By: ABP Desam | Updated at : 21 Oct 2022 09:30 AM (IST)
Edited By: Arunmali
బంపర్ ప్రాఫిట్ ప్రకటించిన ఐటీసీ
ITC Q2 Results: కోల్‌కతా కేంద్రంగా సిగరెట్-టు-హోటల్స్ బిజినెస్ చేస్తున్న సమ్మేళనం ITC లిమిటెడ్, ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలోని ఆదాయాలు, వ్యయాలు, మిగులును గురువారం ప్రకటించింది. 13% లాభ వృద్ధిని సాధిస్తుందన్న మార్కెట్ అంచనాలను ఇది దాటి ముందుకు దూసుకెళ్లింది.
30 సెప్టెంబర్, 2022తో (Q2FY23) ముగిసిన త్రైమాసికంలో, ITC ఏకీకృత నికర లాభం రూ. 4619.77 కోట్లకు చేరింది. కంపెనీ సిగరెట్‌లు, స్నాక్స్‌కు డిమాండ్ పెరగడంతో, లాభంలో గత ఏడాది కంటే 24% వృద్ధిని నమోదు చేసింది. క్రితం ఏడాది ఇదే కాలంలో కంపెనీ రూ. 3,713.76 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ఆర్జించింది.
ఆ అర్థిక సంవత్సరం జూన్ త్రైమాసికంలో (Q1FY23) ఈ FMCG మేజర్ ఏకీకృత పన్ను తర్వాతి లాభం (PAT) రూ. 4389.76 కోట్లుగా ఉంది. సీక్వెన్షియల్ (QoQ) ప్రాతిపదికన లాభం 5% పెరిగింది.
కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం (ఆపరేటింగ్ రెవెన్యూ) గత ఏడాది సెప్టెంబర్ త్రైమాసికంలోని రూ. 14,844 కోట్ల నుంచి ఈ ఏడాది సెప్టెంబర్ త్రైమాసికంలో 25% పెరిగి రూ. 18,608 కోట్లకు చేరుకుంది.
2022-23 సెప్టెంబర్ త్రైమాసికంలో కంపెనీ మొత్తం ఖర్చులు రూ. 12,824 కోట్లుగా ఉన్నాయి. గత ఏడాది ఇదే కాలంలోని రూ. 10,258 కోట్లతో ఇవి కూడా 25% పెరిగాయి.
సిగరెట్ వ్యాపారం
విభాగాల వారీగా చూస్తే... సిగరెట్ వ్యాపారం నుంచి వచ్చిన ఆదాయం గత సంవత్సరం కంటే 23.3% పెరిగింది. సిగరెట్‌లపై కేంద్ర ప్రభుత్వం పన్నులు పెంచకపోవడం, అక్రమంగా తరలివస్తున్న సిగరెట్లను అడ్డుకోవడానికి ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు గట్టిగా పని చేయడంతో ఈ కంపెనీ వ్యాపారంలో నిరంతర వృద్ధి కనిపించింది.
వ్యవసాయ వ్యాపారం
గోధుమ, బియ్యం, ఆకు పొగాకు ఎగుమతుల ద్వారా వ్యవసాయ వ్యాపార విదేశీ ఆదాయంలో బలమైన వృద్ధిని నమోదు చేసింది.
హోటళ్ల వ్యాపారం
హోటల్స్ వ్యాపారం నుంచి వచ్చే ఆదాయం గత ఏడాది సప్టెంబర్ త్రైమాసికం కంటే ఈసారి బలంగా 81.9% పెరిగింది. ప్రయాణాల మీద కరోనా వైరస్ సంబంధిత పరిమితులు ఎత్తివేయడంతో హోటళ్ల వ్యాపారం పుంజుకుంది. రిటైల్ (ప్యాకేజీలు), లీజర్ ట్రిప్స్, వెడ్డింగ్స్, MICE విభాగాల్లో వ్యాపారంలో పెరిగి ARR, ఆక్యుపెన్సీ స్థాయులు కొవిడ్ పూర్వ స్థాయి కంటే వృద్ధి చెందాయి.
పండుగ సీజన్ ప్రారంభమై కొనుగోళ్లు ఊపందుకున్నా, అధిక ద్రవ్యోల్బణం వల్ల దేశంలోన కొన్ని ప్రాంతాల్లో వినియోగ వ్యయాలు కొంతమేర తగ్గాయని పోస్ట్ రిజల్ట్స్ కాల్‌లో కంపెనీ పేర్కొంది.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, కోవిడ్-19 దీర్ఘకాలిక ప్రభావం, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, సరఫరా గొలుసు అంతరాయాలతో ఇబ్బందులు పడిన ITC వంటి కన్జ్యూమర్ కంపెనీలకు.. ఇటీవలి కాలం నుంచి తగ్గుతున్న ముడి సరుకుల వ్యయాలు ఒక ఊరట. ఫలితంగా, భవిష్యత్ త్రైమాసికాల్లో ఈ తరహా కంపెనీల ఆదాయాలు మరింత పెరగవచ్చు.
స్టాక్ మార్కెట్‌లో, గురువారం సెషన్ ముగింపు సమయానికి రూ. 349.70 రూపాయల దగ్గర ఈ షేరు ఆగింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Investment Ideas 2025: NFO అంటే ఏంటి? - రూ.100తో పెట్టుబడి ప్రారంభించొచ్చు, దీర్ఘకాలంలో డబ్బుల వర్షం!
Mutual Funds SIP: 'సిప్'లో చారిత్రాత్మక మార్పు - కేవలం రూ.250తో మ్యుచువల్ ఫండ్స్‌ను కొనొచ్చు!
Investing In SIP: ప్రతి నెలా రూ.1000 SIP చేస్తే మీరు ఎన్ని సంవత్సరాల్లో రూ.కోటి సంపాదిస్తారు?
Trisha: త్రిష ఇంట విషాదం... క్రిస్మస్ రోజు కుమారుడిని కోల్పోయానంటూ హీరోయిన్ ఎమోషనల్
Year Ender 2024: 2024లో పెట్టుబడిదార్లను ధనవంతులుగా మార్చిన టాప్-10 మ్యూచువల్ ఫండ్స్
Disqualification on Jagan: లీవ్ లెటర్ ఇస్తే జగన్‌పై అనర్హతా వేటు లేనట్లే - స్పీకర్, డిప్యూటీ స్పీకర్ కీలక వ్యాఖ్యలు
Monalisa Viral Video: మోసం బాసూ... మోనాలీసా కాదు.
Delhi BJP CM Parvesh Verma: జెయింట్ కిల్లర్‌కే ఢిల్లీ సీఎం పదవి- పర్వేశ్ వర్మ పేరు దాదాపు ఖరారు!
Andhra Pradesh Liquor Rates:ఏపీలో పెరిగిన మద్యం ధరలు- రూ. 10 పెంచిన ఎక్సైజ్ శాఖ