By: ABP Desam | Updated at : 20 Apr 2023 11:13 AM (IST)
మ్యూచువల్ ఫండ్స్‌లోకి టన్నుల కొద్దీ డబ్బు
Mutual Fund SIP Collections: స్టాక్ మార్కెట్‌లో హెచ్చుతగ్గులు ఎన్ని ఉన్నా, రిటైల్ ఇన్వెస్టర్లు ధైర్యంగా నిలబడుతున్నారు. ముఖ్యంగా, మ్యూచువల్ ఫండ్ సిప్‌లపై (Systematic Investment Plan- SIP) అమితమైన విశ్వాసం కనబరుస్తున్నారు. మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ తాజా సమాచారం దీనిని నిర్ధరిస్తోంది. కొత్త గణాంకాల ప్రకారం, మ్యూచువల్ ఫండ్ పరిశ్రమలోకి 'సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్' ద్వారా వచ్చిన పెట్టుబడులు గత ఆర్థిక సంవత్సరంలో (2022-23) అద్భుతమైన వృద్ధిని నమోదు చేశాయి.
ఏటా పెరుగుతున్న కలెక్షన్లు
అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (AMFI) విడుదల చేసిన తాజా సమాచారం ప్రకారం... FY23లో SIP కలెక్షన్లు 25 శాతం పెరిగి రూ. 1.56 లక్షల కోట్లకు చేరుకున్నాయి. అంతకుముందు, 2021-22 ఆర్థిక సంవత్సరంలో SIPల ద్వారా రూ. 1.24 లక్షల కోట్లు, దీనికిముందు 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ. 96,080 కోట్లు మ్యూచువల్ ఫండ్స్‌లోకి వచ్చాయి. SIPల ద్వారా మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ వసూళ్లు ఏటికేడు పెరుగుతున్నాయని, పాత రికార్డ్‌లు బద్ధలవుతున్నాయని ఇది నిరూపిస్తోంది.
యాంఫీ (AMFI) డేటా ప్రకారం, గత ఏడు సంవత్సరాల్లో మ్యూచువల్ ఫండ్ పరిశ్రమలోకి SIP ద్వారా వచ్చిన మొత్తం మూడు రెట్లు పెరిగింది. 2016-17 ఆర్థిక సంవత్సరంలో ఇది కేవలం రూ. 43,921 కోట్లుగా ఉంది. దీర్ఘకాలిక వృద్ధిపై రిటైల్ పెట్టుబడిదార్లు విశ్వాసం ప్రదర్శిస్తున్నారని.. గత కొన్ని సంవత్సరాలుగా మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ నుంచి వస్తున్న డేటాను బట్టి అర్ధం అవుతోంది. సిప్‌ల ద్వారా ఎప్పటికప్పుడు ఎక్కువ డబ్బు పెట్టుబడి పెట్టడానికి ఇదే కారణం.
నెలవారీగానూ అత్యధిక వసూళ్లు
యాంఫీ డేటా ప్రకారం, నెలవారీ ప్రాతిపదికన కూడా SIP మార్గంలో మంచి వృద్ధి కనిపిస్తోంది. గత సంవత్సరం (2022) మార్చి నెలలో, మ్యూచువల్ ఫండ్స్ SIPలోకి రూ. 12,328 కోట్లు వచ్చాయి. ఈ ఏడాది (2023) మార్చి నెలలో ఈ మొత్తం రూ. 14,276 కోట్లుగా నమోదైంది. మ్యూచువల్ ఫండ్స్‌కి SIP ద్వారా ఒక నెలలో అందిన రికార్డ్ స్థాయి కలెక్షన్ ఇదే. 2022 మార్చితో పోలిస్తే, 2023 మార్చిలో వసూళ్లు 16% పెరిగాయి.
గత ఆర్థిక సంవత్సరంలో ఏనెలకానెల SIP మొత్తం పెరుగుతూనే వచ్చింది. ఆ ఆర్థిక సంవత్సరంలో, ప్రతి నెలా సగటున రూ. 13,000 కోట్ల సిప్ పెట్టుబడులు మ్యూచువల్ ఫండ్స్‌కు అందాయి.
SBI మ్యూచువల్ ఫండ్ రికార్డ్
దేశీయ మార్కెట్‌లోని అతి పెద్ద ఫండ్ హౌస్‌లో ఒకటైన SBI మ్యూచువల్ ఫండ్ రికార్డ్ సృష్టించింది. ఇది, గత ఆర్థిక సంవత్సరంలో SIP సేకరణల్లో అద్భుతమైన వృద్ధిని నమోదు చేసింది. SBI మ్యూచువల్ ఫండ్‌కు FY22-23 SIPలలో 27 శాతం పైగా పెరుగుదలను కనబరిచింది. దీని నిర్వహణలోని ఆస్తులు (AUM) రూ. 7 లక్షల కోట్లు దాటాయి, ఈ లెక్కలో దేశంలోనే మొదటి ఫండ్ హౌస్‌గా అవతరించింది. నిర్వహణలోని ఆస్తుల పరంగా, SBI మ్యూచువల్ ఫండ్‌కు 18 శాతం మార్కెట్ వాటా ఉంది. గత దశాబ్ద కాలంలో ఏ ఫండ్ హౌస్ కూడా ఈ స్థాయి మార్కెట్ వాటా సాధించలేదు.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Stock Market News: ఫుల్ జోష్‌లో స్టాక్ మార్కెట్లు - 18,600 సమీపంలో ముగిసిన నిఫ్టీ!
Stock Market News: ఆల్‌టైమ్ హై వైపు పరుగులు - ఇంట్రాడేలో 63,026 టచ్ చేసిన సెన్సెక్స్!
Stock Market News: స్టాక్ మార్కెట్లో లక్ష్మీ కళ! నేడు రూ.3 లక్షల కోట్లు లాభపడ్డ మదుపర్లు!
Stock Market News: సెన్సెక్స్‌కు రిలయన్స్ బూస్ట్! 62,000 పైన ట్రేడింగ్!
Stock Market News: పాజిటివ్ నోట్‌లో క్లోజైన సెన్సెక్స్, నిఫ్టీ - ఎఫ్‌ఎంసీజీ, ఆటో, రియాల్టీ ర్యాలీ!
BRS Politics : కలిసి నడిచేందుకు వచ్చిన వారందర్నీ దూరం పెడుతున్న కేసీఆర్ - జాతీయ వ్యూహం మారిపోయిందా ?
AP Cabinet Meeting : ఏడో తేదీన ఏపీ కేబినెట్ భేటీ - ముందస్తు నిర్ణయాలుంటాయా ?
కాంగ్రెస్‌లోకి జూపల్లి, పొంగులేటి- సంకేతాలు ఇచ్చిన ఈటల !
Samantha Chappal Cost : ద్యావుడా - పవన్ షూ కంటే సమంత చెప్పుల రేటు డబుల్!
NTR Workouts For Devara : సెలవుల్లోనూ రెస్ట్ తీసుకొని 'దేవర' - విదేశాల్లో వర్కవుట్స్