By: ABP Desam | Updated at : 16 Sep 2022 09:53 AM (IST)
Edited By: Arunmali
రూ.11,677 కోట్ల జాక్‌పాట్ కొట్టిన గుజరాత్ ఇన్వెస్టర్
Gujarat investor: స్టాక్ మార్కెట్‌లో ఎప్పుడూ టెన్షన్లే కాదు, అప్పుడప్పుడు కొన్ని విచిత్ర సంఘటనలు, అనుభవాలు ఎదురవుతుంటాయి. వీటిలో ఎక్కువ శాతం సాంకేతిక సమస్యలతో ఏర్పడేవే. టెక్నికల్ గ్లిచెస్ వల్ల ఫ్యూచర్స్ & ఆప్షన్స్ విషయంలో అప్పుడప్పుడు ఇబ్బందులు ఎదురవడం రెగ్యులర్ ఇన్వెస్టర్లకు అనుభవమే. స్ట్రైక్ ప్రైజ్‌లు సరిగా అప్‌డేట్ కాక, వాళ్ల ప్రమేయం లేకుండానే కొంతమంది లక్షలాది రూపాయలు కోల్పోతారు, మరికొందరు లక్షల్లో లాభపడతారు.
అసలు విషయానికి వస్తే.. ఇటీవల గుజరాత్‌లోనూ ఈ తరహా సంఘటన జరిగింది. అహ్మదాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి, సాంకేతిక సమస్య కారణంగా కొన్ని గంటల సేపు కోటీశ్వరుడయ్యాడు. రమేష్ సాగర్ అనే స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్‌కు కోటక్ సెక్యూరిటీస్ డీమ్యాట్ అకౌంట్ ఉంది. గత ఐదు, ఆరేళ్లుగా స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెడుతున్న రమేష్ సాగర్, ఒక సంవత్సరం క్రితమే కోటక్‌లో ఖాతా తెరిచాడు.
రూ.11,677 కోట్లు
ఈ ఏడాది జులై 26న, రమేష్ సాగర్ అకౌంట్‌లోకి లక్ష, కోటి కాదు.. ఏకంగా 11 వేల 677 కోట్లు వచ్చి పడ్డాయి. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టేందుకు బ్రోకింగ్ కంపెనీలు ఇన్వెస్టర్లకు మార్జిన్ పేరిట కొంత మొత్తాన్ని అందిస్తుంటాయి, అదే రోజు సాయంత్రం వడ్డీతో కలిపి తిరిగి తీసేసుకుంటాయి. రమేష్ సాగర్‌కు కూడా మార్జిన్ రూపంలోనే ఈ 11,677 కోట్ల రూపాయల మొత్తం కనిపించింది. టెక్నికల్ సమస్య వల్ల ఇది జరిగింది.
రూ.5 లక్షల లాభం
వేల కోట్ల రూపాయల డబ్బు తన అకౌంట్‌లో క్రెడిట్ అయిన విషయాన్ని నిమిషాల్లో పసి గట్టిన రమేష్ సాగర్, బుర్రకు పదును పెట్టాడు, తక్షణం రంగంలోకి దిగాడు. 11,677 కోట్ల రూపాయల నుంచి దాదాపు 2 కోట్లను ఇమ్మీడియట్‌గా స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడిగా పెట్టాడు. దాని మీద 5 లక్షల రూపాయల లాభం కూడా సంపాదించాడు. తప్పుగా తన ఖాతాలోకి వచ్చిన డబ్బును బ్యాంక్ వెనక్కి తీసుకుంటుందని ముందే ఊహించిన సదరు ఇన్వెస్టర్, 11,677 కోట్ల రూపాయలను ఖాతాలో అలాగే ఉంచి, తాను సంపాదించిన లాభం 5 లక్షల రూపాయలను మాత్రం తక్షణం డ్రా చేశాడు.
సాంకేతిక తప్పిదం వల్ల డబ్బు రూటు మారిందని తెలుసుకున్న కోటక్ బ్యాంక్, రెండు గంటల్లోనే 11,677 కోట్ల రూపాయలను వెనక్కు తీసుకుంది. ఐతే, రమేష్ సాగర్‌కు మాత్రం అయాచితంగా 5 లక్షల రూపాయలు మిగిలాయి.
ఆ రోజున, అంటే జులై 26న రమేష్ సాగర్ మాత్రమే కాదు, మరికొందరు డీమ్యాట్ ఖాతాదారులు కూడా ఈ జాక్‌పాట్ కొట్టినట్లు సమాచారం.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని 'ఏబీపీ దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Investment In Mutual Funds: కేవలం రూ.250తో SIP స్టార్ట్ చేయొచ్చు, కొత్త ప్లాన్ తీసుకొస్తున్న సెబీ
Top Mutual Funds: ఇలాంటి ఫండ్స్ చేతిలో ఉంటే చాలు, టాప్ క్లాస్ రిటర్న్స్‌తో మీ కోసం డబ్బు సంపాదిస్తాయి
Monthly Income: మ్యూచువల్ ఫండ్ నుంచి నెలనెలా ఆదాయాన్ని ఇచ్చే సిస్టమాటిక్ విత్‌డ్రాల్ ప్లాన్
Investment Options: 'గోడ మీద పిల్లి' ఫార్ములా, మ్యూచువల్ ఫండ్స్‌లో బాగా పని చేస్తుంది
Mutual Fund SIPs: 'సిప్' పెట్టుబడిని మీ ఇష్టం వచ్చినట్లు మార్చుకోవచ్చు, ఈ 4 టైప్స్‌లో ఒకదాన్ని ఫాలో కావచ్చు
Uttam Kumar Reddy to visit Medigadda: మేడిగడ్డ సందర్శించాలని మంత్రి ఉత్తమ్ నిర్ణయం, వెంట వాళ్లు ఉండాలని అధికారులకు ఆదేశాలు
YSRCP Gajuwaka : వైసీపీకి గాజువాక ఇంచార్జ్ గుడ్ బై - వెంటనే గుడివాడ అమర్నాథ్‌కు బాధ్యతలు !
Hyderabad News: ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన ఎండీ సజ్జనార్ - 'మహాలక్ష్మి' పథకంపై పరిశీలన, ఇబ్బందులుంటే ఈ నెంబర్లకు కాల్ చేయాలని సూచన
Highest Selling Hatchback Cars: నవంబర్‌లో అత్యధికంగా అమ్ముడుపోయిన హ్యాచ్‌బాక్‌లు ఇవే - కొనసాగుతున్న మారుతి సుజుకి హవా!
/body>