభపడే పథకాల్లోకి పెట్టుబడిని మార్చుకోవచ్చు. మార్కెట్ హెచ్చుతగ్గుల నుంచి పెట్టుబడి డబ్బుకు రక్షణ కల్పించవచ్చు. సాధారణంగా, డెట్ ఫండ్ నుంచి ఈక్విటీ ఫండ్‌కు నిధుల బదిలీలు జరుగుతుంటాయి. ఇక్కడొక చిన్న పరిమితి ఉంది. ఒకే ఫండ్ కంపెనీ నిర్వహించే వివిధ స్కీమ్స్ మధ్య మాత్రమే ఈ బదిలీకి అవకాశం ఉంటుంది. వేరే అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ (AMC) నిర్వహించే పథకాల్లోకి STP ద్వారా డబ్బు మళ్లించడం కుదరదు.
STPలోనూ కొన్ని రకాలు ఉన్నాయి:
ఫ్లెక్సిబుల్ STP: అవసరమైనప్పుడు బదిలీ చేయవలసిన మొత్తాన్ని పెట్టుబడిదార్లే నిర్ణయిస్తారు. మార్కెట్ అస్థిరత, పథకం పనితీరు మీద అంచనాలను బట్టి, ప్రస్తుత ఫండ్‌లోని ఎక్కువ వాటాను బదిలీ చేసుకోవచ్చు లేదా ఎక్కువ మొత్తాన్ని ప్రస్తుత ఫండ్‌లోనే ఉంచేయవచ్చు.
ఫిక్స్‌డ్ STP: ఒక మ్యూచువల్ ఫండ్ నుంచి మరొకదానికి బదిలీ చేసే డబ్బు నిర్ణీత మొత్తంలో మొత్తంలో ఉంటుంది, ఈ అమౌంట్‌లో మార్పు ఉండదు.
క్యాపిటల్ STP: ఒక ఫండ్‌లో వచ్చిన మొత్తం లాభాలు మరింత వృద్ధికి అవకాశం ఉన్న మరో పథకంలోకి బదిలీ చేయవచ్చు.
పన్ను కట్టాలా?
STP కింద బదిలీ చేసిన మొత్తంపై మూలధన లాభం (Capital gain) వస్తే పన్ను కట్టాల్సిన అవసరం లేదు. STP మ్యూచువల్ ఫండ్స్ నుంచి మూడు సంవత్సరాల ముందే ఎగ్టిట్ అయితే, స్వల్పకాలిక మూలధన లాభాల పన్ను నుంచి కూడా మినహాయింపు పొందొచ్చు. మూడేళ్లు దాటాక ఎగ్జిట్ అయితే... దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను (Long term capital gains tax) నుంచి కూడా మినహాయింపులను పొందే అవకాశం ఉన్నా, పెట్టుబడిదార్ల వార్షిక ఆదాయం మీద అది ఆధారపడి ఉంటుంది.
ఎంట్రీ - ఎగ్జిట్ ఛార్జెస్
STP మ్యూచువల్ ఫండ్స్ ద్వారా పెట్టుబడి పెట్టడానికి కనీస మొత్తాన్ని సెబీ నిర్ణయించకపోయినా, ఆయా ఫండ్ హౌస్‌లు సొంతంగా కనీస మొత్తాలను నిర్ణయించాయి. పెట్టుబడిదారు కనీసం ఆరు ఫండ్ ట్రాన్స్‌ఫర్స్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది. వాటి మీద ఎంట్రీ లోడ్ ఉండదు గానీ, ఎగ్జిట్ ఛార్జ్ ఉంటుంది. పెట్టుబడులు బదిలీ చేసే సమయంలో గరిష్టంగా 2% మొత్తాన్ని ఎగ్జిట్ ఫీజుగా వసూలు చేస్తారు. లిక్విడ్ ఫండ్ నుంచి ఈక్విటీ ఫండ్‌కి నిధులను బదిలీ చేస్తే ఎగ్జిట్ లోడ్ పడదు.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఆసక్తికర కథనం: టీవీ, ఏసీ, ఫ్రిజ్ కొనాలనే ఆలోచన ఉన్న వారికి ఇది చాలా పెద్ద గుడ్‌న్యూస్
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
SIP Strategies: మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు
Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే"కింగ్" ఎంట్రీ - జియోకి గ్రీన్ సిగ్నల్
Mutual Funds: మీ డబ్బును వేగంగా రెట్టింపు చేసే 5 ఫండ్స్, 15-20 ఏళ్లు ఎదురు చూడాల్సిన అవసరం లేదు
Investment Tips: నెలకు రూ.20 వేలతో మూడేళ్లలో రూ.12 లక్షలు - అద్భుతం చేసిన ELSS ఫండ్స్
Investment For Children: ట్రెండ్ మారింది, చిల్డ్రన్ మ్యూచువల్ ఫండ్స్‌లోకి పెట్టుబడుల వరద
Sanju Samson: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Salaar 2 Update: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!