By: ABP Desam | Updated at : 04 Jul 2023 03:30 PM (IST)
టెన్షన్ పెట్టకుండా డబ్బు సంపాదించిన 10 మల్టీక్యాప్ ఫండ్స్
Best Multicap Mutual Funds: ఇండియన్ స్టాక్ మార్కెట్ ఇప్పుడు రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది. రోజురోజుకూ కొత్త శిఖరానికి చేరుకుంటోంది. ఇవాళ 65,000 పాయింట్ల మైల్‌స్టోన్ దాటిన సెన్సెక్స్ బస్, త్వరలో లక్ష పాయింట్ల స్థాయి దగ్గర హాల్ట్ చేయవచ్చని మార్కెట్ ఎనలిస్ట్‌లు చెబుతున్నారు. మార్కెట్‌లోని ఈ వేగాన్ని సద్వినియోగం చేసుకుంటే చాలా వేగంగా డబ్బు సంపాదించవచ్చు, మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ దీనికి సాయం చేస్తాయి.
గత ఏడాది కాలంలో BSE సెన్సెక్స్ 23 శాతం లాభపడింది. అదే కాలంలో నిఫ్టీ కూడా దాదాపు 22 శాతం పైగా గెయిన్స్ తీసుకుంది. ఈ క్యాలెండర్ ఇయర్‌లో ఇప్పటి వరకు, ఈ రెండు మెయిన్ ఇండెక్స్‌లు తలో 6 శాతం పైగా ర్యాలీ చేశాయి. జూన్ నెలలో సుమారు 4 చొప్పున పెరిగాయి.
మల్టీ క్యాప్ ఫండ్ బెనిఫిట్స్
పేరుకు తగ్గట్టే, అన్ని సెగ్మెంట్ల కలబోతే మల్టీక్యాప్ ఫండ్. లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ స్టాక్స్‌లో మల్టీక్యాప్ మ్యూచువల్ ఫండ్ పెట్టుబడి పెడుతుంది. తద్వారా, పోర్ట్‌ఫోలియోలో డైవర్షిఫికేషన్ చూపిస్తుంది. లార్జ్ క్యాప్ స్టాక్స్‌లోని గట్టిదనం, మిడ్ క్యాప్ & స్మాల్ క్యాప్ ఫండ్స్‌లోని చురుకుదనాన్ని ఒడిసిపడుతుంది.
మల్టీ క్యాప్ ఫండ్స్ వల్ల చాలా బెనిఫిట్స్ అందుతాయి. ఇది ఏ ఒక్క సెగ్మెంట్‌పై ఆధారపడదు కాబట్టి, మార్కెట్ ఒడిదొడుకుల నుంచి పెట్టుబడిదార్ల డబ్బుకు రక్షణ ఉంటుంది. ఒకే టైమ్‌లో.. లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్ లేదా స్మాల్ క్యాప్ స్టాక్స్ పనితీరు ఒకేలా ఉండదు. ఉదాహరణకు, ఈ సంవత్సరంలో పెద్ద కంపెనీల పెర్ఫార్మెన్స్ అంత గొప్పగాలేదు. కానీ, మిడ్ క్యాప్ & స్మాల్ క్యాప్స్ సూపర్‌మ్యాన్స్‌లా దూసుకుపోతున్నాయి. ఇలాంటి బెనిఫిట్స్‌ను పొందడానికి, మల్టీ క్యాప్ ఫండ్స్ ప్రతి సెగ్మెంట్‌లోనూ పెట్టుబడి పెడతాయి. ఒక సెగ్మెంట్ తగ్గినా, మరొక సెగ్మెంట్ ఆ నష్టాన్ని భర్తీ చేస్తుంది. ఇతర మ్యూచువల్ ఫండ్స్ కంటే మల్టీ క్యాప్ ఫండ్స్ స్థిరంగా ఉంటాయి.
గత ఏడాది కాలంలో మంచి రిటర్న్స్ ఇచ్చిన టాప్ 10 మల్టీక్యాప్ ఫండ్స్:
స్కీమ్ పేరు 1 ఇయర్ రిటర్న్స్
Nippon India Multicap Fund ----------- డైరెక్ట్ ప్లాన్ & గ్రోత్ 38.60%
HDFC Multicap Fund ------------------డైరెక్ట్ ప్లాన్ & గ్రోత్ 39.39%
Kotak Multicap Fund ----------------- డైరెక్ట్ ప్లాన్ & గ్రోత్ 32.89%
Mahindra Manulife Multi Cap Fund --- డైరెక్ట్ ప్లాన్ & గ్రోత్ 32.06%
ITI Multi Cap Fund ------------------- -డైరెక్ట్ ప్లాన్ & గ్రోత్ 30.81%
IDFC Multicap Fund ------------------ డైరెక్ట్ ప్లాన్ & గ్రోత్ 30.65%
Bandhan Multicap Fund -------------- డైరెక్ట్ ప్లాన్ & గ్రోత్ 30.65%
ICICI Prudential Multicap Fund ------- డైరెక్ట్ ప్లాన్ & గ్రోత్ 29.45%
Axis Multicap Fund ------------------- డైరెక్ట్ ప్లాన్ & గ్రోత్ 29.01%
Baroda BNP Paribas Multi Cap Fund - డైరెక్ట్ ప్లాన్ & గ్రోత్ 27.25%
మరో ఆసక్తికర కథనం: ఇన్‌కమ్ టాక్స్ ఫామ్‌లో 6 మార్పులు - ఫైల్ చేసే ముందే పూర్తిగా తెలుసుకోండి
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
SIP Strategies: మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు
Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే"కింగ్" ఎంట్రీ - జియోకి గ్రీన్ సిగ్నల్
Mutual Funds: మీ డబ్బును వేగంగా రెట్టింపు చేసే 5 ఫండ్స్, 15-20 ఏళ్లు ఎదురు చూడాల్సిన అవసరం లేదు
Investment Tips: నెలకు రూ.20 వేలతో మూడేళ్లలో రూ.12 లక్షలు - అద్భుతం చేసిన ELSS ఫండ్స్
Investment For Children: ట్రెండ్ మారింది, చిల్డ్రన్ మ్యూచువల్ ఫండ్స్‌లోకి పెట్టుబడుల వరద
Revanth Reddy: కేసీఆర్ అనే మొక్కను మళ్లీ మొలకెత్తనివ్వం, రాసి పెట్టుకోండి- వరంగల్ సభలో రేవంత్ రెడ్డి సంచలనం
Vizag Crime News: వీడియోలతో బెదిరించి లా స్టూడెంట్ పై సామూహిక అత్యాచారం, హోం మంత్రి అనిత సీరియస్
RAPO 22: మహేష్ దర్శకత్వంలో రామ్ పోతినేని... ఓపెనింగ్‌కు ముహూర్తం ఖరారు
YS Viveka Case: బెయిల్ రద్దు ఎందుకు చేయకూడదు ?- అవినాష్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు